రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

నైపర్ మొహాలి నుండి రోగనిరోధక శక్తిని పెంపొందించే హెర్బల్ టీ

Posted On: 23 JUN 2020 2:45PM by PIB Hyderabad

కోవిడ్ మహమ్మారిపై పోరాడటానికి జాతీయ ఔషధ విద్య మరియు పరిశోధన సంస్థలు (నైపెర్ లు) భద్రతా పరికరాలు, శానిటైజర్లు, మాస్కులు వంటి అనేక వినూత్న ఉత్పత్తులను ప్రవేశపెట్టాయి.  అదే సమయంలో, వైరస్ సోకకుండా, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే హెర్బల్ టీ ని కూడా ఈ సంస్థ తీసుకు వచ్చింది.

 

కోవిడ్-19 చికిత్సకు ఇంకా కొత్త ప్రభావవంతమైన ఔషధం మరియు వ్యాక్సిన్ అందుబాటులో లేనందున, ప్రజలు బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం చాలా ముఖ్యం, తద్వారా వారు ఎలాంటి వైరస్ తో నైనా సులభంగా పోరాడవచ్చు మరియు తమను తాము సురక్షితంగా ఉంచుకోవచ్చు.  ఇది దృష్టిలో ఉంచుకుని, మొహాలిలోని ఎస్.ఏ.ఎస్. నగర్ వద్ద ఉన్న నైపర్ కు చెందిన సహజ ఉత్పత్తుల విభాగం రోగనిరోధకశక్తిని పెంపొందించే హెర్బల్ టీ ని అభివృద్ధి చేసింది.  ఈ హెర్బల్ టీ శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందనను సవరించడానికి ఉద్దేశించబడింది, తద్వారా ఇది కోవిడ్-19 వైరల్ వ్యాప్తికి వ్యతిరేకంగా, ఒక నివారణ శక్తిగా పనిచేస్తుంది. 

 

ఒక బలమైన రోగనిరోధక వ్యవస్థ వ్యక్తులను అంటువ్యాధుల నుండి రక్షిస్తుంది మరియు బ్యాక్టీరియా, వైరస్ తో పాటు ఇతర రకాల విష ఉత్పత్తుల వంటి వ్యాధికారక సూక్ష్మ జీవిని తటస్తం చేసి తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రోగనిరోధక ప్రతిస్పందన యొక్క మాడ్యులేషన్ యాంటీ-వైరల్ / యాంటీ-మైక్రోబియల్ ఔషధాలకు ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.  మూలికలు ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయి, అంటే అవి నిర్దిష్ట మరియు నిర్దిష్టంకాని రోగనిరోధక ప్రతిస్పందనలను ఉత్పత్తి చేస్తాయి.

 

ఈ హెర్బల్ టీ ని స్థానికంగా లభించే 6 మూలికలు - అశ్వగంధ, గిలో, ములేతి, తులసి మరియు గ్రీన్ టీ లను కలిపి తయారుచేశారు. రోగనిరోధక శక్తిని పెంచే, జ్ఞానేంద్రియాల విజ్ఞప్తి, తయారీ సౌలభ్యం మరియు ఆమోదయోగ్యమైన రుచి  వంటి చర్యలను దృష్టిలో ఉంచుకుని,  వీటిని, జాగ్రత్తగా, ఎంపిక చేసిన నిష్పత్తిలో కలుపుతారు.  ఆయుర్వేదంలో వివరించిన రసాయన భావన పై ఆధారపడి ఈ మూలికలను ఎంపిక చేశారు. రసాయన అంటే నవీకరణ (కాయకల్ప) అని అర్ధంఈ మూలికలు చాలాకాలంగా వివిధ ఆయుర్వేద సూత్రీకరణల్లో ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇవి రోగ నిరోధక చికిత్సావిధానంలో చాలా  ప్రసిద్ది చెందినవి.  ఈ మూలికలు జీవ కణ సంబంధమైన రోగనిరోధక శక్తి స్థాయిలో పనిచేస్తాయి.  వైరస్ లు, బాక్టీరియాల తో సంక్రమించే వ్యాధులపై పోరాడటానికి వీలుగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.  గరిష్ట స్థాయిలో రోగనిరోధక శక్తిని పెంపొందించే విధంగా ఈ ఫార్ములా రూపొందించారు. 

 

ఈ టీ ని రోజూ మూడు సార్లు తీసుకోవచ్చు.  దీన్ని వృద్ధులూ, పిల్లలు కూడా సురక్షితంగా సేవించవచ్చు.  ఇది గొంతులో గరగర ను తగ్గిస్తుంది, కాలానుగుణంగా వచ్చే ఫ్లూ వంటి సమస్యలతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుంది. ఇది నైపర్ ప్రాంగణంలోని ఔషధ మొక్కల తోట నుండి సేకరించి, సమకూర్చుకున్న వన మూలికలు, వస్తువులతో సంస్థలోనే తయారుచేసిన ఉత్పత్తి.  

 

రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం కింద పనిచేసే జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు - ఈ నైపర్ లు.  దేశవ్యాప్తంగా, ఏడు ప్రదేశాల్లో అహ్మదాబాద్, హైదరాబాద్, హాజీపూర్, కోల్‌కతా, గౌహతి, మొహాలి, రాబరేలి వద్ద ఈ నైపర్ సంస్థలు పనిచేస్తున్నాయి.

 

*****


(Release ID: 1633689) Visitor Counter : 282