వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మ నిర్భర్ భారత్'ను ప్రోత్సహించేలా ప్రభుత్వం కీలక చర్య
జీఈఎంలో అమ్మకందారులు ఆయా వస్తువుల తయారీ దేశ వివరాల వెల్లడి తప్పనిసరి చేస్తూ నిర్ణయం
Posted On:
23 JUN 2020 10:57AM by PIB Hyderabad
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'స్పెషల్ పర్పస్ వెహికల్' (ఎస్‌పీవీ) ఈ- మార్కెట్ ప్లేస్ (జీఈఎం) నందు అమ్మకందారులు కొత్త ఉత్పత్తులను నమోదు చేసే ముందు.. సదరు ఉత్పత్తులు తయారైన దేశపు వివరాలను జోడించడాన్ని సర్కారు తప్పనిసరి చేసింది. జీఈఎంలో ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి ముందే తమ ఉత్పత్తులను అప్‌లోడ్ చేసిన విక్రేతలు, కంట్రీ ఆఫ్ ఆరిజిన్‌ను అప్‌డేట్ చేయడాన్ని క్రమం తప్పక గుర్తు పెట్టుకోవాలని సూచించింది. ఈ విధంగా అప్‌డేట్ చేయడంలో విఫలమైతే వారి ఉత్పత్తులు జీఈఎం నుండి తొలగించబడతాయనే హెచ్చరికనూ జారీ చేసింది. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్రచారం కోసం జీఈఎం ఈ కీలకమైన చర్య తీసుకుంది. ఉత్పత్తులలో స్థానిక సంస్థల శాతాన్ని గుర్తించడానికి జీఈఎం ఈ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనతో మార్కెట్‌లో ఆయా వస్తువులు దేశం యొక్క మూలం, స్థానిక కంటెంట్ శాతం తెలియరానుంది. మరీ ముఖ్యంగా ‘మేక్ ఇన్ ఇండియా’ ఫిల్టర్ ఇప్పుడు పోర్టల్‌లో ప్రారంభించబడింది.
కొనుగోలుదారులు కనీసం 50 శాతం స్థానిక కంటెంట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడానికి.. ఎంచుకోనేందుకు గాను వీలు కలుగునుంది. బిడ్ల విషయంలో, కొనుగోలుదారులు ఇప్పుడు క్లాస్ 1 లోకల్ సప్లయర్స్ (లోకల్ కంటెంట్> 50%) కోసం ఏదైనా బిడ్‌ను రిజర్వు చేసుకోవచ్చు. రూ.200 కోట్ల కంటే తక్కువ విలువ ఉన్న బిడ్లు, క్లాస్ I మరియు క్లాస్ II లోకల్ సప్లయర్స్ (స్థానిక కంటెంట్> 50% మరియు> 20% వరుసగా) మాత్రమే బిడ్ చేయడానికి అర్హులు. ఇందులో క్లాస్ I సరఫరాదారు కొనుగోలు ప్రాధాన్యత పొందుతారు. జీఈఎం పోర్టల్‌లోని లోకల్ కంటెంట్ పీచర్స్ యొక్క కొన్ని రకాల స్నాప్‌షాట్‌లు అనుబంధంలో చూపించబడ్డాయి. జీఈఎం ప్రారంభమైనప్పటి నుండి, జీఈఎం నిరంతరం ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవను ప్రోత్సహించడానికి కృషి చేస్తోంది. జీఈఎం వేదిక మార్కెట్ ప్లేస్ మార్కెట్‌లో చిన్నచిన్న స్థానిక అమ్మకందారులను పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌లోకి అడుగుపెట్టేందుకు గాను వీలు కల్పించింది. అదే సమయంలో ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ప్రభుత్వ ఎంఎస్ఈ కొనుగోలు ప్రాధాన్యత విధానాలను నిజమైన అర్థంలో ఇది అమలు చేస్తుంది.
కోవిడ్ సమయంలో మెరుగైన తోడ్పాటు కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రభుత్వ సంస్థలకు కావాల్సిన ఉత్పత్తులను త్వరగా, సమర్థమంతంగా, పారదర్శకంగా మరియు సరసమైన ధరలకు కొనుగోలు చేసేందుకు వీలుగా జీఈఎం వీలుకల్పిస్తోంది. ఈ జీఈఎం మార్గం ద్వారా ప్రభుత్వ వినియోగదారులు వివిధ కొనుగోళ్లు జరపడాన్ని సర్కారు ఫైనాన్షియల్ రూల్స్-2017నకు కొత్తగా రూల్ నం.149 ను జోడించడం ద్వారా వాటిని అధికారికం మరియు తప్పనిసరి చేసింది.
అనుబంధం
వివరణ: సోషల్ మీడియా పోస్ట్ వివరణ యొక్క స్క్రీన్ షాట్ స్వయంచాలకంగా జనితమవుతుంది.
(Release ID: 1633636)
Visitor Counter : 348
Read this release in:
Punjabi
,
Marathi
,
Bengali
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Odia
,
Malayalam