కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ సమయంలో రెండు కోట్ల మంది భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికులు (బి.ఓ.సి.డబ్ల్యు) 4,957 కోట్ల రూపాయల మేర నగదు సహాయం అందుకున్నారు
Posted On:
23 JUN 2020 12:26PM by PIB Hyderabad
ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా, కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ 2020 మార్చి 24వ తేదీన జారీచేసిన సూచనలకు సలహాకు ప్రతిస్పందనగా, లాక్ డౌన్ సమయంలో, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు రెండు కోట్ల మంది నమోదైన నిర్మాణ కార్మికులకు 4,957 కోట్ల రూపాయల మేర భారీ నగదు సహాయాన్ని పంపిణీ చేసాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి) ద్వారా సుమారు 1.75 కోట్ల లావాదేవీలు నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాల్లోకి జరిగాయి. లాక్లా డౌన్ సమయంలో ప్రతి కార్మికునికి 1000 నుండి 6000 రూపాయల వరకు నగదు ప్రయోజనాలతో పాటు, కొన్ని రాష్ట్రాలు తమ కార్మికులకు ఆహారం మరియు రేషన్ కూడా అందించాయి.
కోవిడ్-19 లాక్ డౌన్ యొక్క సవాలు సమయాల్లో, నిర్మాణ కార్మికుల సంక్షేమం విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర సంక్షేమ బోర్డులతో సమన్వయం చేసుకోవటానికి కేంద్ర మంత్రిత్వ శాఖకు నోడల్ వ్యవస్థగా వ్యవహరించిన కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, అవసరమైన వారికి సకాలంలో నగదు బదిలీ చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ నిర్విరామంగా కృషి చేసింది.
భవన నిర్మాణం మరియు ఇతర నిర్మాణ కార్మికులు (బి.ఓ.సి.డబ్ల్యూ) భారతదేశంలో అసంఘటిత రంగ కార్మికులలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారు. వారు అనిశ్చిత భవిష్యత్తుతో ప్రేరేపించే పరిస్థితులలో పనిచేస్తుంటారు. వారిలో ఎక్కువ శాతం మంది వలస కార్మికులుగా, తమ స్వస్థలాలకు దూరంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తుంటారు. వారు దేశ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారు సమాజానికి దూరంగా జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ కార్మికుల ఉపాధి మరియు సేవా పరిస్థితులను నియంత్రించడానికీ, వారి భద్రత, ఆరోగ్యం మరియు సంక్షేమ చర్యలను అందించడానికీ, భవన నిర్మాణం మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం 1996 రూపొందించబడింది. మహమ్మారి యొక్క కఠినమైన సమయాల్లో నిర్మాణ కార్మికులకు జీవనాధారం అందించడం ద్వారా సెస్ యాక్ట్ తో పాటు ఈ చట్టం కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ చట్టం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర సంక్షేమ బోర్డుల ద్వారా నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తప్పనిసరిగా రూపొందించి, అమలు చేయవలసి ఉంటుంది. ఈ ఫండ్ నిర్మాణ వ్యయాలపై ఒక శాతం సెస్ ను కలిగి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సెస్ ను విధించి, వసూలు చేసి, సంక్షేమ నిధికి జమ చేస్తాయి.
2020 మార్చి 24వ తేదీన కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సకాలంలో ముఖ్యమంత్రులందరికీ సూచనలు జారీ చేశారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి) విధానం ద్వారా నిర్మాణ కార్మికుల బ్యాంక్ ఖాతాలలోకి తగిన నిధుల బదిలీ కోసం ఈ చట్టంలోని సెక్షన్ 22 (1) (హెచ్) కింద ఒక పథకాన్ని రూపొందించాలని రాష్ట్రాలకు సూచించారు. నిర్మాణ కార్మికులకు మంజూరు చేయవలసిన మొత్తాన్ని, వారి జీవనాధారానికి సరిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించవలసి ఉంది. నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడానికి ఈ సలహా జారీ చేయడం జరిగింది. కేంద్ర కార్మిక మరియు ఉపాధి కార్యదర్శి కూడా ఇదే విధమైన లేఖను అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు వ్రాయడంతో పాటు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీవ్రంగా పరిస్థితిని సమీక్షించారు.
కొంతమంది భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికులు, వారి వలస స్వభావం, పని ప్రదేశాలను మార్చడం, తక్కువ స్థాయి అక్షరాస్యత మరియు అవగాహన వంటి కారణాల వల్ల ఇప్పటికీ సంక్షేమ, సహాయ కార్యక్రమాల పరిధికి దూరంగా ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (పి.ఎం-జె.ఏ.వై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి.ఎమ్.జె.జె.బి.వై) ద్వారా జీవితం మరియు అంగవైకల్యానికి బీమా, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పి.ఎం.ఎస్.బి.వై), ప్రధానమంత్రి శ్రమ్-యోగి మాన్ ధన్ యోజన ద్వారా వృద్ధాప్యంలో జీవితకాల పింఛను, పెద్ద నగరాల్లో ట్రాన్సిట్ వసతి వంటి పధకాల ద్వారా, మిగిలిపోయిన కార్మికుల నమోదు, ప్రయోజనాల పోర్టబిలిటీ, ఆరోగ్య భీమాపై సామాజిక భద్రతా పథకాలను విశ్వవ్యాప్తం చేయడం కోసం యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రాజెక్టును ప్రారంభించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
*****
(Release ID: 1633619)
Visitor Counter : 1002