ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 తో పోరాడటానికి పి.ఎం. కేర్స్ ఫండ్ కింద 50,000 మేడ్ ఇన్ ఇండియా వెంటిలేటర్లు

Posted On: 23 JUN 2020 11:15AM by PIB Hyderabad

అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న కోవిడ్ ఆసుపత్రులకు 50,000 ‘మేడ్-ఇన్-ఇండియా’ వెంటిలేటర్లను సరఫరా చేయడం కోసం పి.ఎం.కేర్స్ నిధి ట్రస్ట్ 2,000 కోట్ల రూపాయలు కేటాయించింది.  దీనితో పాటు అదనంగా, వలస కూలీల సంక్షేమం కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించింది.  

 

50,000 వెంటిలేటర్లలో 30,000 వెంటిలేటర్లను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేస్తోంది.  మిగిలిన 20,000 వెంటిలేటర్లలో ఆగ్వా హెల్త్‌కేర్ (10,000), ఎ.ఎమ్.‌టి.జెడ్ బేసిక్ (5,650), ఎ.ఎమ్.‌టి.జెడ్. హై ఎండ్  (4,000), అలైడ్ మెడికల్ (350) తయారు చేస్తున్నాయి.  ఇప్పటివరకు 2,923 వెంటిలేటర్లు తయారుచేయగా, వీటిలో 1,340 వెంటిలేటర్లను ఇప్పటికే రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలకు పంపిణీ చేయడం జరిగింది.   వీటిని అందుకున్న ప్రధాన రాష్ట్రాలలో,  మహారాష్ట్ర (275), ఢిల్లీ (275), గుజరాత్ (175), బీహార్ (100), కర్ణాటక (90), రాజస్థాన్ (75) మొదలైనవి ఉన్నాయి. 2020 జూన్ నెల చివరి నాటికి అదనంగా మరో 14,000 వెంటిలేటర్లు అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలకు పంపిణీ చేయనున్నారు. 

 

వీటికి అదనంగా, వలస కూలీల సంక్షేమం కోసం 1,000 కోట్ల రూపాయలను రాష్ట్రాలు / కేంద్ర పాలితప్రాంతాలకు విడుదల చేయడం జరిగింది.  2011 జనాభా లెక్కల ప్రకారం జన సంఖ్య ప్రాతిపదికన 50 శాతం, కోవిడ్-19 సోకిన కేసుల సంఖ్య ప్రాతిపదికన 40 శాతం చొప్పున పంపిణీ చేయగా, మిగిలిన 10 శాతం నిధులు అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సమానంగా పంపిణీ చేయనున్నారు.  ఈ ఆర్ధిక సహాయాన్ని, వలసదారులకు తగిన వసతి ఏర్పాట్లు, వైద్య చికిత్స మరియు వలసదారుల రవాణా కోసం ఉపయోగించనున్నారు.  ఈ ఆర్ధిక సహాయాన్ని అందుకున్న ప్రధాన రాష్ట్రాలలో, మహారాష్ట్ర (181 కోట్లు), ఉత్తర ప్రదేశ్ (103 కోట్లు), తమిళనాడు (83 కోట్లు), గుజరాత్ (66 కోట్లు), ఢిల్లీ 55 కోట్లు), పశ్చిమ బెంగాల్ (53 కోట్లు), బీహార్ (51 కోట్లు) , మధ్యప్రదేశ్ (50 కోట్లు), రాజస్థాన్ (50 కోట్లు), కర్ణాటక (34 కోట్లు) మొదలైనవి ఉన్నాయి. 

 

*******

 



(Release ID: 1633552) Visitor Counter : 252