ఆర్థిక మంత్రిత్వ శాఖ
గణనీయ ప్రభావాన్ని కనబరుస్తున్న ఎంఎస్ఎంఈ, ఎన్‌బీఎఫ్‌సీల సహయ ప్రభుత్వ పథకాలు
రూ.79,000 కోట్లను దాటేసిన 'క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్' (ఈసీఎల్‌జీఎస్) మంజూరీలు
Posted On:
23 JUN 2020 2:43PM by PIB Hyderabad
దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) నిలబెట్టే దిశగా సర్కారు తీసుకుంటున్న చొరవ కారణంగా ఆయా సంస్థలు చాలా వేగంగా కొలుకుంటున్నాయి. ప్రభుత్వ పూచీకత్తు దన్నుతో ఎమర్జన్సీ క్రెడిట్ లైన్ కింద ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకులు ఇప్పటి వరకు.. అంటే ఈ నెల 20వ తేదీ వరకు రూ.79,000 కోట్ల మేర రుణాలను మంజూరు చేశాయి. అందులో ఇప్పటికే రూ.35,000 కోట్లకు పైగా సొమ్మును పంపిణీ కూడా చేశారు. ఈ పథకం కింద అత్యధికంగా రుణాలు అందించిన వాటిలో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ మరియు కెనరా బ్యాంక్‌లు ఉన్నాయి. ఈ సాయం కారణంగా లాక్‌డౌన్ ముగిసిన తరువాత.. దాదాపు 19 లక్షల ఎంఎస్ఎంఈలు మరియు ఇతర వ్యాపారాలు పునఃప్రారంభం కావడానికి గాను సహాయపడింది.
ఆత్మనీర్భర్ ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం ఎంఎస్ఎంఈ, చిన్న వ్యాపార సంస్థలకు అదనంగా రూ. మూడు లక్షల కోట్ల మేర విలువైన అదనపు రుణాలను అందించేలా ఒక ప్రణాళికను ప్రకటించింది. దీంతో ఆయా సంస్థలు తమ ప్రస్తుత రుణ మొత్తంలో 20 శాతం వరకు వడ్డీ క్యాప్ చేయబడిన అదనపు రుణం పొందటానికి వీలు కల్పించింది. దీనికి అదనంగా ఎంఎస్‌ఎంఈ, చిన్న రుణ గ్రహీతలకు రుణంగా ఇవ్వడానికి ఆర్‌బీఐ మార్చి-ఏప్రిల్‌లో ప్రకటించిన స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ కింద సిడ్బి సంస్థ మొత్తం రూ.10,220 కోట్ల మేర నిధులను ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ రుణ సంస్థలు మరియు ఇతర బ్యాంకులకు అందించింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) తన మొత్తం ఫెసిలిటీ సొమ్ము దాదాపు రూ.10,000 కోట్లను హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు మంజూరు చేసింది. సిడ్బి & ఎన్‌హెచ్‌బీల రీఫైనాన్స్ సొమ్ము మొత్తం.. ఇప్పటికే ఆయా సంస్థలు రూ.30,000 కోట్లతో మంజూరు చేసి ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకు అదనం. విస్తరించిన పాక్షిక హామీ పథకం (ఎక్స్‌టెండెడ్ పార్శియల్ గ్యారంటీ స్కీం) కింద ఎన్‌బీఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐలు మరింత సహాయం అందుతోంది. ఇందులో మంజూరీల మొత్తం రూ. 5500 కోట్లు దాటేశాయి. మరో రూ. 5000 కోట్ల విలువైన లావాదేవీలు ఆమోద ప్రక్రియలో ఉండగా.. మరికొన్ని ఒప్పందాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి.
******
(Release ID: 1633687)
Visitor Counter : 271
Read this release in:
English
,
Gujarati
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam