ఆయుష్
కోవిడ్-19 మహమ్మారి చికిత్స ఔషధానికి సంబంధించి పతంజలి ఆయుర్వేద్ సంస్థ వాదనలపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటన
Posted On:
23 JUN 2020 5:39PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి చికిత్స నిమిత్తం హరిద్వార్ (ఉత్తరాఖండ్) కేంద్రంగా పని చేస్తున్న పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఆయుర్వేద ఔషధం గురించి ఇటీవల మీడియాలో వెలువడుతున్న వార్తల పట్ల ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పందించింది. సంస్థ పేర్కొంటున్న ఆయా వాస్తవాలు మరియు పేర్కొన్న శాస్త్రీయ అధ్యయనపు వివరాలను గురించి తమ మంత్రిత్వ శాఖకు తెలియదని ప్రకటించింది.
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆయుర్వేద ఔషధాలతో సహా వివిధ ఇతరాలకు సంబంధించి ప్రకటనలు చేయడం, అకస్మాత్తుగా వ్యాపింపచేయడం ఔషధాలు మరియు మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954' మరియు దానిలోని నియమాలు, మరియు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం నియంత్రించబడుతున్నాయని దీనికి సంబంధించి ఆయుర్వేద ఔషధ తయారీ సంస్థకు సమాచారం ఇచ్చినట్టు ఆయూష్ శాఖ తెలిపింది. కోవిడ్ -19 పై ఆయూష్ జోక్యంతో కూడిన మందుల పరిశోధనలతో పాటు అధ్యయనాలు చేపట్టాల్సిన విధానాల్ని పేర్కొంటూ ఏప్రిల్ 21వ తేదీన మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ నెం. L.11011 / 8/2020 / AS ను విడుదల చేసింది.
వీలైనంత త్వరగా వివరాలివ్వండి వార్తలలో వాస్తవాలను తమ మంత్రిత్వ శాఖకు తెలిసేలా చేయడానికి మరియు వాదనల ధ్రువీకరణకు, పతంజలి ఆయుర్వేద్ సంస్థ కోవిడ్ -19 చికిత్స కోసం క్లయిమ్ చేస్తున్న ఔషధం పేరు మరియు కూర్పులో వాడిన వివిధ ఔషధాల వివరాలను వీలైనంత త్వరగా అందించాలని సర్కారు కోరింది; పరిశోధనపు అధ్యయనాలు ఏయే ప్రాంతాలు, ఆసుపత్రులలో జరిపారు. ప్రోటోకాల్, నమూనా పరిమాణం, ఇన్‌స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ క్లియరెన్స్, సీటీఆర్ఐ రిజిస్ట్రేషన్ మరియు అధ్యయనం యొక్క ఫలితాల సమాచారం అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఈ సమస్యను సక్రమంగా పరిశీలించే వరకు కోవిడ్‌కు ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చినట్టుగా చేస్తున్న వాదనలను ప్రకటించడం / ప్రచారం చేయడం ఆపాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ కోరింది. కోవిడ్‌కు సంబంధించిన చికిత్స కోసం క్లెయిమ్ చేయబడిన ఆయుర్వేద ఔషధాల యొక్క లైసెన్స్ మరియు ఉత్పత్తి ఆమోదం వివరాలను తమకు అందించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వపు లైసెన్సింగ్ అథారిటీని కూడా మంత్రిత్వ శాఖ కోరింది.
*****
(Release ID: 1633737)
Visitor Counter : 374