PIB Headquarters
కోవిడ్ -19 మీద పిఐబి రోజువారీ బులిటెన్
Posted On:
07 DEC 2020 5:46PM by PIB Hyderabad
(కోవిడ్ కి సంబంధించి గత 24 గంటలలో జారీచేసిన పత్రికాప్రకటనలు, పిఐబి క్షేత్రస్థాయి అధికారులు సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఇందులో ఉంటాయి)
- 140 రోజుల తరువాత కోవిడ్ చికిత్సలో ఉన్నవారి సంఖ్య 4 లక్షల దిగువకు (4,03,248)
- గత 24 గంటలలో కొత్తగా 36,011 మందికి కోవిడ్ సోకగా 41,970 మంది కోలుకున్నారు
- ప్రతి పది లక్షల మందిలో 186 కోవిడ్ కేసులు ; ప్రపంచంలోనే అతి తక్కువ భారత్ లోనే
- కోలుకుంటున్నవారి శాతం మెరుగుపడి నేడు 94.37% కు చేరిక
- గత 24 గంటలలో 482 మరణాలు నమోదు
140 రోజుల తరువాత చికిత్సలో ఉన్నవారి సంఖ్య 4 లక్షల దిగువకు; ప్రతి పది లక్షల్లో కేసులు, మరణాలు ప్రపంచంలోనే అతి తక్కువ; 157 రోజుల తరువాత రోజువారీ మరణాలు 400 లోపు
భారతదేశం ఈ రోజు కీలకమైన మైలురాయిని చేరుకుంది. దేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 4 లక్షలకంటే తక్కువకు ( 3,96,729) చేరింది. ఇది మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో 4.1% మాత్రమే. 140 రోజుల తరువాత ఈ తక్కువ స్థాయికి చేరింది. గత జులై 20న చికిత్సలో ఉన్న వారు 3,90,459 కాగా ఇప్పుడు ఇంకా తగ్గింది. గత 10 రోజులుగా సాగుతున్న ధోరణినే కొనసాగిస్తూ, కొత్తగా వస్తున్న పాజిటివ్ కేసులకంటే ఎక్కువ సంఖ్యలో కోలుకుంటున్నారు. గడిచిన 24 గంటలలో కొత్తగా 32,981 పాజిటివ్ కేసులు నమోదు కాగా 39,109 మంది కోలుకున్నారు. దీంతో తేడా 6,128 కేసుల వలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా 6,519 తగ్గింది. ప్రతి పది లక్షల జనాభాలో వస్తున్న కొత్త కేసులు గత వారం రోజులుగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులకంటే తక్కువగా ఉంది. గత వారం రోజుల కొత్త కేసులు ప్రతి పది లక్షలకు 182 గా నమోదయ్యాయి. ప్రతి పది లక్షల జనాభాలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారత్ లో చాలా తక్కువగా ఉంది. అంతర్జాతీయ సగటు 8,438 కాగా భారత్ లో అది 6,988 గా నమోదైంది. కోలుకున్నవారి శాతం పెరుగుతూ ప్రస్తుతం అది 94.45% అయింది. ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ బాధితుల మొత్తం సంఖ్య 91,39,901. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా 87 లక్షలు దాటి 87,43,172 కు చేరింది. కొత్తగా కోలుకున్నవారిలో 81.20% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే కాగా మహారాష్ట్రలో అత్యధికంగా ఒక రోజులో 7,486 మంది కోలుకున్నారు. ఆ తరువాత స్థానాల్లో ఉన్న కేరళలో 5,217 మంది, ఢిల్లీలో 4,622 మంది కోలుకున్నట్టు నమోదైంది. గత 24 గంటలలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 76.20% కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. ఇందులో కేరళలో అత్యధికంగా 4,777 కొత్త కేసులు రాగా, మహారాష్ట్రలో 4,757, పశ్చిమ బెంగాల్ లో 3,143 నమోదయ్యాయి. గత 24 గంటలలో 391 మరణాలు నమోదయ్యాయి. అందులో 10 రాష్టాలలోనే 75.07% మరణాలున్నాయి. ఢిల్లీలో అత్యధికంగా 69 మంది మరణించగా పశ్చిమ బెంగాల్ లో 46 మంది, మహారాష్ట్రలో 40 మంది చనిపోయారు. ప్రతి రోజూ నమోదవుతున్న కోవిడ్ మరణాలను ప్రతి 10 లక్షల జనాభాకు లెక్కించి చూస్తే, అంతర్జాతీయంగా పోల్చి చూసినపుడు కూడా భారత్ లో అతి తక్కువగా పది లక్షల జనాభాకు మూడు మాత్రమే ఉన్నాయి. ఎప్పటికప్పుడు మొత్తం మరణాల జాబితా చూసినా, దేశంలో ప్రతి పది లక్షల మందిలో నమోదైన మరణాలు 101 కాగా అది ప్రపంచంలోనే అతి తక్కువ.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678706
ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిన ప్రధాని
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నగరంలో ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్ పనులను ప్రధాని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి సాఖామంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖ్హులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఎన్నో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించినప్పటికీ వాటికి డబ్బు ఎక్కదనుంచి తేవాలో అర్థం కాక పూర్తి చేయటం మీద దృష్టిపెట్టకపోవటం పెద్ద లోపమన్నారు. తమ ప్రభుత్వం మాత్రం తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నట్టు నిర్థారించుకున్నమీదటనే ప్రాజెక్టులు ప్రకటిస్తూ వస్తున్నదన్నారు. నేషనల్ ఇన్ఫ్రా స్ట్రక్ఛర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ కు 100 లక్షల కోట్లు కేటాయించామన్నారు. దేశ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రపంచవ్యాప్తంగా నిధులను రాబట్టటానికి ఆకర్షించగలుగుతున్నామన్నారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678877
ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం కోసం:
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678884
ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ -2020 లో రేపు ప్రసంగించనున్న ప్రధాని
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేఫు ( డిసెంబర్ 8న ఉదయం 10.45 కి ) ఇండియా మొబైల్ కాంగ్రెస్ వర్చువల్ సమావేసంలో ప్రారంభోపన్యాసం చేస్తారు. ఈ సమావేశాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ, భారత సెల్యులార్ ఆపరేటర్ల సంఘుంమ్మడిగా నిర్వహిస్తున్నాయి. 8 నుంచి 10 వరకు జరిగే ఈ సమావేశాలు నవకల్పనలలో అందరి భాగస్వామ్యం- చురుకైన, సురక్షితమైన, సుస్థిరమైన విధానం సాధించటం మీద ప్రధానంగా దృష్టి సారిస్తాయి. ప్రధాని ఆలోచన అయిన ఆత్మ నిర్భర్ భారత్ కు అనుగుణంగా డిజిటల్ అభివృద్ధిలో అందరినీ కలుపుకోవటం, సుస్థిరాభివృద్ధి, వ్యాపార దక్షత, నవకల్పనలు అనే అంశాలమీద సమావేశాలు సాగుతాయి. విదేశీ, స్థానిక పెట్టుబడులు సమకూర్చుకోవటం, పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించటం, సరికొత్త పరిజ్ఞానాన్ని వాడుకోవటం మీద కూడా దృష్టిపెడతాయి.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678876
ఐఐటి- గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని కీలకోపన్యాసం
పాన్ ఐఐటి యు ఎస్ ఎ శుక్రవారం నాడు నిర్వహించిన ఐఐటి-2020 గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలకోపన్యాసం చేశారు. సంస్కరించు, పనిచేయి, మార్చు అనే సూత్రానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. సంస్కరణల పరిధి నుమ్చి ఏ ఒక్క రంగానికీ మినహాయింపు లేదన్నారు. కార్మిక రంగం సహా వివిధ రంగాలలో తీసుకొచ్చిన సంస్కరణలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతి తక్కువ కార్పొరేట్ టాక్స్ విధించటం, తయారీ రంగంలో ఉత్పత్తితో అనుసంధానమైన ప్రోత్సాహకాలివ్వటం లాంటి పథకాలను కూడా గుర్తు చేశారు. ఈ కోవిడ్ కష్టకాలంలో కూడా టెక్నాలజీ రంగంలోకి భారీగా పెట్టుబడులు ఆకర్షించగలిగామన్నారు. నేటి చర్యలు రేపటి ప్రపంచాన్ని తీర్చిదిద్దుతాయని, పునరధ్యయనం, పునరాలోచన, పునర్నవకల్పన మీదనే కోవిడ్ అనంతర దృష్టి ఉంటుందన్నారు. కరోనా సమయంలో పరిశ్రమకు, విద్యాసంస్థలకు మధ్య అనుసంధానం కారణంగా అనేక నూతన ఆవిష్కరణలు వెలుగు చూశాయని, ప్రపంచం ఇప్పుడు కొత్త వాతావరణానికి అలవాటు పడేలా కొత్త పరిష్కారాలకోసం చూస్తున్నదన్నారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678671
పాన్ ఐఐటి గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని కీలకోపన్యాసం కోసం : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678622
భువనేశ్వర్ లో జరగబోయే సిఎస్ ఐ ఆర్ –ఐఐఎంటి కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లను ప్రారంభించిన డాక్టర్ హర్ష వర్ధన్.
కేంద్ర శాస్త్ర సాంకేతికాభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి దాక్టర్ హర్ష వర్ధన్ భువనేశ్వర్ లో జరిగే సిఎస్ ఐ ఆర్ –ఐఐఎంటి కార్యక్రమం 6వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2020 ముందస్తు ఏర్పాట్లను శనివారం నాడు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. కేంద్ర చమురు, సహజవాయువు, ఉక్కు శాఖామంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిఎస్ ఐ ఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే, సిఎస్ ఐ ఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శుద్ధసత్వ బసు కూడా ఇందులో పాల్గొన్నారు. స్వావలంబ భారత్- ప్రపంచ సంక్షేమం ప్రధానాంశంగా జరిగే ఐఐ ఎస్ ఎఫ్ -2020 లో ప్రారంభోపన్యాసం చేస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సదస్సుకు ఎంచుకున్న అంశం ఎంతో సరిపోతుందన్నారు. ఇది మన ప్రధాని ఆత్మ నిర్భర్ భారత్ ఆలోచనలకు అద్దం పడుతోందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించాలన్న ఆలోచనలకు అనుగుణంగా ఉందన్నారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678661
2వ కాన్సర్ జీనోమ్ అట్లాస్ -2020 సదస్సును వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించిన డాక్టర్ హర్ష వర్ధన్
శాస్త్ర సాంకేతికాభివృద్ధి శాఖామంత్రి, సిఎస్ ఐఆర్ ఉపాధ్యక్షుడు అయిన డాక్టర్ హర్ష వర్ధన్ 2వ కాన్సర్ జీనోమ్ అట్లాస్ -2020 సదస్సును శుక్రవారం నాడు న్యూ ఢిల్లీలో వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ, అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ కాన్సర్ భారాన్ని తగ్గించుకోవాలని దేశం పట్టుదలతో ఉన్నదన్నారు. ఇందులో భాగంగా జీనోమిక్స్, ప్రొటియోమిక్స్, మెటబాలొమిక్స్, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ లాంటివి వినియోగించుకుంటామన్నారు. ఈ క్రమంలో ప్రతి రోగికీ రోగకరనాన్ని సునిశితంగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. భారత్ జనాభాలో కాన్సర్ బారిన పడినవారి సమాచారాన్ని బహిరంగంగా అందుబాటులో ఉంచటం ద్వారా పరిశోధనలకు అవకాశం కల్పిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, డాక్టర్లతో కూడిన కన్సార్షియం ఇండియన్ కాన్సర్ జీనోమిక్స్ అట్లాస్ తయారీకి చేస్తున్న కృషిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678626
ఆయుష్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఏర్పాటుకు నిర్ణయం
వాణిజ్య మంత్రిత్వశాఖ, ఆయుష్ మంత్రిత్వశాఖ కలిసి ఉమ్మడిగా ఆయుష్ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించటానికి ఎగుమతుల ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇటీవల జరిగిన ఆయుష్ వర్తకం, పరిశ్రమల విభాగాల ఉమ్మడి సమీక్షా సమావేశంలో వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఆయుష్ శాఖామంత్రి శ్రీ శ్రీపాద నాయక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఆయుష్ రంగాన్ని సమీక్షించటంతోబాటు ధరలు, పోటీ తట్టుకోగల సామర్థ్యాన్ని అంచనావేయటం ద్వారా ఎగుమతులు పెంచటం మీద దృష్టి సారించాలని నిర్ణయించారు. డిసెంబర్ 4న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష జరిగింది. ఆయుష్ రంగంలో పరిశ్రమ, వర్తక విభాగాలకు చెందిన 50 మంది ఈ సమీక్షలో పాల్గొన్నారు. 2000 మందికి పైగా ఈ రంగ భాగస్వాములు కూడా ఈ లైవ్ లో హాజరయ్యారు. ఆయుష్ కార్యదర్శి ముందుగా ప్రజెంటేషన్ ద్వారా పరిస్థితి వివరించి చర్చకు తెరతీశారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678727
కోవిడ్ ప్రభావం నుంచి బైటపడి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ముందు వరుసలో ఉంటుంది: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్
వచ్చే కొద్ది సంవత్సరాలలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకుంటూ భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థలలో ఒకటి అవుతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్దారు. కోవిడ్ ప్రభావం నుంచి బైటపడి అన్ని రంగాలలో బంతిలా పైకి లేస్తుందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం యాభయ్యేళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన వెబినార్ లో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం వ్యవసాయం, ఆధునిక వైద్యం, సంప్రదాయ వైద్యం, నూతన విద్యావిధానం, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు, కార్మిక రంగం సహా అన్ని రంగాలలో సంస్కరణలతోబాటు తగిన చర్యలు కూడా తీసుకున్నదన్నారు. ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటి కావటమే భారత్ లక్ష్యమన్నారు. కరోనా సంక్షోభం అనేక విషయాలలో మార్పులు తీసుకువచ్చిందని, పనులు కొత్తగా చేయటం నేర్పిందని ఇవన్నీ కోవిడ్ అనంతరం కూదా కొనసాగుతాయని గుర్తుచేశారు. ఇదే ఉత్సాహంతో కొనసాగేలా మన ఆర్థిక వ్యవస్థ కూడా కొత్తదనంతో ఉంటుందని చెప్పారు. మొదటి త్రైమాసికం తరువాత ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకుంటున్నదని గుర్తు చేస్తూ, మరికొద్ది త్రైమాసికాలలోనే పరిస్థితి యథాపూర్వ స్థితికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 20-30 ఏళ్లలో సగటున 7-8 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుంటూ 2047 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678881
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై నాలుగవ దక్షిణాసియా ఫోరమ్
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై దక్షిణాసియా ఫోరమ్ 4వ సదస్సు నేపథ్యంలో యునెస్కాప్ దక్షిణాసియా, పసిఫిక్ ఒక వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసింది. దక్షిణాసియాలో వైపరీత్యాలు, వాతావరణం కోలుకోవటం మీద శుక్రవారం నాడు ఒక ప్రత్యేక చర్చకు శ్రీకారం చుట్టింది. ఈ ఉన్నత స్థాయి సమావేశ ప్రధానోద్దేశ్యం వైపరీత్యాలు, ప్రజారోగ్యంలో రిస్క్ నిర్వహణకు వీలున్న అవకాశాలను గుర్తించటం, అమలు చేయటంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలగటం. హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దక్షిణాసియా దేశాలు తీవ్రమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులనెదుర్కుంటున్నాయని, అందులో వరదలు, తుపాన్లు, వడగాలులు, శీతలగాలులు, కొందచరియలు విరిగిపడటం, కరవు తోబాటు కరోనా లాంటి సమస్యలు వచ్చి పడుతున్నాయన్నారు. దక్షిణాసియా దేశాలన్నిటికీ ప్రజారోగ్యం అతిపెద్ద సవాలుగా మారటాన్ని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు అందరూ ఉమ్మడి సహకారంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678545
భారత మత్స్య రంగానికి కోవిడ్ సరికొత్త మార్పు కాగలదు: ఉపరాష్ట్రపతి
కోవిడ్ కారణంగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం వైపు చూస్తున్న నేపథ్యంలో భారత మత్స్య రంగానికి అత్యంత అనుకూల వాతావరణం ఉండవచ్చునని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు చెప్పారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన కేంద్ర సముద్ర మత్స్య పరిశోధనా సంస్థ (సి ఎం ఎఫ్ ఆర్ ఐ), కేంద్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ( సి ఐ ఎఫ్ టి) లో శాస్త్రవేత్తలు, సిబ్బందినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎక్కువ మాంస కృత్తులున్న ఆహారంగా చేపలు మనదేశ పౌష్ఠికాహార లోపానికి, ముఖ్యంగా పిల్లల్లో లోపానికి జవాబు కాగలవన్నారు. ఈ విషయంలో ఆరోగ్య నిపుణులు, పౌష్ఠికాహార నిపుణులు ప్రజలలో అవగాహన పెంచి ఆహారంలో చేపల వాడకం పెంచేలా చూడాలన్నారు. ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు మన ఆహారంలో ఉండటం చాలామేలు చేస్తుందన్నారు. మన గుందె ఆరోగ్యానికి ఎంతో అవసరమని గుర్తు చేశారు. సామాన్యులకు కూదా ఈ విషయాలు అర్థమయ్యేలా వివరించాల్సి ఉందన్నారు.
వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678472
పిఐబి క్షేత్ర స్థాయి అధికారులు అందించిన సమాచారం
- అస్సాం: అస్సాం లో నిన్న మొత్తం 11514 పరీక్షలు జరపగా 97 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో పాజిటివ్ శాతం 0.84% గా నమోదైంది. 84 మంది నిన్న డిశ్చార్జ్ కాగా మొత్తం 213759 మంది కోలుకున్నట్టయింది. దీంతో కోలుకున్నవారి శాతం 97.87% అయింది. చికిత్సలో ఉన్న కేసులు మొత్తం కేసులలో 1.66%, ఉన్నట్టు రాష్ట ఆరోగ్య శాఖామంత్రి ట్వీట్ చేశారు.
- సిక్కిం: సిక్కిం లో కొత్తగా 27 కోవిడ్ కేసులు రాగా మొత్తం కేసుల సంఖ్య 5,194 కి చేరింది.
- కేరళ: మూడంచెల స్థానిక సంస్థల ఎన్నికలు కేరళలో రేపు మొదలవుతున్నాయి. కోవిడ్ జాగ్రత్తలలో భాగంగా పోలింగ్ కేంద్రాలన్నీ శానిటైజ్ చేశారు. కరోనా సంక్షోభం మధ్య ఈ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో పోలింగ్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలతో రాష్ట ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీచేసింది. రోజువారీ కొత్త కేసులు తగ్గుతూ ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోందని ఆరోగ్య శాఖామంత్రి కెకె శైలజ అన్నారు. .ప్రజారోగ్య నిపుణులు సైతం ఎన్నికల తరువాత కొత్త కేసులు పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. పోలింగ్ సమయంలో ముగ్గురు మించి ఒకేసారి బూత్ లో ఉండటానికి అనుమతించరు. 10 రోజుల కిందట పాజిటివ్ గా తేలినవారు ముందురోజు సాయంత్రం 3 గంటలవరకు పోస్టల్ బాలెట్ వాడుకోవచ్చు. రేపు పోలింగ్ జరిగే ఐదు జిల్లాల్లో 11,225 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. మొత్తం 88.26 లక్షలమంది వోటర్లు 23,584 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చబోతున్నారు.
- తమిళనాడు: ఆదివారం నాడు మరో 1,320 మంది కోవిడ్ పాజిటివ్ గా తేలటంతో రాష్టంలో మొత్తం కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 7,90,240 కు చేరింది. గత 24 గంటలలో 60 ఏళ్ళు పైబడ్డ 16 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాలు 11,793 కు చేరాయి. ఎం ఎస్ ఎం ఇ సంస్థలు కోవిడ్ కారణంగా బాగా దెబ్బతినగా ఇప్పుడు ముడి సరకు ధరలు పెరగటంతో ఇబ్బందుల్లో పడినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి
- కర్నాటక: ఎక్కువ జిల్లాలు కోవిడ్ పరీక్షల లక్ష్యాలు చేరుకోలేకపోయాయి. చిక్ మగళూర్, బెంగళూరు అర్బన్ మాత్రమే లక్ష్యాలకు మించి పరీక్షలు జరిపాయి. రాష్ట్రంలో ఐసియు కేసులు గణనీయంగా తగ్గి ప్రస్తుతం 280 మాత్రమే ఉన్నాయి.. కొత్త సంవత్సరం వేడుకలమీద ఆంక్షలు విధించటంమీద త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది.
- ఆంధ్రప్రదేశ్: అంతుచిక్కని వ్యాధి సోకినవారితో ఏలూరు ప్రభుత్వాస్పత్రి కిటకిటలాడుతోంది. ఇప్పటివరకు 340 మంది ఈ వ్యాధి బారిన పడ్దారు. ఒకరు మరణించినట్టు వెల్లడైంది. కళ్ళు తిరగటం, నోటి నుంచి నురగ రావటం, మూర్ఛ వంటి లక్షణాలతో శనివారం సాయంత్రం నుంచి బాధితులు ఆస్పత్రిలో చేరుతూ ఉన్నారు. వీరందరి రక్త నమూనాలు సేకరించి పరీక్షించటంతోబాటు కోవిడ్ పరీక్షలు జరపగా ఎవరికీ కోవిడ్ నిర్థారణ కాలేదని ఆస్పత్రి డాక్టలు చెప్పారు.వ్యాధి కారణాలను అన్వేషించటానికి ఎయిమ్స్, ఐఐసిటి, ఐసిఎంఆర్ నుంచి వైద్య నిపుణులు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న 150 కి పైగా రోగులను పరామర్శించారు. .
- తెలంగాణ: గత 24 గంటలలో 517 కొత్త కేసులు, 862 కోలుకున్నవారు, 2 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 2,73,858; చికిత్సలో ఉన్నవి: 7,778; మరణాలు 1474; కోలుకున్నవారు: 2,64,606. ఉన్నారు. రాష్ట్రంలో కొత్త కేసులకంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది.
- మహారాష్ట్ర: కోవిడ్ పాజిటివ్ శాతం 5 కంటే దిగువకు పడిపోయిందని బృహన్ ముంబయ్ మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ చెప్పారు. ఇది గత పది నెలల స్థాయికంటే తక్కువన్నారు. ఈ రోజుతో సహా గత 10 రోజులుగా పాజిటివ్ శాతం తగ్గుదల బాటలోనే సాగుతూ పరిస్థితి ఆసాజనకంగా ఉందన్నారు. మార్చి లో మహారాష్ట్రను కోవిడ్ పెద్ద ఎత్తున తాకినప్పుడు పాజిటివ్ శాతం 35-36 మధ్య ఉన్న సంగతి గుర్తు చేశారు.
- గుజరాత్: ఆదివారం నాడు గుజరాత్ లో కొత్తగా 1,455 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,18,788 కు చేరింది. మరో 17 మంది తాజాగా కోవిడ్ కు బలి కాగా రాష్టంలో మరణాల సంఖ్య 4,081కి పెరిగింది. 1,485 మంది తాజాగా కోలుకున్నారు. కొత్త కేసులకంటే కోలుకున్నవారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 2,00,012 కు చేరగా కోలుకున్నవారి శాతం 91.42 గా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 14,695 మంది బాధితులు చికిత్సలో ఉన్నారు.
- డయ్యూ డామన్, దాద్రా నాగర్ హవేలి కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్తగా ఇద్దరు కోవిడ్ బాధితులు నమోదు కావటంతో మొత్తం కేసుల సంఖ్య 3,315 కు చేరింది. కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,299 కు పెరిగింది.
- రాజస్థాన్: రాజస్థాన్ లో గత 24 గంటలలో మరికొన్ని మరణాలు సంభవించటంతో మొత్తం మరణాల సంఖ్య 2,429 కు చేరింది. ఆదివారం నాడు 2,089 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్ బారిన పడిన వారి మొత్తం సంఖ్య 2.80 లక్షలయింది. ప్రస్తుతం 22,427 మంది ఇంకా చికిత్సలో ఉండగా 2,55,729 మంది ఇప్పటిదాకా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం నాడు కొత్తగా నమోదైన కెకేసులలో జైపూర్ లో 481, జోధ్ పూర్ లో 221, అజ్మీర్ లో 105, కోట లో101, ఆల్వార్ లో 95, ఉదయ్ పూర్ లో 91 భిల్వారాలో 81 వచ్చాయి.
- మధ్యప్రదేశ్: వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తక్షణమే యుద్ధప్రాతిపదికన ఇవ్వటానికి వీలుగా రాష్టప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసి సిద్ధంగా ఉంది. నిర్దేశిత లక్ష్యం ప్రకారం టీకాలు వేయటానికి దాని నిల్వ, రవాణా, టీకాలివ్వటం తదితర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరిగాయి.
- చత్తీస్ గఢ్: ఆదివారం నాడు చత్తీస్ గఢ్ లో 1,229 తాజా కోవిడ్ కేసులు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,46,809 అయింది. నిన్న మరో 12 మంది మరణించగా మొత్తం మృతుల సం ఖ్య 2,989 కి పెరిగింది. నిన్న 93 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2,23,772కు చేరింది. 623 మంది కోవిడ్ నుంచి కోలుకొని బైటపడ్దారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,048 మంది చికిత్సలో ఉన్నారు. రాయ్ పూర్ లో 143 కొత్త కేసులు రాగా అక్కడ మొత్తం కేసులు 47,745 అయ్యాయి. అందులో మరణాలు 671
- గోవా: ఆదివారం నాడు తాజాగా 112 కోవిడ్ కేసులు నమోదు కాగా, మొత్తం ఇన్ఫెక్షన్ సోకినవారి సంఖ్య 48,686 కు చేరింది. ఒకరు మరణించగా రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 698 కు పెరిగింది. గత 24 గంటలలో 131 మంది కోలుకోగా మొత్తం కోలుకున్నవారి సంఖ్య to 46,624 అయింది. ప్రస్తుతం ఇంకా చికిత్సలో ఉన్నవారు 1,364 మంది.
నిజనిర్థారణ
*******
(Release ID: 1678971)
Visitor Counter : 266