శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

అన్ని రంగాలలో సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్లను ఉపయోగించి రాబోయే కొన్నేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుంది, కోవిడ్-19 ప్రభావాల నుండి త్వరలోనే బయటపడుతుంది: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్

సైన్స్ & టెక్నాలజీ విభాగం అన్ని రంగాలలో సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలను ఉపయోగించడం ద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థ కావలసిన రేటుకు ఎదగడానికి సహాయపడింది; స్టార్టప్‌ల సంఖ్యను పెంచడానికి ఇది సహాయపడింది: డిఎస్టి కార్యదర్శి

విశ్వవిద్యాలయాల వాతావరణ మార్పులకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించడానికి కశ్మీర్, సిక్కిం, తేజ్‌పూర్ కేంద్ర విశ్వవిద్యాలయాలలో ఎన్‌ఎంఎస్‌హెచ్‌ఇ ఆధ్వర్యంలో మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు

హిమాలయ ప్రాంతంలోని 13 వ వాతావరణ మార్పు కేంద్రం త్వరలో లడఖ్‌లో ఏర్పాటు కానుంది

Posted On: 07 DEC 2020 1:49PM by PIB Hyderabad

అన్ని రంగాలలో సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలను ఉపయోగించి రాబోయే కొన్నేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుందని నీతి ఆయోగ్  వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ఉద్ఘాటించారు. కోవిడ్-19 ప్రభావాల నుండి త్వరలోనే పునరుజ్జీవనం సాధిస్తుందని ఆయన అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్‌టి) 50 సంవత్సరాల వేడుకలను జరుపుకునేందుకు ఏర్పాటు చేసిన వెబినార్ లో ఆయన ప్రసంగించారు. 

“వ్యవసాయం, ఆధునిక ఔషధం, సాంప్రదాయ ఔషధం, కొత్త విద్యా విధానం, చిన్న, మధ్యతరహా ఎంటర్ప్రైజులు, కార్మిక రంగం, వంటి అన్ని రంగాలలో ప్రభుత్వం చర్యలు మరియు సంస్కరణలు చేపట్టింది. ప్రపంచంలోని మొదటి మూడు ఆర్ధికవ్యవస్థలలో ఒకటిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది” అని డాక్టర్ రాజీవ్ కుమార్ తెలిపారు.  డిఎస్‌టి  గోల్డెన్ జూబ్లీ డిస్కోర్స్ సిరీస్ - మహమ్మారి మరొక వైపు - అనే అంశంపై నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ & టెక్నాలజీ కమ్యూనికేషన్ మరియు విజ్ఞన్ ప్రసార్ ఈ వెబినార్ ని నిర్వహించారు. 

మహమ్మారి చాలా విషయాలలో మార్పు తెచ్చింది. పనులు చేసే కొత్త మార్గాలను చూపించిందని ఆయన తెలిపారు, కోవిడ్ అనంతర ప్రపంచంలో ప్రస్థానానికి ఒక వినూత్న ఆర్థిక వ్యవస్థ అవసరమని ఆయన అన్నారు.

మొదటి త్రైమాసికం తరువాత కోవిడ్ అనంతర ఆర్థిక వ్యవస్థ రికవరీ ధోరణి‌లో ఉందని, కోవిడ్ -19 అంతరాయాల ప్రభావాల నుండి వచ్చే కొన్ని త్రైమాసికాలలో భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి ఉవ్వెత్తున లేస్తుందని, తదుపరి 20-30 సంవత్సరాలలో సగటున 7-8 శాతం వృద్ధి సాధిస్తుందని  డాక్టర్ కుమార్ తెలిపారు2047 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన చెప్పారు.

వ్యవస్థపరమైన సంస్కరణల గురించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సులభతరం వాణిజ్యం, సృజనాత్మకతను ప్రేరేపించే పర్యావరణ వ్యవస్థను మరింత పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగా పాఠశాల విద్యార్థులకు సృజనాత్మక పరికరాలు, సంబంధిత తాజా ఆలోచనలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. 

వెబినార్ ‌లో డిఎస్‌టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, స్వచ్ఛమైన ఇంధనం, ఆరోగ్యం, విద్య, రవాణా, వ్యవసాయం, కమ్యూనికేషన్,  ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ స్టోరేజ్, క్వాంటం టెక్నాలజీస్ వంటి అన్ని రంగాల్లో సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలను ఉపయోగించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కావలసిన రేటుకు ఎదగడానికి డిఎస్‌టి తీసుకున్న వివిధ చర్యలను వివరించారు. టెక్నాలజీ మిషన్ల కోసం కావలసిన ఫలితాలను అందించడానికి శాస్త్రవేత్తలకు తగు స్వేచ్ఛ ఇవ్వడానికి డిఎస్టి తీసుకున్న చర్యలు మరియు ఆవిష్కరణ, సైన్స్ మరియు టెక్నాలజీని ఉపయోగించి స్టార్టప్‌ల సంఖ్యను పెంచడానికి తీసుకున్న చర్యల గురించి కూడా ఆయన మాట్లాడారు.

"గత 50 సంవత్సరాల్లో డిఎస్టి అన్ని రంగాలలో చాలా సామర్థ్యాన్ని పెంపొందించింది. ప్రపంచంలో సైన్స్ ప్రచురణలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది,దానిలో  డిఎస్‌టికి గొప్ప పాత్ర ఉంది. మా గత 50 సంవత్సరాలు మహిమాన్వితమైనదిగానే సాగింది, కాని రాబోయే 50 సంవత్సరాలు గతానికి మించి ఉండాలి. గత ఐదు సంవత్సరాలలో మన బడ్జెట్ రెట్టింపు అయ్యింది, ఇది కొత్త దిశలకు దారి చూపుతుంది” అని ప్రొఫెసర్ శర్మ అన్నారు.

రెండు ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్‌ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల లో  సుస్థిర హిమాలయన్ పర్యావరణ వ్యవస్థ జాతీయ మిషన్ (ఎన్‌ఎంఎస్‌హెచ్‌ఇ) కింద మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ)లను,  సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి) కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ ఇటీవల వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.

ప్రొఫెసర్ శర్మ ఈ కేంద్రాలను హిమాలయ ప్రాంతంలో వాతావరణ మార్పుల పరిశోధనలకు నాయకత్వం వహించాలని కోరారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్‌టి) స్థాపించిన కేంద్రాలను కశ్మీర్ విశ్వవిద్యాలయంలోని, సిక్కిం విశ్వవిద్యాలయం, తేజ్పూర్ విశ్వవిద్యాలయంలో  ఆయన ప్రారంభించారు. మూడవ ధ్రువం అయిన ఈ ప్రాంతంలో సంబంధిత జోక్యాలపై దృష్టి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు. 

కేంద్రాలు జ్ఞానాన్ని ఉత్పత్తి చేయటానికి ప్రాధమిక చోదకాలుగా ఉండాలి అని అన్నారు. తగిన వాటాదారుల సహాయంతో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని మరియు హిమాలయ విశ్వవిద్యాలయాలు పరిశోధన సవాళ్లను స్వీకరించడానికి ముందుకు రావడానికి ప్రేరణగా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.

"వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగమైన 8 జాతీయ మిషన్లలో, భారత హిమాలయ ప్రాంతాన్ని పరిరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఎన్‌ఎంఎస్‌హెచ్‌ఇ ఒకటే నిర్దిష్టాంగా ఉందని చెప్పారు. దీనిపై ప్రధాన దృష్టిని పెడుతూ, హిమాలయ ప్రాంతంలోని 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పన్నెండింటిలో వాతావరణ మార్పు (సిసి) కేంద్రాలను ఏర్పాటు చేసాము మరియు త్వరలో లడఖ్‌లో 13 వ రాష్ట్ర సిసి సెల్ ఏర్పాటువుతుంది” అని ఆయన చెప్పారు. 

హిమాలయ రెండు భాగాలలో కేంద్రాలను ఏర్పాటు చేయడాన్ని వాతావరణ మార్పుల కార్యక్రమంపై నిపుణుల కమిటీ  చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ ప్రశంసించారు. “ఈ మిషన్‌లోని ప్రాజెక్టులు మరియు కార్యకలాపాల సహ-డెవలపర్‌లుగా డిఎస్‌టి చురుకైన పాత్ర పోషించింది మరియు హిమాలయ ప్రాంత విశ్వవిద్యాలయాలకు వారి పరిశోధనలను పెంచడానికి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా దిద్దుబాటు చర్య తీసుకుంటోంది” అని అయన అన్నారు. 

"హిమానీనదాలు, అడవులు లేదా పర్వత ప్రాంతాల పచ్చికభూములపై పరిశోధన చేయగల అనేక వ్యవస్థలను హిమాలయ ప్రాంతం అందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కలిగించే అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఉన్న ఈ వ్యవస్థలను మనం సద్వినియోగం చేసుకోవాలి, ”అని ఆయన వివరించారు.

ఈ సమావేశంలో డిఎస్టి వాతావరణ మార్పు కార్యక్రమం స్ప్లైస్ సలహాదారుడు, అధిపతి డాక్టర్ అఖిలేష్ గుప్తా, కశ్మీర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ తలత్ అహ్మద్, తేజ్పూర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ వి.కె.జైన్, సిక్కిం విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అవినాష్ ఖరే తమ ఆలోచనలను పంచుకున్నారు. 

CoE - Climate Change.jpg

 

*****


(Release ID: 1678881) Visitor Counter : 264