శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఐఐఎస్ఎఫ్ 2020 కోసం ఆర్‌జిసిబి కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ప్రసంగించిన డాక్టర్ హర్ష్ వర్ధన్

ప్రజలను సైన్స్ తో అనుసంధానించడం సైన్స్ లో అనుభూతిని ఆస్వాదించడమే సైన్స్ ఫెస్టివల్ లక్ష్యం : డాక్టర్ హర్ష్ వర్ధన్

Posted On: 04 DEC 2020 9:44PM by PIB Hyderabad

తిరువనంతపురం రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ నిర్వహించిన ఐఐఎస్ఎఫ్ 2020 వర్చువల్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రసంగించారు. ఐఐఎస్ఎఫ్ 2020 కి ముందుగా దేశవ్యాప్తంగా ఆ కార్యక్రమ స్ఫూర్తిని వ్యాప్తి చెందించేలా ప్రాచుర్యం కలిగించే  కార్యక్రమాలు జరుగుతున్నాయి.

కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ప్రసంగించిన డాక్టర్ హర్ష్ వర్ధన్, “సైన్స్ ఫెస్టివల్ లక్ష్యం ప్రజలను సైన్స్ తో మమేకం చేయడం, సైన్స్ వల్ల ఒక అనుభూతిని పంచడం తో పటు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ (స్టెమ్) మనకు పరిష్కారాలను అందించే మార్గాలను చూపిస్తుంది. ఉత్సుకతను ప్రేరేపించడానికి మరియు అభ్యాసాన్ని మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఉద్దేశించిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ప్రత్యేకమైన వేదిక ఏర్పడింది అని ఆయన వివరించారు. ఐఐఎస్ఎఫ్, 2020, వర్చువల్ ప్లాట్‌ఫామ్‌లో నిర్వహించడం సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఒకే క్లిక్‌తో దేశంలోని మారుమూలల్లో  నుండి, తద్వారా డిజిటల్ విస్తృతిని పెంచుతుంది అని వివరించారు.

ఆర్‌జిసిబి చేసిన పనిని ప్రశంసించిన డాక్టర్ హర్ష్ వర్ధన్, భారతదేశంలో వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఆర్‌జిసిబి, అంటు వ్యాధుల పరీక్షతో పాటు, కోవిడ్ పరీక్షలో ముందంజలో ఉందని అన్నారు. ఆర్‌జిసిబి ఇప్పటివరకు లక్షకు పైగా కోవిడ్ పరీక్షలు చేసిందని ఆయన వెల్లడించారు.

“ఐఐఎస్ఎఫ్ 2020 ప్రతిపాదించిన 'సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అండ్ గ్లోబల్ వెల్ఫేర్' అనే ఇతివృత్తం ప్రస్తుత సందర్భంలో చాలా సందర్భోచితంగా ఉంది, దేశం వృద్ధిని వేగవంతం చేయడానికి  సైన్స్ & టెక్నాలజీ వైపు దేశమంతా చూస్తున్నప్పుడు మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ దార్శనికత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ కీలక పాత్ర పోషిస్తుంది” అని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. 

ఆమె ప్రసంగంలో, జిఓఐ బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రేణుస్వరూప్ మాట్లాడుతూ, మన దేశంలో సైన్స్ ప్రయాణాన్ని ఒక వేడుకగా జరుపుకోవాలని, సైన్స్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు ఇందుకు సహాయపడతాయని అన్నారు. ఈ ఉత్సవంలో అట్టడుగు ప్రాంతాలకు వెళ్లడం, విద్యార్థులతో నిమగ్నమవ్వడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రముఖంగా వినియోగించడం, డయాస్పోరాతో నిమగ్నమవ్వడం, ఇతరులతో ఇంటర్ ఏజెన్సీ పాల్గొనడం వంటి అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు.

విజ్ఞాన భారతి (విభా), ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ జయంత్ సహస్రబుధే మాట్లాడుతూ, ఐఐఎస్ఎఫ్ హేతుబద్ధత, ప్రజలలో శాస్త్రీయ ఆలోచనను పెంపొందించడంలో దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. ఐఐఎస్‌ఎఫ్ 2020 ను విజయవంతం చేయడానికి ఆర్‌జిసిబి అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ శ్రీ చంద్రభాస్ నారాయణ అన్నారు

***



(Release ID: 1678626) Visitor Counter : 224


Read this release in: English , Urdu , Hindi , Bengali