ఆయుష్

ఆయుష్ ఎగుమతి ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేయాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయం

Posted On: 06 DEC 2020 2:18PM by PIB Hyderabad

ఆయుష్ ఎగుమతులను పెంచే ఉద్దేశంతో ఎగుమతి ప్రోత్సాహక మండలి ఏర్పాటుకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఆయుష్ వాణిజ్యం మరియు పరిశ్రమల సంయుక్త సమీక్షలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్, ఆయుష్ మంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్ ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్ ఎగుమతులను పెంచడానికి ధర, నాణ్యమైన పోటీతత్వాన్ని సాధించడానికి మొత్తం ఆయుష్ రంగం కలిసి పనిచేస్తుందని సమీక్షలో నిర్ణయించారు. డిసెంబర్ 4 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిగింది, దీనికి ఆయుష్ రంగం నుండి దాదాపు 50 మంది పరిశ్రమలు మరియు వాణిజ్య దిగ్గజాలు హాజరయ్యారు. ఆయుష్ రంగానికి చెందిన సుమారు 2000 మందికి పైగా వాటాదారులు వర్చువల్ ప్లాట్‌ఫామ్‌లపై లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ-ఈవెంట్‌కు హాజరయ్యారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ మునుపటి సమావేశం సిఫారసులపై తీసుకున్న చర్యలను ఆయుష్ శాఖ  కార్యదర్శి ప్రారంభంలో వివరించారు. కోవిడ్ -19 పరిస్థితిని ఎదుర్కోడానికి, ఆయుష్ పరిశ్రమను ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ తీసుకున్న అనేక ఇతర కార్యక్రమాల గురించి ఆయన వివరించారు.

ఆ తరువాత జరిగిన ఓపెన్ ఫోరమ్‌లో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆర్‌ఐఎస్, బిఐఎస్, ఇన్వెస్ట్ ఇండియా, ఆయుష్ పరిశ్రమ ప్రతినిధులు తమ ఆలోచనలను పంచుకున్నారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆయుష్ ఆధారిత పరిష్కారాలను ప్రజలకు తీసుకోవడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి.

కోవిడ్ -19 మహమ్మారి క్లిష్ట సమయాల్లో వ్యాధి నిరోధకత, చికిత్స కోసం ఆయుష్ ఆధారిత పరిష్కారాలపై పెరుగుతున్న ఆసక్తిని శ్రీ శ్రీపాద్ నాయక్ ప్రముఖంగా వివరించారు. భారతదేశం, విదేశాల నుండి పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి ఆయుష్ రంగంలో వాణిజ్యం, త్వరగా పెరగాల్సిన అవసరం ఉందని, వారి ఆరోగ్య సంరక్షణలో ఈ వ్యవస్థలను ఇప్పుడు చూస్తున్న పెద్ద సంఖ్యలో ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భయంకరమైన కరోనా వైరస్ నుండి ప్రజలకు రక్షణ కల్పించడానికి మహమ్మారి సమయంలో మంత్రిత్వ శాఖ తీసుకున్న వివిధ చర్యలను ఆయన గుర్తు చేశారు. ఆయుష్ రోగనిరోధక శక్తి ప్రోటోకాల్స్, ఆయుర్వేదం, యోగా కోసం కోవిడ్-19 కోసం నేషనల్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ సకాలంలో జోక్యం చేసుకుంటున్నాయని, ఇది జనాభాలో ఎక్కువ వర్గాలకు ఉపశమనం కలిగించిందని ఆయన చెప్పారు. 

కోవిడ్ -19 తో జరిగిన పోరాటంలో ఆయుష్ రంగం ముందు వరుసలో ఉండి పోషించిన పాత్రను శ్రీ పియూష్ గోయల్ ప్రశంసించారు. మహమ్మారి సమయంలో సామాన్య ప్రజలకు ఆయుష్ వ్యవస్థలు అందించే రక్షణ ఈ వ్యవస్థలు అందించే మందులు, ఉత్పత్తుల సమర్థత గురించి చాలా మందికి ఉన్న సందేహాలకు పరిష్కారాల ద్వారా తగు సమాధానం చెప్పిందని అన్నారు. ఇటీవలి నెలల్లో ఆయుష్ ఉత్పత్తుల ఎగుమతుల పెరుగుదల అనేక దేశాలలో వారి పెరుగుతున్న ప్రజాదరణకు ప్రత్యక్ష నిదర్శన అని తెలిపారు. ఎగుమతులకు సంబంధించిన హెచ్‌ఎస్ కోడ్‌ల ప్రామాణీకరణ ఎగుమతులను ప్రోత్సహించే దశగా ప్రాధాన్యతపై పరిగణించబడుతుంది. దీనిని ప్రారంభంలో సాధించడానికి వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో పనిచేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఆయన పిలుపునిచ్చారు. పరిశ్రమల దిగ్గజాలు తమ ఉత్పత్తుల నాణ్యత, ధరలపై కూడా సమాంతరంగా దృష్టి పెట్టాలని వాణిజ్య మంత్రి సలహా ఇచ్చారు, తద్వారా వారు ప్రపంచ మార్కెట్లో పోటీకి నిలవగలరని చెప్పారు. ఆయుష్ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ యోచనకు ఆయన మద్దతు తెలిపారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా దీనికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. వాణిజ్య ప్రమోషన్ అన్ని విషయాలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ యొక్క నిరంతర మద్దతు ఆయుష్ రంగానికి అందుబాటులో ఉంటుందనే హామీ ఇచ్చారు. ఏదైనా ముఖ్యమైన సమస్యపై చర్చించడానికి అవసరమైనప్పుడు మంత్రిత్వ శాఖ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రస్తుతం చేపడుతున్న "బ్రాండ్ ఇండియా" కార్యకలాపాలలో ఆయుష్ తగిన విధంగా కనిపిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. బ్రాండింగ్, ప్రమోషన్ కి సంబంధించిన వివిధ అంశాలలో పరిశ్రమ మరియు ప్రభుత్వం కలిసి పనిచేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

ఈ సమావేశంలో ప్రధానంగా ఈ అంశాలు వెల్లడయ్యాయి. 

  1. ఆయుష్ ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఎఇపిసి) ఏర్పాటు కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కలిసి పనిచేస్తాయి. ప్రతిపాదిత ఎఇపిసిని ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిథిలో ఉంచవచ్చు.
  2. ఆయుష్ కోసం హెచ్ఎస్ కోడ్  ప్రామాణీకరణ వేగవంతం అవుతుంది.
  3. ఆయుష్ ఉత్పత్తులతో పాటు సేవలకు అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సహకారంతో పని చేస్తుంది.
  4. ఆయుష్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తమ పద్ధతులు / విజయ కథలను గుర్తించి వాటిని ప్రజలలో విస్తృతంగా ప్రాచుర్యం కలిపిస్తారు.
  5. ఆయుష్ పరిశ్రమ ఆయుష్ ఉత్పత్తుల నాణ్యత మరియు ప్రమాణాలను నిర్ధారించడంతో పాటు పోటీ మార్కెట్ లో ధరల విషయంలో కూడా తగు విధంగా సిద్ధం అవుతుంది. 
  6. బ్రాండ్ ఇండియా కార్యకలాపాల్లో ఇక ఆయుష్ కూడా స్థానం ఉంటుంది. 

***



(Release ID: 1678727) Visitor Counter : 249