ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 లో రేపటి రోజు న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
Posted On:
07 DEC 2020 3:00PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం డిసెంబర్ 08వ తేదీ న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్‌సి) లో ఉదయం 10:45 గంటలకు వర్చువల్ పద్ధతి లో ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం, సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఒఎఐ) లు నిర్వహిస్తున్నాయి. ఐఎమ్ సి ఈ నెల 8 వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు జరుగనుంది.
ఐఎమ్‌సి 2020 ని గురించి
‘‘ఇన్ క్లూసివ్ ఇన్నోవేషన్ - స్మార్ట్, సెక్యూర్, సస్‌టేనబుల్’’ అనే అంశం ఐఎమ్‌సి 2020 సమావేశాలకు ఇతివృత్తం గా ఉంది. ఈ కార్యక్రమం ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘డిజిటల్ ఇన్ క్లూసివిటీ’, ‘సస్ టేనబుల్ డెవెలప్‌మెంట్, ఆంట్రప్రన్యూర్ శిప్ & ఇన్నోవేషన్’లను ప్రోత్సహించాలన్న ప్రధాన మంత్రి దార్శనికత తో తుల తూగాలని లక్ష్యంగా పెట్టుకొంది. అంతేకాకుండా స్థానిక పెట్టుబడులను, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని, టెలికం రంగంలో, కొత్త గా రూపుదాల్చుకున్న సాంకేతిక విజ్ఞాన రంగాలలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించాలని కూడా లక్షిస్తోంది
ఐఎమ్‌సి 2020 లో వివిధ మంత్రిత్వ శాఖలు, టెలికం ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, గ్లోబల్ సిఇఒ స్, 5జి రంగం , కృత్రిమ మేధ (ఎఐ), ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), డాటా ఏనలిటిక్స్, క్లౌడ్- ఎడ్జ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, సైబర్-సెక్యూరిటీ, స్మార్ట్ సిటీస్, ఆటోమేషన్ రంగాల నిపుణులు పాలుపంచుకోనున్నారు.
***
(Release ID: 1678876)
Visitor Counter : 236
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam