ప్రధాన మంత్రి కార్యాలయం

పాన్ ఐ.ఐ.టి. అంతర్జాతీయ సదస్సు‌లో ప్రధానమంత్రి కీలకోపన్యాసం - ప్రసంగ పాఠం

Posted On: 04 DEC 2020 10:22PM by PIB Hyderabad

పాన్ ఐ.ఐ.టి., అమెరికా, అధ్యక్షులు శ్రీ సుందరం శ్రీనివాసన్ గారు, 

విశిష్ట పూర్వ విద్యార్థులు,

మిత్రులారా !

ఈ రోజు మీ అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది.  చెన్నై, ముంబై, గువహతిలోని ఐ.ఐ.టి. లలో మరియు ఇటీవల ఢిల్లీ లో జరిగిన స్నాతకోత్సవాల్లో ప్రసంగించే అవకాశం నాకు లభించింది.  ఐ.ఐ.టి. ల విద్యార్థులతో ఎప్పుడు సంభాషించినా నేను చాలా ఆనందిస్తాను. నేను కూడా భారతదేశం మరియు మన భూగోళం భవిష్యత్తు గురించి ఉపశమనం మరియు భరోసాతో తిరిగి వచ్చాను.

మిత్రులారా !

మీరు మానవత్వానికి సేవ చేస్తున్న భారతదేశపు కుమారులు మరియు కుమార్తెలు.  ఆవిష్కరణల కోసం మీరు చూపే ఆశక్తి ప్రపంచం పెద్దగా కలలు కనేలా చేస్తుంది.  ఇది మీ గొప్ప సామర్ధ్యాల్లో ఒకటి.  బహుశా ఇది మీ సాంకేతిక, నిర్వహణ నైపుణ్యాల తర్వాత రెండవ స్థానంలో ఉంటుంది.  ఈ భూమండల వ్యాప్తంగా  ఆర్థిక విలువ కోసం ఐ.ఐ.టి. పూర్వ విద్యార్థుల సంచిత సహకారాన్ని ఎవరైనా లెక్కించాలి.  ఇది సహేతుకమైన పరిమాణాన్ని కలిగి ఉన్న దేశం యొక్క జి.డి.పి. తో పోలుస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

మిత్రులారా !

ఒక సమయంలో,  ఈ విధమైన సమావేశానికి కేవలం ఐదు లేదా ఆరు ఐఐటిల నుండి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఆ సంఖ్య క్రమంగా పెరిగి, ఇప్పుడు సుమారు రెండు డజన్లకు చేరింది.  ఫలితంగా, విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.  అదే సమయంలో, ఐ.ఐ.టి. ల బ్రాండ్ మరింత బలంగా ఉందని మేము నిర్ధారించాము.  మేము, ఇప్పుడు, భారతదేశంలో శాస్త్ర, సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికి మేము గట్టిగా కట్టుబడి ఉన్నాము. ఇటీవలి కాలంలో, భారతదేశంలో హ్యాకథాన్ ‌ల సంస్కృతి అభివృద్ధి చెందుతున్న విషయాన్ని మీరు గమనించి ఉంటారు.  ఈ హాకథాన్ ‌లలో కొన్నింటిలో భాగమయ్యే అవకాశం నాకు కూడా లభించింది.  ఈ హాకథాన్‌ లలో, యువకులు జాతీయ, అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారాలను సూచించడం నేను గమనించాను. 

మేము ఈ విషయంలో, ఆగ్నేయాసియాతో పాటు యూరప్‌లోని అనేక దేశాలతో కలిసి పని చేస్తున్నాము.  మా యువకులు, వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి, అంతర్జాతీయ వేదికలను వినియోగించుకునేలా చూడటమే, మా లక్ష్యం.  అదేవిధంగా, ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పద్ధతుల నుండి వారు నేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నుండి, భారతదేశం వైభవ్ శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది.

దాదాపు నెల రోజుల పాటు కొనసాగిన ఈ సదస్సు, విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణ రంగాలలో అత్యున్నత-నాణ్యమైన ప్రతిభను ఒకచోట చేర్చింది.  ఈ సదస్సులో దాదాపు ఇరవై మూడు వేల మంది పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగా నిర్వహించిన 230 చర్చా కార్యక్రమాలు,  దాదాపు 730 గంటల సేపు జరిగాయి.  ఈ సదస్సు చాలా ఉత్పాదకతతో జరిగింది. ఇది విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణల్లో, భవిష్యత్ సహకారాలకు ఒక మార్గదర్శకంగా నిలిచింది.

మిత్రులారా !

భారతదేశం పని చేసే విధానంలో సముద్ర మార్పును చూస్తోంది.  ఎప్పటికీ జరగవని మేము భావించిన కొన్ని విషయాలు ఇప్పడు, మంచి వేగంతో జరుగుతున్నాయి.  మీకు బాగా తెలిసిన రంగం నుండి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. గతంలో, ఐ.ఐ.టి.లు ఏరో-స్పేస్ ఇంజనీర్లను ఉత్పత్తి చేసినప్పుడు, వారిని నియమించడానికి బలమైన దేశీయ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ లేదు. ఈ రోజున, అంతరిక్ష రంగంలో మన చారిత్రాత్మక సంస్కరణలు, భారతీయ ప్రతిభకు తెరతీసాయి. 

అందుకే, భారతదేశంలో ప్రతిరోజూ కొత్త అంతరిక్ష సాంకేతిక అంకురసంస్థలు వస్తున్నాయి. ఇంతకు ముందు ఎవరూ ప్రయత్నించని రంగాలను, మీలో కొందరు ధైర్యంగా ప్రయత్నిస్తారని నేను భావిస్తున్నాను. భారతదేశంలో అనేక రంగాలలో అత్యాధునిక మరియు వినూత్న పనులు జరుగుతున్నాయి. మాది "సంస్కరణ, ప్రదర్శన, రూపాంతరం" సూత్రానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం.

మన సంస్కరణల నుండి వ్యవసాయం, అణుశక్తి, రక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక, బ్యాంకింగ్, పన్ను వంటి, ఏ రంగాన్నీ వదిలిపెట్టలేదు.  జాబితా కొనసాగుతూనే ఉంది.  మేము 44 కేంద్ర కార్మిక చట్టాలను సంస్కరించి, కేవలం 4 కోడ్‌లుగా సమీకరించి, కార్మిక రంగంలో విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చాము.  మా కార్పొరేట్ పన్ను రేటు ప్రపంచంలోనే అతి తక్కువగా ఉంది.  కొన్ని వారాల క్రితం, భారత మంత్రి మండలి పది కీలక రంగాలలో ఉత్పత్తితో కూడిన బోనస్ పథకాన్నిఆమోదించింది.  ఎగుమతులతో పాటు తయారీని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.  వీటిలో బ్యాటరీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, టెలికాం, సౌర శక్తి మొదలైన రంగాలు ఉన్నాయి.  ఈ రంగాలన్నీ టెక్నాలజీకి సంబంధించినవి. ఇవి వినియోగించుకోవడానికి వేచి ఉన్న అవకాశాలు.

కోవిడ్-19 వంటి క్లిష్ట సమయంల్లో కూడా భారతదేశానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి.  ఈ పెట్టుబడుల్లో ఎక్కువ భాగం సాంకేతిక రంగంలోనే వచ్చాయి.  స్పష్టంగా చెప్పాలంటే, ప్రపంచం భారతదేశాన్ని విశ్వసనీయమైన ఒక మంచి భాగస్వామిగా చూస్తోంది.

మిత్రులారా !

పాన్ ఐ.ఐ.టి. ఉద్యమం యొక్క సామూహిక శక్తి ఆత్మ నిర్భర్ భారత్ లేదా స్వావలంబన భారతదేశం కావాలనే మన కలకు ఊపందుకుంది.  స్వతంత్ర భారతదేశ చరిత్రలో కొన్ని క్లిష్టమైన మలుపుల వద్ద, పునరుజ్జీవింపబడిన భారతదేశంపైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు తమ నమ్మకాన్ని ఉంచారు. వారు నూతన భారతదేశానికి రాయబారులుగా మారారు.  భారతదేశం యొక్క దృక్కోణాలను ప్రపంచం సరైన స్ఫూర్తితో అర్థం చేసుకోవడంలో వారి పాత్ర కీలకం. 

మిత్రులారా !

రెండు సంవత్సరాల తరువాత, 2022 లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవుతుంది.  "భారతదేశానికి తిరిగి ఇవ్వడం" అనే విషయంపై ఇంకా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని నేను పాన్ ఐ.ఐ.టి. బృందాన్ని కోరుతున్నాను. మీ పూర్వ విద్యార్థుల బృందానికి మీరు చేస్తున్న ఉత్తేజకర ప్రయత్నాలు అందరికీ తెలిసినవే. ఉన్నత విద్య లేదా పరిశ్రమ ఎంపికలో  - సరైన వృత్తి మార్గాలను ఎంచుకోవడంలో మీ జూనియర్లలో చాలామందికి సలహా ఇస్తున్నారని నాకు తెలుసు. ఇప్పుడు, వారిలో చాలామంది తమ స్వంత వ్యాపారాలను ప్రారంభించాలనుకుంటున్నారు.  వారు ప్రకాశవంతమైన, నమ్మకమైన యువకులు, వారి కృషి మరియు ఆవిష్కరణల ద్వారా పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పుడు, ఈ ప్రయత్నాలలో కూడా వారికి సలహా ఇవ్వమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 75 సంవత్సరాల స్వాతంత్రయాన్ని మనం ఎలా గుర్తించగలం అనే దానిపై మీ ఆలోచనలు, సలహాలు, అనుభవాలను మరింతగా పంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు మీ అభిప్రాయాలను మైగోవ్ యాప్ ద్వారా కానీ లేదా నేరుగా నరేంద్ర మోదీ యాప్ ద్వారా కానీ నాతో పంచుకోవచ్చు.

మిత్రులారా !

ఈ నాటి మన చర్యలు మన భూమండలం భవిష్యత్తును రూపొందిస్తాయి.  కోవిడ్ -19 అనంతర పరిస్థితి ఇలా ఉంటుంది : దాదాపు ప్రతి రంగంలో తిరిగి నేర్చుకోవడం, తిరిగి ఆలోచించడం, తిరిగి రూపకల్పన చేయడం, తిరిగి ఆవిష్కరించడం.  ఇది ఆర్థిక సంస్కరణల పరంపరతో పాటు మన భూ గ్రహాన్ని తిరిగి శక్తివంతం చేస్తుంది.  ఇది 'సులభతర జీవనాన్ని' ను నిర్ధారిస్తుంది, పేదలతో పాటు అట్టడుగున ఉన్నవారిని కూడా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.  మహమ్మారి సమయంలో వచ్చిన అనేక ఆవిష్కరణలు పరిశ్రమ మరియు విద్యాసంస్థల మధ్య సహకారంతో ఎలా ఉద్భవించాయో కూడా చూశాము.  క్రొత్త సాధారణ స్థితికి సర్దుబాటు చేయడానికి ఈ రోజు ప్రపంచానికి ఆచరణీయమైన పరిష్కారాలు అవసరం, మరి, ఈ అవసరాన్ని తీర్చడానికి మీ కంటే సమర్థులు ఎవరు ఉంటారు?  ఈ రోజున, పెద్ద సంఖ్యలో ఐ.ఐ.టి.  పూర్వ విద్యార్థులు ప్రపంచ నాయకత్వ స్థానాల్లో ఉన్నారు.  మీ బలమైన నెట్‌వర్క్ ‌లు పరిశ్రమ, విద్యాసంస్థలు, కళలు, ప్రభుత్వాలు అంతటా విస్తరించి ఉన్నాయి.  మానవ కార్యకలాపాలు మరియు శ్రేష్ఠత యొక్క ప్రతి రంగంలోనూ మీరు ఉన్నారు.  నేను, మీ బృందంలోని వారిని,  ప్రతి రోజూ కాకపోయినా, వారంలో కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మందిని కలుసుకుంటూ ఉంటాను.   దినదినాభివృద్ధి చెందుతున్న ఈ కొత్త సాంకేతిక ప్రపంచంలో వాదించి, చర్చించి, పరిష్కారాలకు దోహదం చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ బాధ్యత చాలా భారీగా ఉండవచ్చు, కానీ, దీనికి మీరు సమర్ధులని, నాకు తెలుసు.

"భవిష్యత్తు ఇప్పుడు ఉంది" అనే ఇతివృత్తం సరిగ్గా కుదిరింది. ఇది ఖచ్చితంగా ఉంది.  ఈ సంవత్సరం సమావేశానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

మీకు మంచి జరగాలి. 

ధన్యవాదములు. 

*****



(Release ID: 1678622) Visitor Counter : 221