హోం మంత్రిత్వ శాఖ
ఎస్‌డీజీలపై నాలుగో దక్షిణ ఆసియా ఫోరం
- దక్షిణ ఆసియాలో విపత్తు, వాతావరణ స్థితిస్థాపకతపై ప్రత్యేక ఉన్నత స్థాయి సమావేశం
- విపత్తు మరియు ప్రజారోగ్య సవాళ్లను అధిగమించడానికి సహకారం కోసం దక్షిణాసియాకు బలమైన సహకార చట్రం అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ అన్నారు
- "విపత్తు ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా ప్రాంతీయ సహకారం, పరస్పర సహాయాన్ని ప్రోత్సహించడం ఈ ప్రాంతంలోని మనందరి కర్తవ్యం- శ్రీ నిత్యానంద్ రాయ్
Posted On:
04 DEC 2020 6:21PM by PIB Hyderabad
దక్షిణాసియా 'ఫోరం ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్' (ఎస్‌డీజీ) నాలుగో ఫోరం నేపథ్యంలో.. యునెస్కాప్ దక్షిణ ఆసియా మరియు పసిఫిక్ విభాగం ఈ రోజు 'దక్షిణ ఆసియాలో విపత్తులు, వాతావరణ స్థితిస్థాపకత' అనే అంశం పై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విపత్తు మరియు ప్రజా ఆరోగ్య ప్రమాద నిర్వహణకు దైహిక విధానాన్ని అమలు చేయడం, అందులో సవాళ్లను అధిగమించడానికి గల వివిధ అవకాశాలు మరియు అత్యవసరాలను గుర్తించడం ఈ ఉన్నత స్థాయి సమావేశం ముఖ్య లక్ష్యాలు. దీనికి తోడు భవిష్యత్ క్యాస్కేడింగ్ తరహా విపత్తులను మేటిగా ఎదుర్కొనేందుకు వీలుగా బహుళ-ప్రమాద, బహుళ-రంగాల సంసిద్ధతకు గాను వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఎస్‌డీజీపై దక్షిణాసియా ఫోరంతో సహా ప్రస్తుత ప్రాంతీయ మరియు ఉప-ప్రాంతీయ సహకార యంత్రాంగాన్ని పెట్టుబడి పెట్టడానికి వ్యూహాలను రూపొందించడం కూడా ఈ సమావేశపు ఇతర లక్ష్యాలు.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ ప్రసంగించారు. ఈ చర్చా కార్యక్రమంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ ఉప మంత్రి మిస్టర్ ఖాసిం హైదారీ; బంగ్లాదేశ్ ఉప మంత్రి ఎం.డి. ఎనమూర్ రెహ్మాన్; మాల్దీవుల ఉపమంత్రి శ్రీమతి ఖదీజా నసీమ్; వాతావరణ మార్పులపై పాకిస్థాన్ ప్రధానమంత్రి సలహాదారు శ్రీ మాలిక్ అమిన్ అస్లాం ఖాన్‌లు ఇతర ప్యానెలిస్టులుగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ-జనరల్ మరియు ఈఎస్‌జీఏపీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ శ్రీమతి ఆర్మిడా సల్సియా అలిస్జబానా కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేశారు. దక్షిణాసియా దేశాలు వరదలు, తుఫాను, వేడి గాలులు, శీతల గాలులు, కొండ చరియలు విరిగిపడడం, కరువుతో పాటు కోవిడ్-19 మహమ్మారి, దాని నుంచి కోలుకోవడం వంటి వివిధ తీవ్ర వాతావరణ పరిస్థితులతో కూడిన పలు సవాళ్లు ఎదుర్కొంటు ఉన్నాయని హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజారోగ్య పరిరక్షణలో వివిధ సమస్యలు దక్షిణ ఆసియాలోని అన్ని దేశాలకు అదనపు సవాలుగా నిలుస్తున్నాయని అన్నారు.
అటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం కోసం మనం బలమైన సహకార చట్రం కలిగి ఉండాలి అని తెలిపారు. ఏక వినియోగ ప్లాస్టిక్‌లను తొలగించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆలోచన; తరిగిపోయిన అటవీ సంపదను
పెంపొందించే దిశగా 2030 నాటికి అటవీ విస్తరణను 26 మిలియన్ హెక్టార్లకు
పెంచడం మరియు పునరుద్ధరించడం ఇప్పటికే సానుకూల ఫలితాలను ఇవ్వడం ప్రారంభించిందని తెలిపారు. దేశంలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు ఇది తగిన విధంగా ప్రోత్సహిస్తోందని అన్నారు. 2019 సెప్టెంబరు 23వ తేదీన అమెరికా న్యూయార్క్ నగరంలో జరిగిన యుఎన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్-2019 లో భారత ప్రధాన మంత్రి స్థితిస్థాపక మౌలిక సదుపాయాల సంకీర్ణం కోసం చొరవ తీసుకొనే దిశగా గ్లోబల్ కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ) ను ప్రకటించారని శ్రీ రాయ్ తెలిపారు. భారతదేశం సార్క్ దేశాల విపత్తు నిర్వహణ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తోందని వివరించారు. ఇది సార్క్ విశ్వవిద్యాలయాలు మరియు బిమ్స్టెక్ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 పరిస్థితి ఈ ప్రాంతం యొక్క ప్రమాదాలను ఘాతాంక పద్ధతిని మరింత పెంచుతోంది అని అన్నారు. అందువల్ల, మన స్వంత విపత్తు ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా, ప్రాంతీయ సహకారం మరియు పరస్పర సహాయాన్ని ప్రోత్సహించడం, విపత్తులకు ముందు, విపత్తు సమయంలో, విపత్తు తరువాత సహకారాన్ని పెంపొందించుకోవడం మనందరి విధి. దక్షిణ ఆసియాను స్థితిస్థాపక ప్రాంతంగాను, జీవించడానికి ప్రశాంతమైన ప్రదేశంగా మార్చడంలో ప్రాంతీయ సహకారం కోసం భారతదేశం యొక్క నిబద్ధతను శ్రీ రాయ్ ఈ సందర్భంగా మరోసారి చాటిచెప్పారు. 2020 సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో సార్క్ మరియు బిమ్‌స్టెక్‌లతో క్యాస్కేడింగ్ విపత్తు ప్రమాదాన్ని నిర్వహించడంపై సంయుక్త వర్క్‌షాప్ నిర్వహించినందుకు ఎన్ఐడీఎం, ఈఎస్‌సీఏపీల సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.
******
(Release ID: 1678545)
Visitor Counter : 221