PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
18 NOV 2020 6:01PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- భారత్‌లో వరుసగా 46వ రోజునా కొత్త కేసులకన్నా కోలుకున్నవే అధికంగా నమోదు
- అలాగే వరుసగా 11వ రోజు 50,000కన్నా తక్కువగా నమోదైన కొత్త కేసులు
- గత 24 గంటల్లో కోలుకున్న కేసులు 44,739 కాగా, కొత్త కేసులు 38,617 మాత్రమే
- కోలుకునేవారి జాతీయ సగటు మరింత మెరుగుపడి 93.52 శాతానికి చేరిక
- దేశంలోని సమాజాలు, వ్యాపారాల రూపంలో మనకు అత్యంత భారీ వనరుగా ఉన్నది మన ప్రజలే: ప్రధానమంత్రి


భారత్‌లో 46వ రోజునా కొత్త కేసులను మించి నమోదైన కోలుకున్న కేసులు; వరుసగా 11వ రోజు 50 వేలలోపే కొత్త కేసుల నమోదు
భారత్‌లో వరుసగా 1.5 నెలల కాలానికిపైగా కొత్త కేసులకన్నా కోలుకుంటున్నవే అధికంగా నమోదవుతుండగా ఇవాళ వరుసగా 46వ రోజునా అదే ధోరణి కొనసాగింది. అలాగే రోజువారీ కొత్త కేసులు వరుసగా 11వ రోజునా 50 వేలకులోపే నమోదయ్యాయి. తదనుగుణంగా గత 24 గంటలలో 44,739 మంది కోవిడ్ పీడితులు కోలుకోగా- 38,617 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రోజువారీ నికర తగ్గుదల వ్యత్యాసం ఇవాళ 6,122కు చేరగా, ప్రస్తుతం చికిత్స పొందేవారి సంఖ్య 4,46,805గా ఉంది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులలో ఇది 5.01 శాతం మాత్రమే. మరోవైపు కోలుకునేవారి జాతీయ సగటు మరింత మెరుగుపడి ఇవాళ 93.52 శాతానికి చేరింది. ఆ మేరకు ఇప్పటిదాకా కోవిడ్‌నుంచి బయపడినవారి సంఖ్య 83,35,109కి చేరింది. కోలుకున్నవారిలో 74.98 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే. అత్యధికంగా కేరళలో 6,620 మంది, మహారాష్ట్రలో 5,123 మంది, ఢిల్లీలో 4,421 మంది వంతున కోలుకున్నారు. అలాగే కొత్త కేసులలో 76.15 శాతం కూడా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవే. ఇందులో కేరళ 5,792, పశ్చిమ బెంగాల్ 3,654 వంతున కేసులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 474 మరణాలు సంభవించగా, వీటిలో 78.9 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవే. ఆ మేరకు ఢిల్లీ 20.89 శాతంతో (99) మరణాలు నమోదుచేసింది. ఇక మహారాష్ట్రలో 68, పశ్చిమబెంగాల్‌లో 52 వంతున మరణాలు నమోదయ్యాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673757
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన గౌరవనీయ జోసెఫ్ ఆర్.బైడెన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన గౌరవనీయ జోసెఫ్ ఆర్.బైడెన్‌తో ఫోన్‌ద్వారా మాట్లడారు. అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించినందుకుగాను ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అమెరికాలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, దృఢ సంకల్పానికి బైడెన్ విజయాన్ని ప్రతీకగా అభివర్ణించారు. అలాగే ప్రధానమంత్రి ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన సెనేటర్ కమలా హ్యారిస్‌ను మనస్ఫూర్తిగా అభినందించడంతోపాటు శుభాకాంక్షలు తెలిపారు. భారత-అమెరికాల మధ్య ఉమ్మడి విలువలు, ప్రయోజనాలు పునాదులుగా నిర్మితమైన సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలని నాయకులిద్దరూ అంగీకారానికి వచ్చారు. కోవిడ్-19 మహమ్మారి నియంత్రణ, సరసమైన ధరకు టీకాల అందుబాటుకు ప్రోత్సాహంసహా వాతావరణ మార్పు సమస్య పరిష్కారం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం తదితరాలపై తమ ప్రాధాన్యాల గురించి వారిద్దరూ చర్చించారు.
‘బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్’ 3వ వార్షిక సమావేశంలో 2020 నవంబర్ 17న ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673653
పట్టణీకరణలో పెట్టుబడులకు భారత్‌లో అద్భుత అవకాశాలు: పెట్టుబడిదారులకు ప్రధానమంత్రి పిలుపు; కోవిడ్ అనంతర ప్రపంచ ధోరణ, పద్ధతులు మారాలి
భారత పట్టణీకరణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికారు. ‘బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్’ 3వ వార్షిక సమావేశంలో నిన్న ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా “మీరు పట్టణీకరణలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంటే భారత్ మీకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తుంది. కోవిడ్-19 అనంతర ప్రపంచానికి పునఃప్రారంభం అత్యవసరం. అది ఆలోచనా ధోరణితోపాటు వివిధ ప్రక్రియలు, ఆచరణాత్మక పద్ధతులతో కూడినదికాకపోతే ప్రయోజనం లేదు” అని మోదీ స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రతి రంగంలో కొత్త విధివిధానాల రూపకల్పనకు మహమ్మారి మనకు అవకాశమిచ్చిందని పేర్కొన్నారు. భవిష్యత్ ప్రపంచం కోసం స్థితిపునరుద్ధరణ వ్యవస్థలను నిర్మించుకోవాలంటే ఈ అవకాశాన్ని ప్రపంచం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673618
భారత-లగ్జెంబర్గ్ వర్చువల్ శిఖరాగ్ర సదస్సు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లగ్జెంబర్గ్ ప్రధాని గౌరవనీయ జేవియర్ బెటెల్ మధ్య 2020 నవంబరు 19న వర్చువల్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. భారత-లగ్జెంబర్గ్‌ల మధ్య రెండు దశాబ్దాల తర్వాత దేశాధినేతల మధ్య తొలిసారి సాగనున్న సమావేశం ఇదే. కోవిడ్ అనంతర ప్రపంచంలో రెండుదేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంసహా ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర స్వరూపంపై వారు చర్చిస్తారు. అలాగే పరస్పర ప్రయోజన సంబంధిత జాతీయ-అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకుంటారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673580
సార్వజనీనత, వైవిధ్యం, ప్రాశస్త్యాల సమ్మేళనానికి జేఎన్‌యూ ప్రతీక: రాష్ట్రపతి కోవింద్
దేశంలోని అన్ని ప్రాంతాల, సమాజంలోని అన్నివర్గాల విద్యార్థులు ఉత్తమ విద్యకు సమాన అవకాశాలున్న వాతావరణం నడుమ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో విద్యాభ్యాసం చేస్తారని రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. జేఎన్‌యూ 4వ వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా ఇవాళ (2020 నవంబర్ 18) ఆయన విద్యార్థులకు వీడియోద్వారా సందేశమిచ్చారు. విభిన్న భవిష్యత్ పురోగమన పథాన్ని ఎంచుకునే విద్యార్థులు జేఎన్‌యూలో కలసి ముందడుగు వేస్తారని రాష్ట్రపతి పేర్కొన్నారు. సార్వజనీనత, వైవిధ్యం, ప్రాశస్త్యాల సమ్మేళనానికి జేఎన్‌యూ ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి విసిరిన సవాళ్లతో ప్రపంచం నేడు ప్రపంచం సంక్షోభంలో ఉందన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673895
వర్చువల్ కార్యక్రమంగా నిర్వహించనున్న ఐఐఎస్‌ఎఫ్-2020 సన్నాహక కార్యక్రమానికి డాక్టర్ హర్షవర్ధన్ శ్రీకారం
కేంద్ర శాస్త్ర-సాంకేతిక-భూవిజ్ఞాన, ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిన్న ఐఐఎస్‌ఎఫ్ 6వ సంచిక కింద ‘ఐఐఎస్‌ఎఫ్-2020’ సంబంధిత వివిధ సన్నాహక కార్యక్రమాలను న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మధ్యప్రదేశ్ శాస్త్ర- సాంకేతికశాఖ మంత్రి శ్రీ ఓం ప్రకాష్ సఖ్లేచా ఈ భారీ కార్యక్రమ ఇ-బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673619
సీఎస్‌ఐఆర్—సీఐఎంఎఫ్‌ఆర్ వజ్రోత్సవాలను ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్
కేంద్ర శాస్త్ర-సాంకేతిక-భూవిజ్ఞాన, ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిన్న ధన్‌బాద్‌లోగల సీఎస్‌ఐఆర్ పరిధిలోని సీఐఎంఎఫ్‌ఆర్ సంస్థాపక వజ్రోత్సవాలను ప్రారంభించారు. శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలికి చెందిన ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ వజ్రోత్సవాలకు ఆయన న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శ్రీకారం చుట్టారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673568
51వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రతినిధి నమోదు ప్రారంభం
వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే 51వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ప్రతినిధుల నమోదు ప్రక్రియ 2020 నవంబరు 17న ప్రారంభమైంది. ఈ మేరకు వివిధ కేటగిరీల కింద https://iffigoa.org/ చిరునామాలో ప్రతినిధులుగా నమోదు చేసుకోవచ్చు. ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపదికన ఈ ప్రక్రియ నిర్వహిస్తారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673786
‘పీఎం-స్వానిధి’ పథకం కింద 25 లక్షలకుపైగా దరఖాస్తుల సమర్పణ
‘పీఎం-స్వానిధి’ పథకం కింద ఇప్పటిదాకా 25 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి.
‘ప్రధానమంత్రి వీధివర్తకుల ఆత్మనిర్భర నిధి’ వీధి వర్తకుల జీవనోపాధి పునరుద్ధరణకు ఉద్దేశించిన ప్రత్యేక సూక్ష్మ-రుణ సదుపాయం కల్పన పథకం. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా 12 లక్షలకుపైగా దరఖాస్తులపై రుణం మంజూరు కాగా, సుమారు 5.35 లక్షల మందికి రుణమొత్తం అందజేయబడింది. కోవిడ్-19 దిగ్బంధం నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు తిరిగివచ్చిన వీధి వర్తకులు ఈ రుణం పొందటానికి అర్హులు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673132
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- మహారాష్ట్ర: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధం దిశగా బీచ్‌లు, నదీతీరాల్లో ఛాత్ పూజను నిర్వహించరాదని ముంబై మహానగర పాలక సంస్థ నిషేధించింది. తదనుగుణంగా 20వ తేదీ సాయంత్రం సూర్యాస్తమయ సంప్రదాయాలను పాటించడం కోసం జనం గుమిగూడకుండా నగర పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అయితే, కృత్రిమంగా ఏర్పాటుచేసిన తటాకాలవద్ద పరిమితంగా బహిరంగ కార్యక్రమాలకు సంబంధిత అధికారులు అనుమతిస్తారని, తద్వారా ప్రజలు సూర్యునికి పూజలు చేయవచ్చని పేర్కొంది. ఇక మహారాష్ట్రలో కోలుకునేవారి సగటు 92.49 శాతంకాగా, మరణాలు 2.63 శాతంగా ఉన్నాయి.
- గుజరాత్: రాష్ట్రంలో కోలుకునేవారి సగటు మెరుగుపడి 91.4 శాతానికి పెరిగింది. గుజరాత్‌లో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1.90 లక్షల స్థాయిని దాటింది.
- రాజస్థాన్: రాష్ట్రంలో 26 రోజుల తర్వాత చురుకైన కోవిడ్ కేసుల సంఖ్య మరోసారి 19,000 స్థాయిని దాటింది. జైపూర్ జిల్లాలో బుధవారం గరిష్ఠంగా 484, జోధ్‌పూర్ జిల్లాలో 317, అల్వార్‌లో 247 వంతున కొత్త కేసులు నమోదయ్యాయి. రాజధాని జైపూర్‌లో నిత్యం 450 మందికిపైగా వ్యక్తులకు కోవిడ్ నిర్ధారణ అవుతోంది. అలాగే చురుకైన కేసుల 6,500కన్నా అధికంగా ఉండగా, ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 400కు చేరింది. రాజస్థాన్‌లో నేటిదాకా 40 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించారు.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో బుధవారం గరిష్ఠంగా 207, ఇండోర్ జిల్లాలో 178, గ్వాలియర్‌లో 55 వంతున కేసులు నమోదయ్యాయి. కాగా, మధ్యప్రదేశ్‌లో ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షల సంఖ్య 33,54,884కు చేరింది.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో రెండువారాల వ్యవధిలో కోవిడ్-19 మృతుల సంఖ్య పెరిగింది. ఈ మేరకు గత 15 రోజుల్లో 200మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోవిడ్ సత్వర నిర్ధారణ (ర్యాపిడ్) పరీక్ష నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ అనుగుణ ప్రవర్తన పాటించేలా ప్రజల్లో అవగాహన పెంపె కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
- గోవా: రాష్ట్రంలో కోలుకునేవారి సగటు 95.56 శాతానికి పెరిగింది. భారత్ బయోటెక్ కోవిడ్-19 టీకా పరీక్షార్థి టీకా ‘కోవాక్సిన్’ 3వ దశ ప్రయోగ పరీక్షలు గోవాలోని రెడ్కర్ ఆస్పత్రిలో ప్రారంభం కానున్నాయి.
- అసోం: ఇతర ప్రాంతాలనుంచి రాష్ట్రానికి విమానంలో వచ్చే ప్రయాణికులకు వచ్చే వారంనుంచి గువహటి విమానాశ్రయంలోనే కోవిడ్-19 పరీక్ష నిర్వహిస్తారని అసోం ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు. రాష్ట్ర పరిధిలో, ఈశాన్య రాష్ట్రాల మధ్య విమాన ప్రయాణం చేసేవారికి ఇకపై కోవిడ్ పరీక్ష అవసరం లేదు.
- నాగాలాండ్: రాష్ట్రంలో 163 కొత్త కేసుల నమోదుతో నాగాలాండ్‌లో మొత్తం కేసుల సంఖ్య 10,188కి పెరిగింది. ప్రస్తుతం చికిత్స పొందే కేసుల సంఖ్య 1,134గా ఉంది.
- కేరళ: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోవిడ్ రోగులకు పోలింగ్ రోజున మధ్యాహ్నం 3 గంటలవరకు పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. కోవిడ్ సోకి ఆస్ప్రతుల్లో, ఇళ్లలో నిర్బంధవైద్య చికిత్సలోగల రోగులు ఓటువేయడానికి కలెక్టర్ల సహకారంతో ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కోవిడ్ రోగులు పోలింగ్ చివరన నేరుగా బూత్‌కు వచ్చి ఓటువేయాల్సి ఉంటుంది. కాగా, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎ.కె.ఆంటోనీకి ఇవాళ కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. కేరళలో నిన్న 5,792 కొత్త కేసులు నమోదవగా 6,620 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య 1,915గా ఉంది.
- తమిళనాడు: రాష్ట్రంలో కోవిడ్-19 రోగులకు కోలుకున్నవారి ప్లాస్మాతో చికిత్స ప్రక్రియను ఐసీఎంఆర్‌తో సంయుక్తంగా చేపట్టిన నేపథ్యంలో ఇది నేడు సాధారణ వైద్యచికిత్సలో భాగంగా మారింది. కాగా, సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్)గల కోవిడ్-19 రోగులు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి రావచ్చునని శ్వాసకోశ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ ఫలితంగా సీవోపీడీ రోగులలో మరణాల శాతం అధికంగా ఉండటం ఈ సందర్భంగా గమనార్హం.
- కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్-19 రోగులకు ప్రైవేట్ ఆస్పత్రులలో 50 శాతం పడకలను కేటాయించాలన్న ఉత్తర్వును కర్ణాటక ప్రభుత్వం సవరించింది. ప్రైవేట్/ప్రభుత్వ ఆస్పత్రులలో కోవిడ్ వ్యాధిగ్రస్థుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా, డిసెంబర్ 12 నాటికి కర్ణాటకలో కోవిడ్ కేసుల సంఖ్య 9.25 లక్షలకు చేరుతుందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, జీవన్ రక్షా సంస్థలు అంచనా వేశాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పోలిస్తే బెంగళూరులో కోవిడ్-19 మరణాలు అత్యంత స్వల్పంగా 1.1 శాతానికి పరిమితం కావడం విశేషం.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా పంచాయతీ ఎన్నికలకు పరిస్థితి అనుకూలంగా లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కోవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించే దిశగా శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలోని 9వ తరగతి విద్యార్థులు సెన్సార్లతో కూడిన తేలికపాటి డిజిటల్ ఐడీ కార్డులను రూపొందించారు.
- తెలంగాణ: రాష్ట్రంలో మంగళవారం 952 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 2,58,828కి పెరిగింది. కాగా, ఇవాళ 1,602మందికి వ్యాధి నయం కావడంతో ప్రస్తుతం చికిత్స పొందేవారి సంఖ్య 13,732కు దిగివచ్చింది. మొత్తంమీద ఇప్పటిదాకా 2,43,686 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కాగా, గ్రామీణ తెలంగాణలో కేంద్రాలు తెరిచేందుకు ఇ-క్లినిక్ ఫ్రాంచైజీలు సిద్ధమయ్యారు. ప్రస్తుత మహమ్మారి సమయంలో వైద్యులు ప్రత్యక్షంగా పరీక్షించడం సాధ్యంకాని నేపథ్యంలో డాక్టర్‌తో సంప్రదింపు, విశ్లేషణ పరీక్షలు తదితరాలను ‘ఇ-క్లినిక్’లు సులభతరం చేస్తాయి.
FACT CHECK


*******
(Release ID: 1673896)
Visitor Counter : 319