ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో 46వ రోజు కూడా కొత్తకేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ
11వ రోజుకూడా 50 వేల లోపే కొత్త కేసులు
Posted On:
18 NOV 2020 12:43PM by PIB Hyderabad
భారత్ లో ఒకటిన్నర నెలలకు పైగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. 46 వ రోజు కూడా ఇదే ధోరణి కొనసాగింది. అదే విధంగా రోజువారీ కొత్త కేసులు గత 11 రోజులుగా 50 వేలలోపే ఉంటున్నాయి. గత 24 గంటలలో 44,739 మంది కోవిడ్ బాధితులు కోలుకోగా కొత్తకేసులు 38,617 నమోదయ్యాయి. దీంతో నికరంగా 6122 కేసుల తేడా తేలింది. ప్రస్తుతం మొత్తం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 4,46,805 కాగా ఇది ఇప్పటిదాకా పాజిటివ్ కేసులుగా నమోదైనవారిలో కేవలం 5.01% మాత్రమే.

సగటున రోజువారీ కొత్త కేసులు కొద్ది వారాలుగా తగ్గుతూ వస్తున్నాయి.

కోవిడ్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ప్రజలలో అవగాహన పెరగటం కారణంగా అమెరికా, యూరప్ దేశాలకు భిన్నంగా కొత్త కేసులు భారత్ లో తగ్గుముఖం పట్టాయి.

కోలుకున్నవారి శాతం బాగా మెరుగుపడి 93.52% చేరింది. ఇప్పటివరకు కోలుకున్న మొత్తం కోవిడ్ బాధితులు 83,35,109 మంది కాగా గత 24 గంటలలో తాజాగా కోలుకున్నవారిలో 74.98% కేసులు 10 రాష్ట్రాల్లోనే వచ్చాయి. 6,620 మంది కోలుకున్న కేరళ మొదటి స్థానంలో ఉండగా, 5,123 మందితో మహారాష్ట్ర, 4,421 మందితో ఢిల్లీ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

గత 24 గంటలలో వచ్చిన కొత్త కేసులలో 76.15% మేరకు పది రాష్టాలనుంచే ఉన్నాయి. ఢిల్లీలో అత్యధికంగా 6,396 కేసులు నమోదు కాగా కేరళలో 5,792 , పశ్చిమ బెంగాల్ లో 3,654 వచ్చాయి.

గత 24 గంటలలో మొత్తం 474 మంది మరణించగా, వారిలో 78.9% మంది కేవలం పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. ఈ మరణాలలో 20.89% కేవలం ఢిల్లీలో నమోదు కాగా 68 మరణాలతో మహారాష్ట్ర, 52 మరణాలతో పశ్చిమ బెంగాల్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

****
(Release ID: 1673757)
Visitor Counter : 257
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam