ప్రధాన మంత్రి కార్యాలయం

భారత, లక్సెంబర్గ్ దేశాల మధ్య వర్చువల్ సదస్సు

Posted On: 17 NOV 2020 8:06PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు లక్సెంబర్గ్ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ జేవియర్ బెట్టెల్, 2020 నవంబర్, 19వ తేదీన దృశ్య మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు. 

గత రెండు దశాబ్దాలలో భారత, లక్సెంబర్గ్ దేశాల మధ్య ముఖా ముఖీ సమావేశం జరగడం ఇదే మొదటి సారి.  కోవిడ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా నెలకొనే పరిస్థితుల నేపథ్యంలో, భారత, లక్సెంబర్గ్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంతో సహా ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన అన్ని విషయాలను ఈ సందర్భంగా ఇరువురు నాయకులు చర్చించనున్నారు.  పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలపై వారు తమ అభిప్రాయాలను ఒకరికొకరు తెలియజేసుకుంటారు. 

ఇటీవలి కాలంలో భారత, లక్సెంబర్గ్ దేశాలు ఉన్నత స్థాయి సంబంధాలను కొనసాగిస్తున్నాయి.  ఇద్దరు ప్రధానమంత్రులు గతంలో మూడు సందర్భాల్లో కలుసుకున్నారు. 

 

*****


(Release ID: 1673580) Visitor Counter : 181