PIB Headquarters
కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్
Posted On:
21 OCT 2020 6:07PM by PIB Hyderabad
(ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఉంటుంది.)
#Unite2FightCorona
#IndiaFightsCorona
* ఇండియాలో వరుసగా రెండో రోజు కూడా కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 7.5 లక్షల లోపునే ఉంది.
*దేశంలో గత 24 గంటలలో 61,775 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కోవిడ్ నిర్ధారణ అయిన కేసులు కేవలం 54,044
*జాతీయ స్థాయిలో మరణాల కేస్ రేటు ఈరోజు 1.51 శాతానికి పడిపోయింది.
*కోవిడ్ మహమ్మారి పై పోరాటం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం , అశ్రద్ధ పనికిరాదని ప్రధానమంత్రి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
*జాతీయస్థాయిలో కోలుకున్న వారి రేటు 88.81 శాతానికి పెరిగింది.
కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య ఇండియాలో వరుసగా తగ్గుముఖం పట్టడం కొనసాగుతోంది.
ఈ రోజు రెండో రోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి.
క్రియాశీల కేసుల సంఖ్య 7.5 లక్షల కంటే తక్కువ. 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మరణాల కేస్ రేటు 1 శాతం కంటే తక్కువగా ఉంది.
ఇండియాలో ఈరోజు రెండో రోజు కూడా క్రియాశీల కేసుల సంఖ్య 7.5 లక్షల కంటే తక్కువగానే ఉంది. దేశంలో గత 24 గంటలలో 61,775 మంది కోలుకున్నారు. కొత్తగా కోవిడ్ నిర్ధారణ అయిన కేసుల సంఖ్య కేవలం 54,044. దేశంలో గత 24 గంటలలో 10,83,608 మందికి పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు బయటపడ్డాయి. జాతీయస్థాయిలో మరణాల కేస్‌రేటు (సిఎఫ్ఆర్) ఈరోజు 1.51 శాతానికి పడిపోయింది. సిఎఫ్ఆర్ ను 1 శాతం కంటే తక్కువకు తీసుకురావలసిందిగా కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రస్తుతం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1 శాతం కంటే తక్కువ కేస్ ఫాటలిటీ రేటును నమోదు చేస్తున్నాయి. దేశంలో ఈరోజుకు మొత్తం కోవిడ్ నుంచి కోలుకున్న వారు 67,95,103 మంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఒక్క రోజులో గరిష్ఠంగా ఉండడంతో జాతీయ రికవరీ రేటు కూడా పెరుగుతోంది. ఇది దాదాపుగా 89శాతానికి చేరువకు వచ్చింది. (88.81 శాతం) కొత్త కేసులలో 77 శాతం కేసులు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయి. కొత్తగా కోలుకున్న వారి సంఖ్యలో మహారాష్ట్రను కర్ణాటక దాటిపోయింది. కర్ణాటకలో 8500మంది కొత్తగా కోలుకున్నారు.మహారాష్ట్ర,కేరళ రాష్ట్రాల నుంచి కొత్త గా కోలుకున్నవారు 7,000 పైగా ఉన్నారు. గత 24 గంటలలో దేశంలో 54,044 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 78 శాతం కేసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయి. ఇవి 8,000 పైగా ఉన్నాయి. కర్ణాటక,కేరళ రాష్ట్రాలు రెండూ కలిపి 6,000పైగాకేసులున్నాయి. గత 24 గంటలలో 717 మరణాలు సంభవించాయి.కొత్తగా సంభవించిన మరణాలలో 82 శాతం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచి సంభవించినవే. నిన్న నమోదైన మరణాలలో 29 శాతం మరణాలు అంటే 213మహారాష్ట్రనుంచి నమోదయ్యాయి. ఆతర్వాత స్థానంలో కర్ణాటక ఉంది. ఇక్కడి నుంచి 66 మరణాలు సంభవించాయి.
మరిన్ని వివరాలకు:…… https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666502
-------
దేశప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రత్యేక ప్రసంగం :
ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ టెలివిజన్ ద్వారా దేశప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో , కోవిడ్‌పై పోరాటంలో ప్రజలు ఏమాత్రం అశ్రద్ధ, అలసత్వం చూపరాదని కోరారు. లాక్‌డౌన్ తొలగించడమంటే కరోనా వైరస్ తుడిచిపెట్టుకుపోయినట్టు కాదని ప్రధానమంత్రి అన్నారు.
దేశవ్యాప్తంగా పరిస్థితులు మెరుగుపడడంపట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ధిక వ్యవస్థ తిరిగి మామూలు పరిస్థితులకు చేరుతున్నదని, ప్రజలు తమ బాధ్యతలను నెరవేర్చడంలో భాగంగా ఇళ్లనుంచి బయటకు వస్తున్నారని అన్నారు. దేశంలో రికవరీ రేటు మెరుగుపడిందని, మరణాల రేటు తగ్గిందని అన్నారు. ప్రతి పది లక్షల మంది పౌరులకు సుమారు 5,500 మంది కరోనా బారిన పడ్డారని, అదే అమెరికా , బ్రెజిల్ వంటి దేశాలలో ఇది 25,000 వరకూ ఉ న్నదని అన్నారు. ఇండియాలో మరణాల రేటు ప్రతి పదిలక్షల మంది పౌరులకు 83 గా ఉన్నదని, అదే అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, బ్రిటన్ ఇంకా చాలా దేశాలలో ఇది 600 వరకూ ఉందని అన్నారు. పలు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూసినపుడు ఇండియా దేశంలోని ఎందరి ప్రాణాలను కాపాడడంలో విజయం సాధించిందని ఆయన అన్నారు.దేశంలో కోవిడ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా 90 లక్షలకు పైగా పడకలు, 12,000 క్వారంటైన్ కేంద్రాలు కరోనా పేషెంట్లకు అందుబాటులో ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 2000 కరోనా పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయని అన్నారు. కోవిడ్ పరీక్షల సంఖ్య త్వరలోనే పది కోట్లు దాటనున్నట్టు ఆయన తెలిపారు. వైద్యులు , నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు ఇంతపెద్ద సంఖ్యలో జనాభాకు నిస్వార్ధంగా తమ సేవలు అందిస్తున్నారని , సేవా పరమోధర్మ అన్న సూత్రాన్ని వారు పాటిస్తున్నారని కొనియాడారు. మానవాళిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని, ఎన్నో దేశాలు, మన దేశంలోని శాస్త్రవేత్తలు వాక్సిన్ తయారీపై కృషి చేస్తున్నారని అన్నారు. కోరానపై వివిధ రకాల వాక్సిన్‌లకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, వీటిలో కొన్ని అడ్వాన్స్ దశలో ఉన్నాయన్నారు. వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అది ప్రతి ఒక్క పౌరుడికి చేరేలా ప్రభుత్వం సవివరమైన తగిన మార్గసూచీని రూపొందిస్తున్నదని ఆయన అన్నారు.
మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666281
ప్రధానమంత్రి దేశ ప్రజలనుద్దేశించి చేసినప్రసంగ పాఠం ఆంగ్లంలో...
వివరాలకు:
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666268
పోలీసు సంస్మరణ దినం సందర్భంగా పోలీసు అమరులకు నివాళులర్పించిన ప్రధానమంత్రి
పోలీసు సంస్మరణ దినం సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , విధినిర్వహణలో మరణించిన పోలీసులకు నివాళులర్పించారు. శాంతి భద్రతలను కాపాడడంతోపాటు, పోలీసులు తీవ్రమైన నేరాల కేసులను పరిష్కరిస్తున్నారని, కోవిడ్ -19 సమయంలో సహాయం అందించడం దగ్గరనుంచి విపత్తుల వేళ సహాయపడుతున్నారని , ఎలాంటి అరమరికలులేకుండా మన పోలీసులు సమాజానికి అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని ప్రధానమంత్రి కొనియాడారు. ప్రజలకు సహాయం చేసేందుకు సన్నద్ధంగా ఉన్న వారి నిబద్ధత మనకు గర్వకారణమని ప్రధానమంత్రిఅన్నారు.
మరిన్ని వివరాలకు :: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666333
ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ, హిజ్ ఎక్సలెన్సీ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ మధ్య ఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు , హిజ్ ఎక్సలెన్సీ మూన్ జే ఇన్ తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరువురు నాయకులు కీలక అంతర్జాతీయ పరిణామాలు,కోవిడ్ మహమ్మారిపై పోరాటం వంటి అంశాలను సమీక్షించారు. ప్రస్తుత అంతర్జాతీయ వాల్యూచెయిన్ లో వైవిధ్యం, పారదర్శక, అభివృద్ధి నిర్దేశిత, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వాణిజ్య విధానం, ప్రపంచ వాణిజ్య సంస్థ పాత్ర తదితర అంశాలపై వారు చర్చించారు. పై అంశాలపై ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ ఉండాలని ఇరువురు నాయకులూ అంగీకరించారు. అలాగే ద్వైపాక్షిక సహకారాన్ని అన్ని రంగాలలో మరింత ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించారు.
మరిన్ని వివరాలకు:
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666524
సిఎస్ఐఆర్ భాగస్వామ్యంతో కోవిడ్ 19 కు సంబంధించి రీపర్పస్‌డ్ డ్రగ్‌ల విషయంలో సాగే క్లినికల్ పరీక్షల వెబ్‌సైట్ క్యూర్‌డ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖమంత్రి డాక్టర్ హర్షవర్ధన్, వివిధ పరిశ్రమ వర్గాల భాగస్వామ్యం , ఇతర ప్రభుత్వ విభాగాలు,మంత్రిత్వశాఖల సహాయంతో చేపడుతున్న వివిధ కోవిడ్ -19 క్లినికల్ పరీక్షలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే వెబ్‌సైట్‌ను నిన్న ప్రారంభించారు. దీనిని క్యూర్‌డ్‌గా పిలుస్తారు. ఈ వెబ్‌సైట్ మందులు, పరీక్షలు, పరికరాలకు సంబంధించి ప్రస్తుత ప్రయోగ దశలు, భాగస్వామ్యం వహిస్తున్న సంస్థలు, వాటి పాత్ర, తదితర వివరాలను అదిస్తుంది. కోవిడ్ -19 పై పోరాటంలో ముందుండి కృషిచేస్తున్నందుకు సిఎస్ఐఆర్ ను మంత్రి అభినందించారు. క్లినికల్ పరీక్షలను ప్రాధాన్యతగా చేపట్టడం, రెగ్యులేటరీ అనుమతులకు అవసరమైన డాటాను సిద్ధం చేయడం, మందులు, పరీక్షలను మార్కెట్‌లో విడుదల చేయడానికి సహకరించడం వంటివి చేస్తున్నందుకు ఈ సంస్థను మంత్రి అభినందించారు. రీపర్పస్‌డ్ డ్రగ్‌లను వాడే విధానాన్ని కొత్త ప్రక్రియల ద్వారా కోవిడ్ 19 మందుల తయారీని దానిని పరిశ్రమకు బదలాయించే విధానాన్ని ఆయన ప్రశంసించారు. సిఎస్ఐఆర్ యాంటీ వైరల్స్‌కు సంబంధించి బహుళ కాంబినేషన్ల విషయంలో కోవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు క్లినికల్ ట్రయల్స్ అవకాశాలను పరిశీలిస్తున్నదని అన్నారు. సిఎస్ ఐఆర్ ,ఆయుష్ ఔషధాల విషయంలో కూడా క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు , ఆయుష్ ప్రొఫిలాక్టిక్‌లు, ఆయా మొక్కల ఆధారిత ఉత్పత్తులు, కాంబినేషన్ల సామర్ధ్యం,భద్రత వంటి విషయాలపైనా ఇది పరిశీలన చేస్తోంది.
మరిన్నివివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666280
కోవిడ్ -19 నేపథ్యంలో , రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆయుష్ మంత్రిత్వశాఖ కుచెందిన నేషనల్ ఆయుష్ మిషన్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష:
కోవిడ్ 19నియంత్రణకు సంబంధించి తీసుకోవలసిన ముందస్తు నియంత్రణ ,నిర్వహణ చర్యలకు సంబంధించి ఆయుష్ మంత్రిత్వశాఖ ఇటీవల తీసుకున్న వివిధ ప్రభావవంత చర్యల విషయమై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వైద్య రాజేష్‌కొటెచ్చా అధ్యక్షత వహించారు. ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన ప్రిన్సిపుల్ సెక్రటరీలు, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆరోగ్య శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్న జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి సంబంధించి ఇటీవల విడుదలైన నేషనల్ ఆయుర్వేద, యోగా ప్రొటోకాల్ , జాతీయ ఆయుష్ మిషన్ కింద ఆమోదించిన ఆయుష్ హెల్త్‌వెల్ నెస్ సెంటర్లను వీలైనంత త్వరగా పనిచేసేట్టుచూడడం, నేషనల్ ఆయుష్ మిషన్ కింద రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధుల బదిలీ, ఖర్చును మెరుగు పరచాల్సిన అత్సవసర అవసరాన్ని ఆయన ప్రధానంగా గుర్తుచేశారు. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వీలైనంత త్వరగా ఆయుష్ హెల్త్ , వెల్‌నెస్ కేంద్రాలు పనిచేసేట్టు చేయడానికి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని తెలియజెప్పారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వశాఖ తీసుకున్న కీలక చర్యలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే ప్రొటోకల్ భద్రతకు సంబంధించి పొరపాటుగా అర్థం చేసుకునేదిగా ఉండరాదన్నారు. కోవిడ్ -19నియంత్రణ సమర్ధంగా చేపట్టేందుకు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు క్రియాశీలంగా పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. కోవిడ్ -19 మహమ్మారి నియంత్రణకు ప్రొటోకాల్స్ అమలులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చురుకైన సహకారం అందించాలన్నారు. ఇలాంటి ప్రొటోకాల్స్ రూపకల్పన ద్వారా ఆయుష్ వ్యవస్థలను ప్రధానస్రవంతిలోకి తీసుకురావడానికి ప్రముఖంగా దోహదపడుతుందన్నారు. సంయుక్త కృషి , పరస్పరం తమ అనుభవాలను పంచుకోవడం, వాటిని అందరూ అంగీకరించడం, ఇవి ఆయుష్ వ్యవస్థకు బలాన్నిచేకూరుస్తాయని, దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారిపై పోరుకు ఉపకరిస్తాయని ఆయన అన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666261
భారతీయుల భద్రత, వారి ఆరోగ్యకరమైన జీవనం మోడీ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యతలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.
భారతీయుల భద్రత, వారి ఆరోగ్యకరమైన జీవనం మోడీ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యతలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, శ్రీనరేంద్ర మోదీ ప్రభుత్వం, ప్రస్తుత కోవిడ్ పై పోరాటంలో, పౌరుల ప్రాణాలను కాపాడడమే తమ అత్యంత ప్రధాన బాధ్యత అని భావిస్తున్నదని అన్నారు. ప్ర|ధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, ఈ సంకల్పాన్ని పునరుద్ఘాటించారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వాక్సిన్ వచ్చే వరకు ఎలాంటి అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. తద్వారా తమ కుటుంబాలను సురక్షితంగా ఉంచుకోవాలని కోరారు. ఐక్య భారతావని, దృఢ సంకల్పంగల భారాతావని ఈ మహమ్మారి సంక్షోభాన్ని అధిగమించగలదని ఆయన అన్నారు.
మరిన్ని వివరాలకు :: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666275
2019-20 సంవత్సరానికి, ఉత్పాదకతతో ముడిపడిన,ఉత్పాదకతతో సంబంధం లేని బోనస్‌నుఆమోదించిన కేంద్ర కేబినెట్.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్రకేబినెట్ 2019-20 సంవత్సరానికి సంబంధించి ఉత్పాదకతతో ముడిపడిన బోనస్‌చెల్లింపునకు అనుమతిచ్చింది. దీని వల్ల రైల్వేలు, పోస్టల్, డిఫెన్స్, ఇపిఎఫ్ఒ,ఇఎస్ ఐసి తదితర వాణిజ్యసంస్థలకు చెంఇన 16.97 లక్షల నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన వ్యయం రూ 2,791 కోట్ల రూపాయలుగా ఉండనుంది. ఉత్పాదకతతో సంబంధంలేని బోనస్ లేదా అడ్‌హాక్ బోనస్ 13.70 లక్షల మందికేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలిగించనుంది. ఇందుకు అయ్యే మొత్తం 946 కోట్ల రూపాయలు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666511
2020 డిసెంబర్ 22 నుంచి 25 వరకు వర్చువల్ పద్ధతిలో జరగనున్న 6 వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్.
ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) 2020 , ఆరవ ఎడిషన్ ఈ ఏడాది డిసెంబర్ 22 నుంచి 25 వరకు వర్చువల్ పద్ధతిలో జరగనుంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక , భూ విజ్ఞానం ,కుటుంబ, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిన్న జరిగిన ఒక సమీక్షా సమావేశంలో ఈవిషయం తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారినుద్దేశించి మాట్లాడుతూ ఆయన, ఐఐఎస్ఎఫ్ 2020 , ఇంతకు ముందుకంటే ఉన్నత స్థాయిలో వర్చువల్ ప్లాట్‌ఫారం ద్వారా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇది ఒక కొత్త విధానం అన్నారు. ఐఐఎస్ ఎఫ్ 2020 శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధన శాలల నుంచి వెలుపలకు తీసుకురావడం ద్వారా విద్యార్ధులలో, యువతలో శాస్త్ర విజ్ఞానంపట్ల అభిమానం, ప్రేమ కలిగేట్టుచేయడమే కాకుండా, భారతీయ శాస్త్రవేత్తల పాత్రను, శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణలను ఇది ప్రతిబింబించాలని, కేవలం ఆత్మనిర్భర్ కోసమే కాకుండా ప్రపంచ సంక్షేమం కోసం జరగాలని ఆయన అన్నారు. కోవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇండియా నిర్వహించిన పాత్రను ప్రముఖంగా తెలియజేసేందుకు అనుసరించాల్సిన విధానంపై మేధోమధనం చేయాల్సిందిగా ఈ సమావేశంలో పాల్గొన్న వారికి మంత్రి సూచించారు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666283
పే రోల్ సమాచారం: ఇపిఎఫ్ఒ నికర చందాదారులకు ఆగస్టు 2020లో అదనంగా 10.06 లక్షలమంది చేరిక
2020 అక్టోబర్ 20న ఇపిఎఫ్ఒ ప్రచురించిన ప్రాథమిక పేరోల్ సమాచారం ప్రకారం, ఇపిఎఫ్ఒ చందాదారుల సంఖ్య 2021 ఆర్ధిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో సుమారు 20 లక్షలకు పెరిగినట్టు తేలింది. కోవిడ్ -19మహమ్మారి , ఆ తర్వాత దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంపై వ్యతిరేక ప్రభావం చూపింది. అయితే 2020జూలై , ఆగస్లు కుసంబంధించి ప్రాధమిక పేరోల్ గణాంకాలు మాత్రం కోవిడ్ -19 నెగటివ్ ప్రభావం క్రమంగా తొలగి పోతున్న సూచనలు కనబరచి క్రమంగా కోవిడ్ ముందునాటి పరిస్థితికి కోలుకోవడం మొదలు పెట్టింది. జూలై 2020 సమయంలో సుమారు 7.49 లక్షల నికర చందాదారులు కొత్తగా నమోదయ్యారు, అంటే ఇది గత ఏడాది 2019 జూలై నెలలో నికర చేర్పులలో 64 శాతంగా చెప్పుకోవచ్చు. ఆగస్టు 2020 ఎన్‌రోల్‌మెంట్ రికవరీ ధోరణి మరింతగా మెరుగుపడింది. ఈ సమయంలో నికర చేర్పులు సుమారుగా 2019 ఆగస్టు లో రికార్డుఅయిననికర చందాదారుల పురోగతిలో 93 శాతం వరకుఉన్నాయి. ఇపిఎఫ్ ఒ చందాదారుల పెరుగుదల తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయన్నదానికి సూచన.
. మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666247
ఐఐటి ఖరగ్‌పూర్ సాంకేతిక ఆవిష్కరణలు గ్రామీణ భారతదేశ జీవితాలపై ప్రభావం చూపనున్నదని వ్యాఖ్యానించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి
ఐఐటి ఖరగ్‌పూర్ పరిశోధకులచే రూపొందించబడిన కొవిరాప్ డయాగ్నస్టిక్ మెషిన్‌ను, కొవిడ్ -19 గుర్తింపు సమర్ధత విషయమై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసిఎంఆర్) విజయవంతంగా ఆమోదించింది. వివిధ వాణిజ్య సంస్థలు ఇప్పటికే లైసెన్సుకోసం ఐఐటిని సంప్రదించాయి. రాష్ట్రవ్యాప్తంగా సత్వరం ఈ ఆవిష్కరణఫలితాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్తలు ముందుకువచ్చాయి. ఐసిఎంఆర్ లేబరెటరీలో కఠిన పరీక్షల అనంతరం , దాని కఠిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండడంతొ దీనికి ఐసిఎంఆర్ కోవిడ్ 19 డయాగ్నస్టిక్ పరీక్షగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పరీక్షనిర్వహించడం చాలావరకు సులభం. చౌక కూడా. దీని ద్వారా గంటలోనే ఫలితాలు వస్తాయి. ఈరోజు వర్చువల్ కాన్ఫరెన్సులో మాట్లాడుతూ, కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ఐఐటి ఖరగ్‌పూర్ పరిశోధకులు, ఈ మెడికల్ టెక్నాలజీ ఆవిష్కరణ ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించారని అన్నారు. ఇది గ్రామీణ భారతావనిలోని ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతుందని, ఇది ఎక్కడికైనా తీసుకుపొవడానికి వీలైన పోర్టబుల్, తక్కువ ఇంధన సరఫరాతోపనిచేసేదని ఆయన అన్నారు. సాధారణ శిక్షణ పొందిన యువకులు ఈ పరికరంఉపయోగించవచ్చని ఆయన అన్నారు.
మరిన్ని వివరాలకు https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666647
ప్రధానమంత్రి సూచించిన జనాందోళన్ కార్యక్రమం అమలుగురించి మధ్యప్రదేశ్‌తో చర్చించిన డాక్టర్ హర్షవర్ధన్.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, ప్రధానమంత్రి సూచించిన జనాందోళన్ అమలు విషయమై మధ్యప్రదేశ్ కుచెందిన సీనియర్ అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకుచెంఇన సీనియర్ అధికారులు పాల్గోన్నారు. మధ్యప్రదేశ్‌లో కోవిడ్ కేసులు, దేశంలో కోవిడ్ కేసులతో పోల్చి చూశారు. దేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి రేటు ప్రస్తుతం 89 శాతం ఉండగా, మధ్యప్రదేశ్‌లో ఇది 90.55 శాతం ఉందని అన్నారు. అలాగే మరణాల కేస్ రేటు మధ్యప్రదేశ్‌లో 1.73 శాతం ఉందని, ఇది జాతీయ సగటు కంటే కాస్త ఎక్కువగా ఉందని అన్నారు. క్రమంగా కోవిడ్ కేసులు తగ్గడాన్ని ప్రస్తావిస్తూ డాక్టర్ హర్ష వర్ధన్, ప్రతి ఒక్కరూ కొవిడ్ కు సంబంధించి తగిన జాగ్రత్తలు పాటిస్తే దీని వ్యాప్తిని అదుపు చేయవచ్చని ఆయన పునరుద్ఘాటించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666636
పిఐబి క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి అందిన సమాచారం:
* మహారాష్ట్ర: కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో రెండు పొరలు, మూడు పొరలు కలిగిన మాస్కులు, ఎన్-95 మాస్కులు ధరలపైపరిమితిని మహారాష్ట్రప్రభుత్వం విధించింది ఎన్ -95 మాస్కులను రాష్ట్రంలో
రూ 19 లనుంచి 49 రూపాయల మధ్యలో సరఫరా చేయాలి. అలాగే రెండుపొరలు, మూడు పొరలు కలిఇన మాస్కులను యూనిట్ ఒకటికి మూడు రూపాయల నుంచి 4 రూపాయలకు సరఫరా చేయాలి. ఇక వరుసగా రెండవరోజు ఈరోజు కూడా రాష్ట్రంలో కేసులు 10,000 లోపే అంటే 8151 కేసులు ఉన్నాయి. ముంబాయిలో 1233 కొత్తకేసులు నమోదయ్ఆయి. మహారాష్ట్రలో మొత్తం యాక్టివ్ కేసులు 1.74 లక్షలుగా ఉన్నాయి.
* రాజస్థాన్ : రాజస్థాన్‌లో వరుసగా ఏడవరోజు కూడా కొత్తకేసుల కన్నా కోలుకుంటున్నకేసుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. దీనితో యాక్టివ్ కేసుల సంఖ్య 20,254 కు పడిపోయింది. ఇది గత 22 రోజులలో కనిష్ట స్థాయి. మంగళవారం నాడు 2,522 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, కొత్తగా 1897 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాజస్థాన్‌లో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,55,095కు పెరిగింది. మొత్తం కేసులసంఖ్య 1,77,123 గా ఉంది. దీనితో రికవరీరేటు 87.5 శాతం గా ఉంది.
* మధ్యప్రదేశ్ : సుమారు రెండు నెలల అనంతరం మధ్యప్రదేశ్‌లో రోజువారి కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం నాడు 1000 కంటే తక్కువ స్థాయికి పడిపోయింది. మొత్తం 975 మంది కి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య మధ్యప్రదేశ్‌లో 1,62,178 కి చేరింది.
*ఛత్తీస్ ఘడ్ : ఛత్తీస్‌ఘడ్‌లో 2,507 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మరో 50 మరణాలు సంభవించాయి. దీనితో ఛత్తీస్‌ఘడ్‌లో కేసుల సంఖ్య 1,6,279 కి పెరిగింది. మరణాల సంఖ్య మంగళవారానికి 1584 కు చేరింది. కోలుకున్న వారి సంఖ్య 1,37, 986 కు పెరిగింది. ఈరోజు వివిధ ఆస్పత్రులనుంచి 378 మంది ప్రజలు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 1910 మంది తమ హోమ్ ఐసొలేషన్‌ను ఈరోజు పూర్తి చేసుకున్నారు. రాష్ట్రంలో 25,709 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
* అరుణాచల్ ప్రదేశ్ : అరుణాచల్ ప్రదేశ్ లో కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఒకరు మరణించారు. దీనితో అరుణాచల్‌ప్రదేశ్‌లో మరణాల సంఖ్య 31 కి పెరిగింది. రాష్ట్రంలో 255 మంది కోవిడ్ పేషెంట్లు ఈరోజు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా ఈరోజు కొత్తగా 135 కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 80.09 గా ఉంది.
* అస్సాం: అస్సాంలో గత 24 గంటలలో 666 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. 38,585 పరీక్షలు నిర్వహించారు. పాజిటివిటీ రేటు 1.73 శాతం గా ఉంది.
*మేఘాలయ: మేఘాలయలో ఈరోజు 105 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం యాక్టివ్‌కసులు 2020 కి చేరుకున్నాయి. ఇందులో 98 బిఎస్ఎఫ్ , సాయుధ బలగాలకు సంబంధించినవి.
* మిజోరం : మిజోరంలో నిన్న 30 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖయ 2310 కి చేరింది. యాక్టివ్ కేసులు 145 గా ఉన్నాయి.
* కేరళ : రాష్ట్రంలో స‌్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి కోవిడ్ సంబంధిత మార్గదర్శకాలను విడుదల చేశారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్ధితో సహా మొత్తం ముగ్గురిని మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్ధులు పూల మాలలను ,పుష్పగుచ్ఛాలను , కరెన్సీ దండలను, షాల్స్‌ను స్వీకరించరాదు.అభ్యర్ధితో సహా ఐదుగురు మాత్రమే ఇంటింటి ప్రచారంలో పాల్గొనాలి. ఎన్నికల ప్రచారానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవచ్చు. ప్రైవేటు రంగ ప్రయోగశాలలలో కోవిడ్ పరీక్షల రేటును తగ్గించింది. ముఖ్యమంత్రి విపత్తు నిధికి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు తప్పకుండా కొంత మొత్తాన్ని జీతంనుంచి కంట్రిబ్యూట్‌చేయాలన్న అంశాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.
* తమిళనాడు: తమిళనాడులో పండగ సీజన్ నడుస్తుండడంతో రాష్ట్రప్రభుత్వం దుకాణాలను రాత్రి 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతిచ్చింది. ప్రస్తుత దశ లాక్‌డౌన్ ఈనెల 31తో ముగియనుంది. లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో వలస కూలీలు తిరిగి కోయంబత్తూరుకు వస్తున్నారు. ఇలా తిరిగి వచ్చిన వారు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మార్చి నుంచి లాక్‌డౌన్ కారణంగా ఎన్‌పిఆర్ కార్యకలాపాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. సినిమా థియేటర్లు పునఃప్రారంభించేందుకు అనుమతించాల్సిందిగా సినిమా థియేటర్ల యజమానులు ముఖ్యమంత్రి పళని స్వామికి విజ్ఞప్తి చేశారు. వినోదపన్ను మినహాయింపు ఇచ్చి తమ నష్టాలుతొలగించుకునేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా వారు కోరారు.
* కర్ణాటక: వినియోగించిన మాస్కులను పారవేయడానికి సంబంధించి స్పష్టమైన నిబంధనలు రూపొందించాల్సిందిగా కర్ణాటక హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. గత వారం రోజులలో బెంగళూరులోని ఆస్పత్రులకు కోవిడ్ సంబంధిత కేసుల రాక తగ్గింది. అయితే చాలా ఆస్పత్రులలో ఐసియు బెడ్లు ఖాళీ లేవు. లాక్‌డౌన్ కారణంగా చాలావరకు ఎం.ఎస్.ఎం.ఇలు పరిస్థితి మెరుగుపడకపోతే మూతపడే ప్రమాదం ఉంది. లాక్‌డౌన్ ప్రభావం 20 శాతం పరిశ్రమలపై ఉంది. కేవలం 10శాతంకంటే తక్కువ పరిశ్రమలు తెరుచుకున్నాయి.
*ఆంధ్రప్రదేశ్: కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెలాఖరు వరకు చేపట్టనున్నది. ఇందుకు సంబంధించి న ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ రోజు విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు. కోవిడ్ సన్నద్ధతపై రాగల పదిరోజులు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. కింగ్ జార్జ్ హాస్పిటల్ , విశాఖపట్నం,ఆంధ్రా మెడికల్ కాలేజ్ (ఎఎంసి) లు డిఆర్‌డిఓ కరోనా పేషెంట్ల కు వాడే 2 దియోక్సీ డీ గ్లూకొజ్ మందుకు సంబంధించిన పరీక్షలను పూర్తి చేశాయి. ఇది ఒకమాదిరి నుంచి తీవ్ర లక్షణాలు కలవారికి ఉపయోగించడానికి . సత్వరం కోలుకునే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉద్దేశించినది . ఈ మందును 9మంది వలంటీర్ల కు వాడారు. డిఆర్‌డిఒ ప్రొటోకాల్స్ కు అనుగుణంగా దీనిని ఉపయోగించి చూశారు. ఇందుకు సంబంధించిన నివేదికను తదుపరి పరిశీలనల నిమిత్తం పంపారు.
*తెలంగాణ : తెలంగాణాలో గత 24 గంటలలో 1579 కొత్త కేసులు నమోదు కాగా 1811 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. 5 గురు మరణించారు. 1579 కోవిడ్‌పాజిటివ్ కేసులలో జిహెచ్ఎంసి లో 256 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 2,26,124. యాక్టివ్ కేసులు 20,449, మరణాలు 1287, కోలుకుని ఇంటికి వెళ్లినవారు 2,04,388 మంది.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 3వ సారి వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన యుజి,పిజి పరీక్షలను దసరా (అక్టోబర్ 25 ) వరకు వాయిదా వేసింది. తెలంగాణాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అక్కడికక్కడే అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 5గురు సభ్యులతో ఒక అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం అక్టోబర్ 22నుంచి రెండు రోజులపాటు పర్యటించి పరిస్తితిని అంచనా వేస్తుంది.
***
(Release ID: 1666650)
Visitor Counter : 278