ప్రధాన మంత్రి కార్యాలయం
కర్తవ్య నిర్వహణ లో అమరులైన పోలీసు సిబ్బందికి పోలీసు సంస్మరణ దినం సందర్భం లో నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
Posted On:
21 OCT 2020 11:43AM by PIB Hyderabad
కర్తవ్య నిర్వహణ లో అమరులైన పోలీసు సిబ్బందికి పోలీసు సంస్మరణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
‘‘పోలీసు సంస్మరణ దినం అనేది - భారతదేశం అంతటా విస్తరించి ఉన్న మన రక్షక భట సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు కృతజ్ఞతలు వ్యక్తం చేసే సందర్భం. కర్తవ్య నిర్వహణ లో అమరులైన మన పోలీసు సిబ్బందికి మనం నివాళులు సమర్పిద్దాం. వారి త్యాగాన్ని, వారి సేవను ఎల్లప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది.
శాంతి భద్రతల ను పరిరక్షించడం మొదలుకొని, భయానక నేరాలను పరిష్కరించడం వరకు, విపత్తు నిర్వహణ లో సాయపడటం మొదలుకొని కొవిడ్-19 తో పోరాడటం వరకు చూస్తే మన పోలీసు సిబ్బంది ఎటువంటి సంకోచానికి తావు ఇవ్వకుండా వారి అత్యుత్తమమైన సేవల ను సదా అందిస్తూ వస్తున్నారు. పౌరుల కు చేదోడుగా నిలవడంలో వారి సన్నద్ధత, వారి తత్పరతను చూసుకొని మనం గర్వపడుతూ ఉన్నాము’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 1666333)
Visitor Counter : 189
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam