కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఈపిఎఫ్ఓలో కొత్తగా 10.06 లక్షల సభ్యులు

Posted On: 20 OCT 2020 5:56PM by PIB Hyderabad

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి అయిదు నెలల్లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపిఎఫ్ఓ) సభ్యుల సంఖ్య 20 లక్షల వరకు పెరిగింది. 2020 అక్టోబర్ 20వ తేదీనాటికి అందుబాటుల ఉన్న గణాంకాలు ఈ అంశాన్ని వెల్లడిస్తున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి ఆ తరువాత విధించిన లాక్ డౌన్ ఈపిఎఫ్ఓపై ప్రభావాన్ని చూపాయి. దేశవ్యాపితంగా కోవిడ్ ప్రభావం వల్ల ఈపిఎఫ్ఓలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో చేరిన సభ్యుల చేరిక తగ్గింది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడడం ప్రారంభించడం తో ఈపిఎఫ్ఓ సభ్యుల సంఖ్య పెరుగుతున్నది. 2020 జూలై, ఆగస్టు నెలల గణాంకాలను పరిశీలిస్తే ఈ అంశం వెల్లడి అవుతున్నది. 2020 జూలైలో  ఈపిఎఫ్ఓలో కొత్తగా 7.49 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. 2019 జూలైతో పోల్చిచూస్తే ఇది 64శాతం ఎక్కువ. ఆగస్టులో పరిస్థితి మరింత మెరుగుపడింది.2019 ఆగస్ట్ నెలలో సభ్త్వం తీసుకున్న వారి సంఖ్యతో పోల్చి చూస్తే 2020 ఆగస్టులో ఈపిఎఫ్ఓలో సభ్యత్వం తీసుకున్న వారి సంఖ్యలో 93 శాతం వరకు పెరుగుదల కనిపించింది.

      నెలల వారీగా సభ్యత్వాల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. 2020 జూలైతో పోల్చే చూస్తే 2020 ఆగస్టులో సభ్యత్వాల నమోదు 34 శాతానికి మించి ఉంది.కొత్తగా సభ్యులు చేరడం ఇప్పటికే సభ్యత్వం ఉన్నవారు తమ ఖాతాలను కొనసాగించడంతో సభ్యుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. జూలైలో 6.48 లక్షల మంది ఈపిఎఫ్ఓలో చేరితే ఆగస్టులో 6.70 లక్షల మంది ఈపిఎఫ్ఓలో సభ్యులుగా చేరారు. ఈపిఎఫ్ఓలో ఖాతాలను ఉపసంహరించుకుంటున్న వారి సంఖ్య తగ్గుతున్నది. 2020 జూలైలో 5.08 లక్షల మంది ఖాతాలను ఉపసంహరించుకున్నారు. ఆగస్టులో ఉపసంహరణ గణనీయంగా తగ్గింది.2020 ఆగస్టులో కేవలం 2.46 లక్షల మంది మాత్రమే ఖాతాలను ఉపసంహరించుకున్నారు.

     వివిధ కారణాలతో ఖాతాలను ఉపసంహరించుకున్న దాదాపు 5.81 లక్షల మంది తమ ఖాతాలను ఆగస్టులో పునరుద్ధరించుకున్నారు. ఈపిఎఫ్ఓ పరిధిలోకి వచ్చే సంస్థలలో కొత్తగా ఉద్యోగాలు పొందినప్పటికీ వీరు తమ పూర్వ ఖాతాలను కొనసాగిస్తున్నారు. ఖాతాలను మూసివేయకుండా వాటినే కొత్త సంస్థలకు బదిలీ చేస్తుకోవద్దమ్మతో ఇది సాధ్యమవుతుంది. ఈ నెలలో సభ్యత్వం తీసుకుని తమ వాటాను చెల్లించిన వారి వివరాలతో రూపొందించిన గణాంకాలను ఈపిఎఫ్ఓ అందుబాటులో ఉంచింది.

        వయస్సువారిగా సభ్యుల వివరాలను పరిశీలిస్తే ఆగస్టులో 22-25 మధ్య వయస్సు ఉన్నవారు ఈపిఎఫ్ఓలో చేరారు.ఆ తరువాత 18-25 మధ్య వయస్కులు ఉన్నారు. 18-25 మధ్య వయస్సు ఉన్నవారిని తొలిసారిగా ఉపాధి పొందిన వారీగా పరిగణించవచ్చును.వీరు ఈపిఎఫ్ఓపై విశ్వాసాన్ని ఉంచుతూ సభ్యత్వం పొందారు.

        2020 జూన్,జూలై,ఆగస్టునెలల గణాంకాలను రాష్ట్రాలవారీగా సభ్యుల సంఖ్యను పరిశీలిస్తే మహారాష్ట్ర, తమిళనాడు,గుజరాత్, కర్ణాటక,హర్యానా రాష్ట్రాలు నూతన సభ్యుల నమోదులో ముందున్నాయి.

      పరిశ్రమలవారీగా చూస్తే " ప్రత్యేక తరగతి" ( మానవ వనరుల కల్పనా సంస్థలు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు, చిన్న కాంట్రాక్టర్లు) జాభితా కిందకి వచ్చేవారు 2020 జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువ సంఖ్యలో ఈపిఎఫ్ఓ పొందారు. వీరి సంఖ్య 21.40 లక్షల వరకు ఉంది. ఈ మూడు నెలల్లో సభ్యత్వం పొందిన పది తరగతుల ఉద్యోగులలో వీరి శతం 63 వరకు ఉంది.

       సంఘటిత రంగానికి చెందిన ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే విషయంలో దేశంలో ఈపిఎఫ్ఓ అగ్ర స్థానంలో ఉంది. ప్రావిడెంట్ ఫండ్, భీమా,పెన్షన్ లండ్టి సౌకర్యాలను కలగచేస్తున్న ఈపిఎఫ్ఓ లక్షలాది మంది ఉద్యోగులగు అండగా నిలుస్తున్నది.ఈపిఎఫ్ఓ సభ్యుల వివరాలను ప్రతి నెలా నమోధు చేయడం నిరంతర ప్రక్రియగా సాగుతున్నది.

***


(Release ID: 1666247) Visitor Counter : 186