మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

గ్రామీణ భారతదేశంలో జీవితాలను, ఐ.ఐ.టి. ఖర్గ‌పూర్ సాంకేతిక ఆవిష్కరణలు ప్రభావితం చేస్తాయని వ్యాఖ్యానించిన - కేంద్ర విద్యాశాఖ మంత్రి

ఐ.ఐ.టి. ఖర్గ‌పూర్ ఆవిష్కరణ కోవిడ్ పరీక్షను సరసమైనదిగా చేసింది, దీనిని ప్రభుత్వ జోక్యం ద్వారా మరింత తగ్గించవచ్చు: డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్

మధ్య తరగతి ప్రజలకు సహాయపడటానికి వీలుగా వాణిజ్య పరంగా ఆవిష్కరణలు పెంపొందించాలన్న - ఎన్.ఐ.సి.ఈ.డి. డైరెక్టర్

Posted On: 21 OCT 2020 4:26PM by PIB Hyderabad

కోవిడ్ -19 ని సమర్ధంగా గుర్తించడానికి, ఐ.ఐ.టి. ఖర్గపూర్ పరిశోధకులు అభివృద్ధి చేసిన డయాగ్నొస్టిక్ మెషీన్ ‘కోవిరాప్’ ను భారత వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్) విజయవంతంగా ధృవీకరించింది.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలకు ఈ ఆవిష్కరణను వేగంగా చేరుకోవడానికి వివిధ వాణిజ్య విభాగాలు టెక్నాలజీ లైసెన్సు కోసం ఇప్పటికే సంప్రదించాయి.   అధీకృత ఐ.సి.ఎం.ఆర్. ప్రయోగశాల ద్వారా రోగి నమూనాలను, సంస్థ కఠినమైన మార్గదర్శకాలకు కట్టుబడి, క్షుణ్ణంగా పరీక్షించిన తరువాత, ఐ.సి.ఎం.ఆర్. ఇప్పుడు ఈ కోవిడ్-19 డయాగ్నొస్టిక్ టెస్ట్ ధృవీకరణకు ఆమోదం తెలిపింది.  ఈ పరీక్షను నిర్వహించడం చాలా సులభం, ఇది చాలా సరసమైనది. ఇది ఒక గంటలో అనుకూల-అభివృద్ధి చెందిన మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ఫలితాలను ఇస్తుందికోవిడ్-19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో సాధించిన ఈ గొప్ప విజయాన్ని ప్రకటించడానికి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మాటాడుతూ,  “ఐఐటి ఖర్గ‌పూర్ పరిశోధకులు ఈ వైద్య సాంకేతిక ఆవిష్కరణ ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించినందుకు నేను సంతోషిస్తున్నాను.  పరికరం చాలా చిన్నదిగా మరియు చాలా తక్కువ విద్యుత్ సరఫరాతో పనిచేయగలగటం వలన ఇది గ్రామీణ భారతదేశంలో చాలా మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది.  తక్కువ శిక్షణ పొందిన గ్రామీణ యువత ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చు.” అని వివరించారు.  "అధిక-నాణ్యత మరియు ఖచ్చితమైన ఈ కోవిడ్ పరీక్ష సాధారణ ప్రజలకు 500 రూపాయల అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ జోక్యం ద్వారా ఇది మరింత తగ్గించవచ్చు." అని మంత్రి తెలియజేశారు.  ఐ.ఐ.టి. ఖర్గ‌పూర్ సమాచారం ప్రకారం, ఈ యంత్రాన్ని 10,000 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయవచ్చుకనీస మౌలిక సదుపాయాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.  ఈ కొత్త యంత్రంలో పరీక్షా ప్రక్రియ ఒక గంటలో పూర్తవుతుంది.”, అని ఆయన తెలియజేశారు. ఐ.ఐ.టి. ఖర్గగ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కె. తివారీ మరియు ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి మరియు డాక్టర్ అరిందం మండల్ నేతృత్వంలోని పరిశోధనా బృందాన్ని డాక్టర్ పోఖ్రియాల్ అభినందించారు. ఈ బృహత్తర ఆవిష్కరణ కోసం ఉన్నత స్థాయి ప్రయోగశాలల నుండి క్షేత్రానికి పరమాణు విశ్లేషణలను తీసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు

 

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చొరవ ప్రకారం, ఆశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ దృష్టిని అనుసరించి, కోవిడ్ -19 సంబంధిత పరిశోధన మరియు ఉత్పత్తి అభివృద్ధికి తోడ్పడటానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ తివారీ నిర్ణయించినందున ఈ ప్రాజెక్టుకు 2020 ఏప్రిల్ చివరిలో సంస్థ నుండి ఆర్థిక సహాయం లభించింది.  

ఈ పరీక్ష గురించి ఐ.ఐ.టి. ఖర్గ‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కె. తివారీ మాట్లాడుతూ, “ఇది నిజంగా వైద్య విజ్ఞాన చరిత్రలో, ముఖ్యంగా వైరాలజీ విభాగంలో గొప్ప కృషి, మరియు పి.సి.ఆర్. ఆధారిత పరీక్షలను భర్తీ చేయడానికి బాగా సిద్ధంగా ఉంది." అని చెప్పారు

క్లినికల్ టెస్టింగ్ దశలో వివిధ ఖర్చులను భరించడానికి, ఈ ప్రాజెక్టుకు అవసరమైన, తదుపరి ఆర్థిక సహాయం అమెరికాలోని ఐ.ఐ.టి. ఫౌండేషన్ అందించింది.  ఐ.ఐ.టి. ఖర్గ‌పూర్‌లో ఉన్న భారత ప్రభుత్వ శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సి.ఎస్.‌ఐ.ఆర్) చేత స్థాపించబడిన సరసమైన ఆరోగ్య సంరక్షణపై సాధారణ పరిశోధన మరియు అండ్ సాంకేతిక అభివృద్ధి కేంద్రం నుండి కూడా పాక్షిక ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

ఐ.సి.ఎం.ఆర్-ఎన్.ఐ.సి.ఈ.డి. డైరెక్టర్ డాక్టర్ శాంతా దత్తా, తోటి పరిశోధకుల కృషిని అభినందిస్తూ,  "పరీక్ష మరియు ధ్రువీకరణను పర్యవేక్షిస్తున్నప్పుడు, పోర్టబుల్ తక్కువ-ధర యంత్ర యూనిట్ ‌తో నేను చాలా ఆకట్టుకున్నాను, ఇది ఆపరేటర్లుగా నైపుణ్యం లేని మానవ వనరుల సహకారంతో పరిధీయ ప్రయోగశాలలలో కోవిడ్-19 నిర్ధారణలో ఇది నిజంగా ఒక వినూత్నమైన పరిశోధన.  నిరుపేద జనాభా అవసరాలను తీర్చడానికి దీనిని ఇప్పుడు వేగంగా వాణిజ్య స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది.  మరింత మెరుగైన పనితీరును సాధించే దిశగా మరింత మెరుగుదలను అందించడానికి, ఐ.సి.ఎం.ఆర్-ఎన్.ఐ.సి.ఈ.డి. సిద్ధంగా ఉంది. ” అని పేర్కొన్నారు. 

ఐ.సి.ఎం.ఆర్-కలరా మరియు పేగు సంబంధ వ్యాధుల జాతీయ సంస్థ (ఎన్.‌ఐ.సి.ఈ.డి) తరపున రోగి పరీక్షలను పర్యవేక్షించిన అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన వైరాలజిస్ట్ డాక్టర్ మమతా చావ్లా సర్కార్, ‘కోవిరాప్’ వ్యాధి నిర్ధారణ పరీక్ష యొక్క ధ్రువీకరణ ప్రక్రియ గురించి వివరిస్తూ,  "పరీక్ష ఫలితాల యొక్క వివరణాత్మక పరిశీలనలో ఈ పరీక్ష చాలా తక్కువ స్థాయి వైరల్ భారాన్ని గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు స్పష్టమైంది, అయితే, ఇదే విధమైన పరీక్షా సూత్రాల ఆధారంగా, ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పరిశోధనా సమూహాలు ఇప్పటి వరకు ఈ పద్ధతులతో ముందుకు రాలేదు. ఆచరణలో, దీని అర్థం సంక్రమణ యొక్క ప్రారంభ దశలను గుర్తించడం, తద్వారా రోగిని వేరుచేయడం మరియు లక్షణాలు కనబడని రోగుల ద్వారా సమాజంలో సంక్రమణ యొక్క అనియంత్రిత వ్యాప్తిని అరికట్టడం.” అని తెలియజేశారు.

ఐ.ఐ.టి. ఖర్గ‌పూర్ పరిశోధనా బృందం అభివృద్ధి చేసిన అల్ట్రా-తక్కువ-ధర పోర్టబుల్ పరికరంతో నిర్వహించగల అత్యంత నమ్మకమైన మరియు ఖచ్చితమైన పరమాణు విశ్లేషణ విధానాన్ని ఈ కొత్త పరీక్షా పద్దతి అమలు చేస్తుంది.  వేరే వ్యక్తిగత ప్రత్యేక వివరణ అవసరం లేకుండా వ్యాప్తి కోసం అనుకూలీకరించిన మొబైల్ అప్లికేషన్ ద్వారా పరీక్షా ఫలితాలు అందజేయబడతాయి.

ఐ.ఐ.టి. ఖర్గ‌పూర్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు, ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి, మరియు ఐ.ఐ.టి. ఖర్గ‌పూర్ కు చెందిన స్కూల్ ఆఫ్ బయో సైన్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ అరిందం మండల్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం, ఈ వినూత్న వ్యాధి నిర్ధారణ వేదికను అభివృద్ధి చేసింది.  ఈ వ్యాధి నిర్ధారణ పరికరం ఐ.సి.ఎం.ఆర్. చేత గుర్తింపు పొందిన, ఐ.సి.ఎం.ఆర్-ఎన్.ఐ.సి.ఈ.డి. వద్ద, ఐ.సి.ఎం.ఆర్. మార్గదర్శకాల ప్రకారం కఠినమైన పరీక్ష నిబంధనలకు లోబడి ఉంది.  అక్కడ నిర్వహించిన పరీక్షలలో ఈ కొత్త పరీక్ష యొక్క ఫలితాలు ప్రసిద్ధ ఆర్.టి-పి.సి.ఆర్. పరీక్షలతో పోల్చదగిన, అధిక స్థాయి విశిష్టత మరియు సున్నితత్వంతో, ఏదైనా సాధారణ పరీక్ష యొక్క సమర్థత యొక్క సూచికలుగా ఉపయోగించే రెండు సాధారణ ప్రమాణాలకు సమానంగా ఉన్నట్లు వెల్లడయ్యింది. 

ఐ.సి.ఎం.ఆర్-ఎన్.ఐ.సి.ఈ.డి. పరీక్షను వినియోగదారులకు అత్యంత అనువుగా ఉన్నట్లు ధృవీకరించడం జరిగింది.  ప్రత్యేకించి, ఒకే మెషిన్ యూనిట్‌లో ఒక గంట బ్యాచ్ ‌కు పరీక్షల సంఖ్యను ఎక్కువ పరిమితుల కోసం, భారీ సంఖ్యలో పరీక్షించే ప్రయోజనం కోసం మరింత పెంచవచ్చు.  

ఐ.ఐ.టి. ఖర్గ‌పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు, ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి, ఈ పరీక్ష గురించి వివరిస్తూ,  "పేటెంట్ గుర్తింపు పొందిన ఈ యంత్రం రోగి నమూనా పరీక్ష సమయంలో బలంగా ఉందని నిరూపించడమే కాక, చాలా సరళమైనది మరియు సాధారణమైనది అని కూడా నిరూపించబడింది. అంటే కోవిడ్-19 పరీక్షతో పాటు, 'ఐసోథర్మల్ న్యూక్లియిక్ యాసిడ్-ఆధారిత పరీక్ష’ (టి.హెచ్.ఏ.టి) వర్గంలోకి వచ్చే, అనేక ఇతర పరీక్షలను కూడా, ఇదే యంత్రంలో చేయవచ్చు.  మరో మాటలో చెప్పాలంటే, ఇన్ ఫ్లూ యంజా, మలేరియా, డెంగ్యూ, జపనీస్ ఎన్సెఫాలిటిస్, క్షయ మరియు అనేక ఇతర అంటువ్యాధులు, అలాగే వెక్టర్ ద్వారా కలిగే వ్యాధులను ఇదే యంత్రాన్ని ఉపయోగించి పరీక్షించవచ్చు.  ఇది పరమాణు విశ్లేషణ పరీక్ష యొక్క ఊహించిన ఉన్నత ప్రమాణాలను త్యాగం చేయకుండా, థర్మల్ సైక్లర్లు లేదా రియల్ టైమ్ పి.సి.ఆర్. యంత్రాల అవసరాన్ని వాస్తవంగా తగ్గిస్తుంది.” అని వివరించారు.  "ఈ రోజు, ఇది కోవిడ్-19; నిన్న, ఇది కుష్టు మరియు క్షయ; రేపు, అది మరి ఇంకేదైనా అవచ్చు.  ప్రయోగశాల నుండి క్షేత్ర స్థాయికి ఈ అత్యాధునిక మాలిక్యులర్ డయాగ్నస్టిక్ ‌లను తీసుకురావడం ద్వారా వీటన్నింటినీ వేగంగా మరియు అతి తక్కువ ఖర్చుతో గుర్తించడంలో ఒక విప్లవాన్ని సృష్టించడానికి ఈ టెక్నాలజీ సిద్ధంగా ఉంది. అందువల్ల దీని ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుంది, రాబోయే సంవత్సరాల్లో, మానవ జీవితాలను మళ్లీ మళ్లీ ప్రమాదానికి గురి చేసే, ఊహించని మహమ్మారిని గుర్తించే సామర్ధ్యం దీనికి ఉంది.” అని ఆయన పేర్కొన్నారు.   

ఐ.ఐ.టి. ఖర్గ‌పూర్ స్కూల్ ఆఫ్ బయో సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరిందం మండల్ మాట్లాడుతూ,  "రోగి నమూనాల పరీక్ష దశలో, ఐ.ఐ.టి. ఖర్గ‌పూర్‌లో ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన అన్ని వస్తు సామగ్రిని అనియంత్రిత వాతావరణంలో అనేక గంటల పాటు పరీక్షా విభాగానికి రవాణా చేయడం జరిగింది,  ఇది పరీక్ష కోసం ఉపయోగిస్తున్న కారకాల యొక్క అధిక స్థాయి స్థిరత్వాన్ని చూపుతుంది.” అని పేర్కొన్నారు. 

‘కోవిరాప్’ వాణిజ్యీకరణకు సంబంధించి ప్రొఫెసర్ తివారీ మాట్లాడుతూ,  "ఈ సంస్థ టెస్టింగ్ కిట్ ‌ను ఒక నిర్దిష్ట స్థాయి వరకు ఉత్పత్తి చేయగలదు, పేటెంట్ లైసెన్సు విధానం వైద్య సాంకేతిక సంస్థలకు వాణిజ్యీకరణ అవకాశాలను సులభతరం చేస్తుంది. ఏదైనా కార్పొరేట్ సంస్థ లేదా అంకురసంస్థ, సాంకేతిక లైసెన్సు మరియు వాణిజ్య స్థాయి ఉత్పత్తి కోసం ఈ సంస్థను సంప్రదించవచ్చు.  మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ప్రజారోగ్యం యొక్క ఆసక్తిని పరిరక్షించే తగిన చర్యలతో సంస్థ భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తోంది. ” అని తెలియజేశారు.

*****


(Release ID: 1666647) Visitor Counter : 200