శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

6 వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2020 డిసెంబర్ 22 నుండి 25 వరకు వర్చువల్ ఫార్మాట్‌లో జరగనుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ మరియు ప్రపంచ సంక్షేమానికి భారత శాస్త్ర,సాంకేతిక రంగం అందించిన ఆవిష్కరణలను ప్రతిబింబిస్తుంది: డాక్టర్ హర్ష్ వర్ధన్
అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాల సహకారంతో ఐఐఎస్ఎఫ్-2020ను సీఎస్‌ఐఆర్ నిర్వహిస్తుంది.

Posted On: 20 OCT 2020 6:53PM by PIB Hyderabad

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) 2020 యొక్క 6 వ ఎడిషన్ 2020 డిసెంబర్ 22 నుండి 25 వరకు జరుగుతుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మరియు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ విషయాన్ని న్యూఢిల్లీలో జరిగిన సమీక్ష సమావేశంలో నేడు ప్రకటించారు.


సమీక్షా సమావేశంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ “ వర్చువల్ ప్లాట్‌ఫామ్‌ విధానంలో ఐఐఎస్ఎఫ్ 2020 గతంలో జరిగిన వాటికంటే అద్భుతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇది సరికొత్త ప్రాతిపదిక అని చెప్పారు. డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం సిఎస్ఐఆర్ ఐఐఎస్ఎఫ్ 2020  ఇతర అన్ని సంబంధిత మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల సహకారంతో నిర్విహిస్తామని తెలియజేశారు.

ప్రయోగశాలల వెలుపలకు సైన్స్‌ను తీసుకురావడం ద్వారా యువత మరియు విద్యార్థులలో సైన్స్ పట్ల ప్రేమ మరియు అభిరుచిని ప్రోత్సహించడంతో పాటు, ఆత్మనిర్భర్ భారతే కాక ప్రపంచ సంక్షేమంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారి ఆవిష్కరణలను ప్రతిబింబించాలని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలోనూ, ప్రజల సంక్షేమానికి కృషి చేయడంలో భారతీయ శాస్త్రవేత్తల పాత్రను ప్రపంచాన్ని పరిచయం చేసే సందర్భం ఇదేనని తెలిపారు. కోవిడ్ -19 ను ఎదుర్కోవడంలో భారతదేశం పోషించిన పాత్రను ప్రముుఖంగా చూపడానికి అవసరమైన మార్గాలను గుర్తించాలని సమీక్షలో పాల్గొన్న వారిని మంత్రి  కోరారు.


మొదటి మరియు రెండవ ఐఐఎస్ఎఫ్ న్యూ ఢిల్లీలో, మూడవది చెన్నైలో, నాల్గొవది లక్నోలో, ఐదవ ఐఐఎస్ఎఫ్ కోల్‌కతాలో జరిగింది. ఈ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లకు భారతదేశంతో పాటు ఇతర దేశాలనుండి ప్రజలు పెద్దసంఖ్యలో తరలి వచ్చా.

ప్రతి ఏటా జరిగే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖతో పాటు దానికి సంబంధించిన విభాగాలు, విజ్ఞాన భారతిలు సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమం
భారతదేశంతో పాటు ఇతర దేశాల విద్యార్ధుల ఆవిష్కరణలతో పాటు ఇందులో హస్తకళాకారులు, రైతులు, శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణుల భాగస్వామ్యం ఉంటుంది. భారతదేశం సాధించిన శాస్త్రీయ మరియు సాంకేతిక పురోగతిని ప్రదర్శించే వేదిక.

ఐఐఎస్ఎఫ్-2020 మనదేశంతో పాటు విదేశాలకు చెందిన యువకులు, శాస్త్రవేత్తలు మరియు సంస్థల భాగస్వామ్యాన్ని ఆశిస్తోంది. ఐఐఎస్ఎఫ్ 2020 ప్రారంభానికి ముందు, కార్యక్రమంలో పలు ఆంశాలపై సదస్సులు ఉండే అవకాశం ఉంది.

ఈ సమావేశంలో డీఎస్‌టీ కార్యదర్శి డాక్టర్ అశుతోష్ శర్మ, డిజి, సిఎస్‌ఐఆర్ డాక్టర్ శేఖర్ సి.మండే, డీబీటీ కార్యదర్శి రేణు స్వరూప్, ఐసిఎంఆర్ డీజీ డాక్టర్ బల్‌రామ్ భార్గవ్, శ్రీ జయంత్ సహస్త్రబుద్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

***(Release ID: 1666283) Visitor Counter : 21