మంత్రిమండలి

2019-2020 సంవ‌త్సరానికి ఉత్పాద‌కత ‌తో ముడిపెట్టిన బోన‌స్ కు, ఉత్పాద‌క‌త‌ తో సంబంధం లేని బోన‌స్ కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 21 OCT 2020 3:24PM by PIB Hyderabad

2019-2020 సంవ‌త్సరానికి గాను ఉత్పాద‌క‌త‌ తో ముడిపెట్టిన బోన‌స్ (పిఎల్‌బి) ని చెల్లించ‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ సమావేశం ఆమోదం తెలిపింది.  దీనితో రైల్వేలు, త‌పాలా, ర‌క్ష‌ణ‌, ఇపిఎఫ్ఒ, ఇఎస్ఐసి మొదలైన వాణిజ్య సంస్థ‌ల‌కు చెందిన 16.97 ల‌క్ష‌ల మంది నాన్- గెజిటెడ్ ఉద్యోగులకు ల‌బ్ధి అందనుంది.  దీని వ‌ల్ల 2,791 కోట్ల రూపాయ‌ల మేర‌కు ఆర్థిక భారం పడుతుంది.

నాన్-పిఎల్‌బి లేదా ఎడ్‌-హాక్ బోన‌స్ ను నాన్- గెజిటెడ్ కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇవ్వడం జరుగుతుంది.  దీనితో 13.70 ల‌క్ష‌ల మంది ఉద్యోగులకు ప్ర‌యోజ‌నం అందుతుంది.  దీని  ఆర్థిక భారం 946 కోట్ల రూపాయ‌ల మేర‌కు ఉంటుంది.  

బోన‌స్‌ ప్ర‌క‌ట‌న‌ తో మొత్తం 30.67 ల‌క్ష‌ల మంది ఉద్యోగులకు ల‌బ్ధి చేకూరుతుంది.  దీని మొత్తం ఆర్థిక భారం 3,737 కోట్ల రూపాయ‌లుగా ఉంటుంది.

గడచిన సంవ‌త్స‌రం నాన్-గెజిటెడ్ ఉద్యోగుల కు వారి ప‌నితీరుకు గాను బోన‌స్ ను సాధార‌ణంగా ద‌స‌రా/దుర్గా పూజ కంటే ముందే చెల్లించడం జరిగేది.  ప్ర‌భుత్వం త‌న నాన్- గెజిటెడ్ ఉద్యోగుల‌ కోసం ఉత్పాద‌క‌త‌ తో ముడిపెట్టిన బోన‌స్ (పిఎల్‌బి)ని మరియు ఎడ్ హాక్ బోన‌స్ ను వెనువెంట‌నే చెల్లించే విధంగా ప్రకటన చేస్తోంది.


***


(Release ID: 1666511) Visitor Counter : 243