ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో వేగంగా తగ్గుతున్న చికిత్సలో ఉన్నవారి సంఖ్య

వరుసగా రెండో రోజు కూడా చికిత్స పొందుతున్నవారు 7.5 లక్షలలోపు

14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1% కంటే తక్కువ మరణాలు

Posted On: 21 OCT 2020 11:28AM by PIB Hyderabad

భారత దేశంలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వరుసగా రెండో రోజు కూడా చికిత్సలో ఉన్నవారి సంఖ్య 7.5 లక్షలలోపు కొనసాగుతోంది.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017EJB.jpg

ప్రతిరోజూ కోలుకుంటున్న కోవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కోలుకుంటున్నవారి శాతం కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటలలో 61,775 మంది కోలుకున్నట్టు నమోదైంది. కొత్తగా కోవిడ్ పాజిటివ్ గా నమోదైనవారి సంఖ్య 54,044 మంది. ఇది గడిచిన 24 గంటలలో 10,83,608 పరీక్షలు జరిపినప్పుడు నిర్థారణ అయిన సంఖ్య.

పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే కేంద్ర ప్రభుత్వ వ్యూహన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విజయవంతంగా పాటిస్తూ ఉండగా మరణాల శాతం కూడా తగ్గుతూ వస్తోంది. జాతీయ స్థాయిలో ప్రస్తుతం మరణాల శాతం 1.51 శాతానికి తగ్గింది. మరణాల శాతాన్నిఒ 1% కంటే తక్కువ ఉండేలా చూడాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ పిలుపునిచ్చింది. ప్రస్తుతం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1% కంటే తక్కువ మరణాలు చూపుతున్నాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002JYKA.jpg

భారత్ లో ఈరోజు వరకు మొత్తం కోలుకున్న పాజిటివ్ కేసుల సంఖ్య 67,95, 103 మంది. ఇలా ప్రతిరోజూ తగ్గుతూ వస్తుండగా జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అది దాదాపు 89% ( 88.81%) గా ఉంది. కొత్తగా కోలుకున్న కేసులలో 77% మంది 10 రాష్ట్రాలకే చెందినవారు కాగా మహరాష్ట్రను కర్నాటక మించిపోయింది. కర్నాటకలో కొత్తగా 8,500 మంది కోలుకోగా, మహారాష్ట, కేరళ రాష్ట్రాలలో  ఏడేసి వేల కేసులు నమోదయ్యాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003VGJL.jpg

గడిచిన 24 గంటలలో దేశంలో 54,044 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 78% కేసులు పది రాష్ట్రాలలోనే నమోదయ్యాయి.మహారాష్ట్రలో అత్యధికంగా 8,000 కేసులు రాగా  మహారాష్ట్రలో 8,000 కు పైగా కొత్త కేసులు వచ్చాయి. కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో ఆరేసి వేలకు పైగా కేసులు వచ్చాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004VZF3.jpg

గడిచిన 24 గంటల్లో 717 మంది చనిపోయారు. తాజా మరణాలలో 82% కేవలం 10 రాష్ట్రాలలోనే నమోదయ్యాయి. నిన్నటి మరణాలలో 29% (213) మహారాష్ట్రలోనే జరిగాయి.  ఆ తరువాత 66 మరణాలతో కేరళ రెండో స్థానంలో ఉంది.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005OI9I.jpg

****



(Release ID: 1666502) Visitor Counter : 178