PIB Headquarters

కోవిడ్-19 మీద పిఐబి రోజువారీ బులిటెన్

Posted On: 19 OCT 2020 6:23PM by PIB Hyderabad

 (ఇందులో గత 24 గంటలలో కోవిడ్-19 కు సంబంధించిన పత్రికా ప్రకటనలు, పిఐబి క్షేత్ర సిబ్బంది అందించిన సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఉంటుంది.)

  • భారత్ లో తగ్గుతున్న కోవిడ్ చికిత్సలో ఉన్నవారి సంఖ్య; వరుసగా మూడో రోజు కూడా 8 లక్షల లోపే   
  • జాతీయ స్థాయిలో వరుసగా నాలుగో రోజు కూడా  పాజిటివ్ కేసుల శాతం 8% లోపు
  • గడిచిన 24 గంటల్లో కొత్తగా కోలుకున్నవారి సంఖ్య 66399, కొత్త పాజిటివ్ కేసులు 55,722
  • కోవిడ్ 19  పరిస్థితి, వాక్సిన్ పంపిణీ, నిర్వహణ మీద ప్రధాని అధ్యక్షతన సమావేశం
  • ప్రధాని ఇచ్చిన జన్ ఆందోళన్ పిలుపుకు అనుగుణంగా కోవిడ్ కు తగినట్టు వ్యవహరించాలని ఆరోగ్య శాఖామంత్రి విజ్ఞప్తి 
  • సి పి ఎస్ ఇ ల మెరుగైన పనితీరుతో ఆర్థిక వ్యవస్థ కోవిడ్ ప్రభావం నుంచి కోలుకోవటానికి

#Unite2FightCorona

#IndiaFightsCorona

Image

కోవిడ్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుదల;  మూడో రోజు కూడా చికిత్స పొందుతున్నవారు 8 లక్షల లోపే ;  వరుసగా 4వ రోజు జాతీయ స్థాయి పాజిటివ్ కేసులు 8% లోపు

కోవిడ్ మీద పోరులో భారత్ మర్ మైలు రాయి దాటింది. జాతీయ స్థాయిలో మొత్తమ్ కోవిడ్ పాజిటివ్ కేసులు 8% కంటే దిగువకు పడిపోయాయి. నాలుగురోజులుగా ఇదే ధోరణి కొనసాగుతోంది. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల శాతం 7.94 కు చేరి ఇంకా తగ్గుదల బాటలో ఉంది. ఈరోజు వరకు జరిపిన మొత్తం పరీక్షలు 9.5 కోట్లు దాటాయి. అక్టోబర్ లో వరుసగా మూడో వారం కూడా పాజిటివ్ కేసులు 6.13% గా నమోదయ్యాయి. పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే  కేంద్ర ప్రభుత్వపు త్రిముఖ వ్యూహం అమలు చేయటం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేయటం వలన ఇది సాధ్యమైంది.  కోవిడ్ చికిత్స పొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. నెలన్నరగా తగ్గుదలబాటలో ఉన్న కేసులు వరుసగా మూడో రోజు 8 లక్షలకంటే తక్కువ స్థాయికి వచ్చాయి. ఇప్పుడు ఇదే తగ్గుదల ధోరణి సాగుతోంది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కరోనా బాధితులు ఈరోజుకు 7,72,055 మంది ఉన్నారు. వీరు మొత్తం ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో దాదాపు 10.23% .  ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారు 66 లక్షలకు పైగా (66,63,608)  ఉన్నారు. దీనివలన చికిత్స పొందుతున్నవారికంటే కోలుకున్నవారు అధికంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది.  గడిచిన 24 గంటల్లో 66,399 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఉండగా కొత్త పాజిటివ్ గా నమోదైనవారి సంఖ్య  55,722. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 88.26%. కొత్తగా కోలుకున్నవారిలో 79% మంది పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే. ఆ రాష్ట్రాలలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, చత్తీస్ గఢ్ ఉన్నాయి. వీటిలో మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులోనే 11,00 మందికి పైగా కోలుకోగా, కేరళ , కర్నాటక రాష్ట్రాలు ఎనిమిదేసి వేలకు పైగా కోలుకున్న కేసులతో రెండో స్థానంలో ఉన్నాయి. కొత్తగా పాజిటివ్ గా నమోదైన కేసులు 55,722 ఉన్నాయి. వీటిలో 81% కూదా అవే 10 రాష్ట్రాలలో నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్ర అత్యధికంగా 9,000 కు పైగా కొత్తకే నమోదు చేసుకుంది., కేరళ, కర్నాటక ఏడేసి వేలకంటే ఎక్కువ కేసులతో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. గడిచిన 24 గంటలలో 579 మరణాలు నమోదయ్యాయి. 90 రోజుల తరువాత మరణాలు 600 లోపు నమోదు కావటం గమనార్హం, మరణాలలో దాదాపు 83% 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోనే నమోదయ్యాయి. మరణాలలో దాదాపు 25% పైగా ( 150) మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665789

కోవిడ్ పరిస్థితి, వాక్సిన్ అందుబాటు, పంపిణీ, నిర్వహణ మీద ప్రధాని అధ్యక్షతన సమావేశం

దేశంలో కోవిడ్ పరిస్థితి మీద, వాక్సిన్ అందుబాటు, పంపిణీకి సన్నద్ధత మీద ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శనివారం నాడు సమీక్ష జరిపారు. కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శి, నీతి ఆయోగ్ సభ్యుడు ( ఆరోగ్యం), ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, సీనియర్ శాస్త్ర వేత్తలు, పిఎంవో అధికారులు. ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.   రోజువారీ కొత్త కోవిడ్ కేసులు తగ్గటాన్ని ప్రధాని ప్రస్తావించారు. భారత్ లో మూడు వాక్సిన్ల తయారీ తుది దశకు చేరిందని, అందులో రెండు వాక్సిన్లు 2, 3 దశల్లో ఉన్నాయని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్, భూతాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మారిషస్, నేపాల్, శ్రీలంక తదితర పొరుగు దేశాలతో కలిసి భారత శాస్త్రవేత్తలు పరిశోధనలను బలోపేతం చేస్తున్నారన్నారు.యావత్ ప్రపంచానికి వాక్సిన్ లో సాయం చేసే క్రమంలో పొరుగుదేశాలకే పరిమితం కావద్దని సూచించారు.వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత పంపిణీ, రవాణా, నిర్వహణ వంటి విషయాలలో సన్నద్ధత అవసరమన్నారు. ఎన్నిక నిర్వహణ లో అనుసరించే విధానాలను, విపత్తుల నిర్వహణ తీరుతెన్నులను  వాక్సిన్ పంపిణీకి కూడా వాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల జిల్లా యంత్రాంగాలను, స్వచ్ఛంద సంస్థలను, పౌర సమాజ సంస్థలను, వాలంటీర్లను, ఆయా రంగాల నిపుణులను  సమర్థంగా వాడుకోవాలన్నారు.

మరిన్ని వివరాలకు :  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665565

సండే సంవాద్ లో భాగంగా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ హర్ష వర్ధన్ 

సండే సంవాద్ ఆరవ ఎపిసోడ్ లో భాగంగా సోషల్ మీడియాలో సంభాష్ఇస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అనేక మంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.నవరాత్రి సందర్భంగా అందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో ప్రధాని ఇచ్చిన ప్రజా ఉద్యమం పిలుపుకు అండగా నిలబడి కోవిడ్ కి తగిన విధంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ ఇళ్లలోనే సంప్రదాయబద్ధంగా కుటుంబంతో కలిసి పడుగలు జరుపుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనకోసం పోరాడుతున్న కోవిడ్ యోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ తాను కూడా పండుగ వేడుకలు నిరాడంబరంగా జరుపుకుంటానని ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ వెల్లడించారు.   ఇటీవల కేరళలో మళ్లీ కోవిడ్ కేసులు పెరగటం మీద కూడా డాక్టర్ హర్ష వర్ధన్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. జనవరి 30 నుంచి మే 3 వరకు కేరళలో కేవలం 499 లేసులు నమోదు కాగా కోవిడ్ మరణాలు 2 మాత్రమేనన్నారు. అయితే,. ఓనం పడుగ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కేరళ ఇప్పుడు తగిన మూల్యం చెల్లించు కుంటున్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రమంతటా అన్ లాక్ అమలు చేయటం, రాష్టంలోపలా, బయటా ప్రయాణాలకు అనుమతించటం వలన అన్ని జిల్లాలలోనూ కరోనా వ్యాపించిందన్నారు. రెండో దశ కోవిడ్ పాకేజ్ ని 33 రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిందన్నారు. మొత్తం ఈ పాకేజ్ కింద రూ. 1352 కోట్ల మేరకు నిధులను ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పంపిణీ చేసినట్టు చెప్పారు.

మరిన్ని వివరాలకు :   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665666

డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షతన కోవిడ్ విషయంలో అనుసరించాల్సిన తీరుమీద సమావేశం

కేంద్ర శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి శుక్రవారం నాడు శాస్త్ర సాంకేతిక శాఖ పరిధిలోని స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థల అధిపతులు, డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కోవిడ్ సంబంధ ప్రవర్తనకు సంబంధించిన జన్ ఆందోళన్  కార్యక్రమాల మీద సమీక్షించారు.కరోనా మీద పోరులో భారత్ ఉమ్మడిగా జరుపుతున్న పోరుకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ, కీలకమైన పదో నెలలోకి ప్రవేశిస్తున్నామని గుర్తు చేశారు. ఈ క్రమంలో చెప్పుకోదగినంత వైదయ్ సదుపాయాలు రూపొందించుకున్నామన్నారు.. శాస్త్రవేత్తలు తమ బాధ్యతలకు మించి చేసిన కృషిని ఆయన అభినందించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 9 రకాల వాక్సిన్లు దాదాపు చివరిదశలో ఉండటాన్ని ప్రస్తావించారు. భారత్ త్వరలోనే స్వదేశీ వాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ ఇంకా ఒక కొలిక్కి రాలేదని చెబుతూ, ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోవిడ్ మీద పోరులో వచ్చే రెండున్నర నెలలు చాలాకీలకమన్నారు.  పండుగ సీజన్ లో జాగ్రత్తలు తీసుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత అని మంత్రి గుర్తు చేశారు.

మరిన్ని వివరాలకు :   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665323

సిపిఎస్ ఇ ల కాపెక్స్ మీద 4వ సమీక్షా సమావేశం నిర్వహించిన శ్రీమతి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెట్రోలియం, సహజవాయువు. బొగ్గు మంత్రిత్వశాఖల కార్యదర్శులతో. ఈ మంత్రిత్వశాఖలకు చెందిన 14 సిపిఎస్ ఇ ల సిఎండి లతో  సమావేశం జరిపారు.ఈ ఆర్థిక సంవత్సరం వీటి మూలధన అవసరాల  మీద సమీక్ష జరిపారు. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయటం కోసం జరుపుతున్న వరుస సమావేశాల్లో ఇది నాలుగవది. నిరుడు ఈ 14 సి పి ఎస్ ఇ ల మూలధన అవసరం 1,11,672 కోట్లు కాగా లక్ష్య సాధన 1,16,323 కోట్లుగా నిర్ణయించారు. 2020-21 లక్ష్యం 1.15.934 కోట్లు కాగా ఈ సమీక్ష సందర్భంగా దీన్ని పెంచాల్సిన అవసరముందన్నారు. కోవిడ్ సంక్షోభం వలన ఇబ్బందిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు సి పి ఎస్ ఇ ల పనితీరు మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వివరాలకు :   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665892

ప్రపంచ బ్యాంకు అభివృద్ధి కమిటీ 102వ ప్లీనరీ లో పాల్గొన్న ఆర్థికమంత్రి  శ్రీమతి నిర్మలా సీతారామన్ 

శుక్రవారం నాడు జరిగిన ప్రపంచ బ్యాంకు అభివృద్ధి కమిటీ 102వ ప్లీనరీ లో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి  శ్రీమతి నిర్మలా సీతారామన్  పాల్గొన్నారు. గత ఏప్రిల్ లో జరిగిన సమావేశానికి ముందే ప్రారంభమైన కోవిడ్ సంక్షోభం ఇప్పటికీ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తూనే ఉందన్నారు. పేదరికాన్ని తగ్గించటానికి ఎంతో కష్టపడి పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. కరోనా వ్యాపించకుందా భారత్ అనేక చర్యలు తీసుకున్నదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపన పాకేజ్ లో భాగంగా ఆహార భద్రత, నగదు బదలీ వంటివి చేపట్టిందన్నారు. ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ పాకేజ్ వలన పరిశ్రమలు కోలుకున్నాయన్నారు.

మరిన్ని వివరాలకు :   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665378

రూ. 10,000 కోట్ల ఎన్ సి డి సి ఆయుష్మాన్ సహకార నిధి ఆవిష్కరించిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖామంత్రి

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీనాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల  శాఖామంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్  ఈరోజు ఆయుష్మాన్ సహకార్ పథకం ప్రారంభించారు. ఈ పథకం దేశంలో  ఆరోగ్య రంగ సదుపాయాల కల్పనలో సహకార రంగం పాత్రను ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కింద స్వతంత్ర ప్రతిపత్తి గల ఆర్థిక సంస్థ జాతీయ సహకార ఆర్థిక సంస్థ (ఎన్ సి డి ఎస్) కాలిక రుణాలు రూ. 10,000 కోట్ల వరకు అందిస్తుందని మంత్రి శ్రీ తోమార్ చెప్పారు.  మరిన్ని సౌకర్యాల అవసరాలను ఇప్పటి కరోనా సంక్షోభం తెలియజెప్పిందన్నారు. ఎన్ సి డి సి రైతు సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేస్తుందని కూడా చెప్పారు.

మరిన్ని వివరాలకు :   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665950

హజ్ 2021 సమీక్షా సమావేశం జరిపిన ముక్తార్ అబ్బాస్ నక్వీ

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖా మంత్రి శ్రీ ముక్తార్ అబ్బాస్ నక్వీ ఈ రోజు హజ్ 2021 సమీక్షా సమావేశం జరిపారు. ఈ సారి జూన్ – జులై లో వచ్చే హజ్ యాత్ర జాతీయ, అంతర్జాతీయ కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సౌది అరేబియా ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం  తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.  భారత హజ్ కమిటీ తదితర సంస్థలు దరఖాస్తు విధానాన్ని,  ఏర్పాట్లను లాంచనంగా ప్రకటిస్తాయన్నారు. ఇందులో బస, రవాణా, ఆరోగ్యం తదితర సౌకర్యాల గురించి చెబుతాయన్నారు. యాత్రికుల ఆరోగ్యం, సంక్షేమమే అత్యంత ప్రాధాన్యంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. భారత ప్రభుత్వం, హజ్ కమిటీ ఈ విషయంలో యాత్రికుల మేలు గురించి జాగ్రత్తలు తీసుకోవటం మొదలుపెట్టిందన్నారు.

మరిన్ని వివరాలకు :   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665897

రూ. 1.35 లక్షల కోట్ల రుణపరిమితితో 1.5 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ

ఆత్మ నిర్భర్ భారత్ పాకేజ్ లో భాగంగా ప్రభుత్వం రెండున్నర కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద 2 లక్షల కోట్ల రుణం అందించాలని భావించింది. బాంకులు తదితర భాగస్వాముల కృషి ఫలితంగా మత్స్య కారులు, పాడిరైతులు సహా 1.5 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వటం ద్వారా ఈ పథకంలో ప్రధాన భాగం పూర్తి చేసినట్టయింది. వీరికి రూ. 1,35 లక్షల కోట్ల ఋణ పరిమితి మంజూరు చేసింది.

 మరిన్ని వివరాలకు :   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1665894

పిఐబి క్షేత్ర స్థాయి అధికారుల నుంచి అందిన సమాచారం

*మహారాష్ట్ర: దాదాపు ఏడు నెలలు మూతపడిన తరువాత ముంబయ్ మెట్రో రైళ్ళు పునఃప్రారంభమయ్యాయి. మోనో రైల్ సర్వీస్ కూడా మొదలైంది. అయితే, రైళ్ళు చాలా పరిమిత సంఖ్యలో ప్రయాణీకులతో నడుస్తున్నాయి. సర్వీసుల సంఖ్య కూడా పరిమితంగా ఉంది. ఘట్ కోపర్ వెర్సోవా మార్గంలో అన్ని రైళ్ళు  ఉదయం 8.30 నుంచి సాయంత్రం 8.30 వరకు నడుస్తున్నాయి .ఒక్కో మెట్రో సర్వీసులో 360 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ద్వారాల దగ్గర వైద్య పరీక్షలు చేస్తున్నారు.

•           గుజరాత్:  పాఠశాలల పునఃప్రారంభం మీద  తుది నిర్ణయం తీసుకోబోయే ముందు అందరి అభిప్రాయాలూ తీసుకుంటామని గుజరాత్ విద్యాశాఖామంత్రి భూపేంద్ర సింగ్ చెప్పారు.  గాంధీనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పటికీ ఇలా స్కూల్స్ మూసివెసి ఉంచటం కుదరదన్నారు. అనేక విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు, పరీక్షలు నిర్వహిస్తున్నాయన్నారు.

నాగాలాండ్: నాగాలాండ్ లో మొత్తం 7816 పాజిటివ్ కెసులు నమోదు కాగా ,3477 మంది భద్రతా దళాలకు చెందినవారు. సోకే అవకాశమున్న  2353 మందిని కూడా గుర్తించారు.

కేరళ: కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తూ ఉందటంతో పరీక్షల సంఖ్య లక్షకు పెంచాలని నిపుణుల కమిటీ  ప్రభుత్వానికి సూచించింది.  నిర్ణయించింది. :  పాత పద్ధతిలోనే పరీక్షలు జరపాలని కూడా సూచించింది. 95,200 మంది చికిత్సలో ఉందగా  2.80 మంది అబ్జర్వేషన్ లో ఉన్నారు. తాజా మరణాలు 11 నమోదయ్యాయి.

•           తమిళనాదు: జులై11 తరువాత మొదటిసారిగా  తమిళనాడులో 4,000  కోవిడ్ కేసులు నమోదయ్యాయి.  56 మరణాలు నమోదయ్యాయి.  దీంతో మొత్తం కేసులు 6,87,400 కి, మరణాలు 10,642కి చేరాయి. తెలంగాణ వరదల పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. సాయం అందిచటానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.

కర్నాటక: కర్నాటక ఉపముఖ్యమంత్రి గోవింద్ కర్జోల్ కుటుంబంలో ఎనిమిది మందికి కరోనా సోకింది. ఈ కార్ణంగా వరద పరిస్థితిని సమీక్షించలేకపోయానని ఒక సోషల్ మీడియా పోస్టులో తన నిస్సహాయత గురించి  పేర్కొన్నారు.  కర్నాటక ప్రైవేట్ ఆస్పత్రులలో మెడికల్ ఆక్సిజెన్ అందుబాటు గురించి కూడా ప్రస్తావించారు. తయారీదారులు ఎక్కువ ధర చెబుతున్నారని డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ కు లేఖరాశారు.

ఆంధ్రప్రదేశ్: కరోనా తీవ్రత ఆంధ్రప్రదేశ్ లో కొంత తగ్గింది. కోలుకున్నవారి శాతం పెరుగుతూ వచ్చింది. కొత్తగా వస్తున్న పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. మరణాలు కూడా తగ్గుతున్నాయి. ఆదివారం నాటికి.4 లక్షలమంది కోలుకున్నారు. మరణాలు  6429 కి చేరాయి. కొత్తగా 23 మంది చనిపోయారు. కర్నూలులో తక్కువ స్థాయిలో కొత్త కేసులు 55 గా నమోదయ్యాయి. కృష్ణాజిల్లాలో 503 కొత్త కేసులు వచ్చాయి.  రాష్ట్రంలో మొత్తం 70 లక్షల పరీక్షలు పూర్తయ్యాయి.

తెలంగాణ: 948 కొత్త కేసులు, 1896 మంది కోలుకున్నవారు. 4 మరణాలు గత 24 గంటలలో నమోదయ్యాయి. 948 కేసులలో 212 కేసులు జిహెచ్ ఎం సి నుంచి వచ్చాయి.మొత్తం కేసులు: 2,23,059 కేసులు; చికిత్సలో ఉన్నవి: 21,098; మరణాలు 1275; కోలుకున్నవారు 2,00,686. మంది తెలంగాణలో వరద మృతులు70 కి పెరగగా, హైదరాబాద్ లోనే  33 మంది మరణించారు.

FACT CHECK

 

 

 

 

*********

 

 

           

 

 

 

 

 

 

 

 

 



(Release ID: 1665962) Visitor Counter : 189