ఆర్థిక మంత్రిత్వ శాఖ

సీపీఎస్ఈల క్యాపెక్స్ పై 4వ సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్

Posted On: 19 OCT 2020 1:29PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాన్ని (క్యాపెక్స్) సమీక్షించడానికి  పెట్రోలియం & సహజ వాయువు మరియు బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఈ మంత్రిత్వ శాఖలకు చెందిన 14 సిపిఎస్‌ఇల సిఎండిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి ఆర్థిక మంత్రి వివిధ వాటాదారులతో జరుగుతున్న సమావేశాలలో ఇది నాలుగవది. 

2019-20 ఆర్థిక సంవత్సరంలో, ఈ 14 సిపిఎస్‌ఇల క్యాపెక్స్ రూ.1,11,672 కోట్లకు గాను, రూ. 1,16,323 కోట్లు సాధించాయి. అంటే 104%. 2019-20 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌1 సాధించినది రూ. 43,097 కోట్లు (39%) మరియు 2020-21 ఆర్థిక సంవత్సరం సాధించిన హెచ్ 1 రూ. 37,423 కోట్లు (32%)గా నమోదయింది. 2020-21కి క్యాపెక్స్ లక్ష్యం రూ. 1,15,934 కోట్లు. 

సిపిఎస్‌ఇల పనితీరును సమీక్షిస్తు, సిపిఎస్‌ఇలచే క్యాపెక్స్ ఆర్థిక వృద్ధికి కీలకమైనదని, 2020-21 & 2021-22 ఆర్థిక సంవత్సరాలకు ఆ పరిమాణాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉందని శ్రీమతి సీతారామన్ అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికం ముగిసే సమయానికి పెట్టుబడి పెట్టిన మూలధన వ్యయంలో 75% మూలధన వ్యయాన్ని నిర్ధారించడానికి సిపిఎస్‌ఇల పనితీరును నిశితంగా పరిశీలించాలని, దానికి తగిన ప్రణాళికను రూపొందించాలని ఆర్థిక మంత్రి సంబంధిత కార్యదర్శులను కోరారు. క్యాపెక్స్ లక్ష్యాలను సాధించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖల కార్యదర్శి మరియు సిపిఎస్‌ఇల సిఎమ్‌డిల స్థాయిలో మరింత సమన్వయ ప్రయత్నాలు అవసరమని సీతారామన్ వివరించారు.

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పుంజుకోవడంలో సిపిఎస్‌ఇల ముఖ్యమైన పాత్రను ప్రస్తావిస్తూ, సిపిఎస్‌ఇలను తమ లక్ష్యాలను సాధించడానికి మెరుగైన పనితీరు కనబరచాలని ఆర్థిక మంత్రి ప్రోత్సహించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం సరిగ్గా మరియు సమయానికి ఖర్చు అయ్యేలా చూసుకోవాలి అని అన్నారు.  సిపిఎస్‌ఇల మెరుగైన పనితీరు కోవిడ్-19 ప్రభావం నుండి కోలుకోవడానికి ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున సహాయపడుతుందని శ్రీమతి సీతారామన్ అన్నారు.

సిపిఎస్‌ఇల క్యాపెక్స్ సమీక్షను ఆర్థిక వ్యవహారాల విభాగం మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగం సంయుక్తంగా నిర్వహిస్తుంది.

****



(Release ID: 1665892) Visitor Counter : 159