ఆర్థిక మంత్రిత్వ శాఖ

రైతుల‌కు ప్ర‌త్యేక కెసిసి స‌్పెష‌ల్ శాట్యురేష‌న్ డ్రైవ్ ద్వారా చేసిన‌ రూ.1.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయిల రుణం మంజూరులో రూ. 1.35 ల‌క్ష‌ల కోట్ల రుణ ప‌రిమితిని సాధించడంలో మైలు రాయి

Posted On: 19 OCT 2020 5:50PM by PIB Hyderabad

ఆత్మ‌నిర్భ‌ర్ ప్యాకేజీలో భాగంగా కిసాన్ క్రెడిట్ కార్్డ ప‌థ‌కం (కెసిసి) కింద ఉన్న 2.5 కోట్ల మంది రైతుల‌కు  స‌్పెష‌ల్ శాట్యురేష‌న్ డ్రైవ్ ద్వారా  రూ.02 ల‌క్ష‌ల కోట్ల రూపాయిల రుణ స‌దుపాయాన్ని క‌ల్పించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం సోమ‌వారం ప్ర‌క‌టించింది. మ‌త్స్య‌కారులు, పాడిరైతులు స‌హా రైతుల‌కు రాయితీతో కూడిన రుణాన్నిఅందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు, ఇత‌ర భాగ‌స్వాముల స‌మిష్టి, నిరంత‌ర కృషి చేసిన ఫ‌లితంగా, కెసిసి కింద ఉన్న‌ దాదాపు 1.5 కోట్ల మంది రైతుల‌కు, రూ. 1.35 ల‌క్ష‌ల కోట్ల రుణాల‌ను మంజూరు చేయాల‌న్న భారీ మైలు రాయి ల‌క్ష్యాన్ని సాధించ‌గ‌లిగారు. 
వ్య‌వ‌సాయ ప‌నుల‌కోసం రైతుల‌కు త‌గినంత‌, స‌మ‌యానుకూలంగా రుణాల‌ను అందించాల‌న్న ల‌క్ష్యాల‌తో కెసిసి ప‌థ‌కాన్ని 1998లో ప్ర‌వేశ‌పెట్టారు. దీనికింద రుణం తీసుకున్న రైతుల‌కు 2% మేర‌కు వ‌డ్డీలో రాయితీ, త‌క్ష‌ణ తిరిగి చెల్లింపుల చొర‌వ‌గా 3% రాయితీని భార‌త ప్ర‌బుత్వం అందిస్తుంది. త‌ద్వారా రుణాలపై  వ‌డ్డీ ఏడాదికి 4%గా ఉంటుంది. కెసిసి లాభాల‌ను పాడి, మ‌త్స్య రైతుల‌కు ప‌శుసంవ‌ర్ధ‌క రైతుల‌కు విస్త‌రింప చేస్తూ అనుషంగిక ప‌రిమితి లేని వ్య‌వ‌సాయ రుణ స‌దుపాయాన్ని వ‌డ్డీ రాయితీ రూ. 1 ల‌క్ష నుంచి రూ.1.60 ల‌క్ష‌ల‌కు పెంచ‌డ‌మే కాకుండా వారి మూలధ‌న పెట్టుబ‌డి అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ప్ర‌భుత్వం రైతాంగ అనుకూల చ‌ర్య‌ల‌కు 2019లో శ్రీ‌కారం చుట్టింది .
సౌక‌ర్య‌వంత‌మైన‌, రాయితీతో కూడిన రుణాల‌ను రైతాంగాల‌కు అందించేలా చూడ‌డ‌మే కాకుండా,  గ్రామీణ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు చోద‌క శ‌క్తిగా ఉంటూ, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌, అనుబంధ కార్య‌క‌లాపాల వేగాన్ని పెంచ‌డ‌మే కాక రైతుల ఆదాయ స్థాయిని పెంచేందుకు  ప్ర‌స్తుత ప్ర‌చారం కీల‌కంగా ఉంటుంది. దీర్ఘ‌కాలంలో దేశానికి ఆహార భద్ర‌త‌ను స‌మ‌కూర్చాల‌న్న ల‌క్ష్యాన్ని నెర‌వేర్చ‌డంలో   ఈ చ‌ర్య‌లు ఉప‌యోగ‌ప‌డుతాయి. 

***
 


(Release ID: 1665894) Visitor Counter : 229