ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుదల
మూడో రోజు కూడా చికిత్స పొందుతున్నవారు 8 లక్షలలోపే
వరుసగా 4వ రోజు జాతీయ స్థాయి పాజిటివ్ కేసులు 8% లోపు
Posted On:
19 OCT 2020 11:22AM by PIB Hyderabad
కోవిడ్ మీద పోరులో భారత్ మర్ మైలు రాయి దాటింది. జాతీయ స్థాయిలో మొత్తమ్ కోవిడ్ పాజిటివ్ కేసులు 8% కంటే దిగువకు పడిపోయాయి. నాలుగురోజులుగా ఇదే ధోరణి కొనసాగుతోంది. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల శాతం 7.94 కు చేరి ఇంకా తగ్గుదల బాటలో ఉంది. దేశవ్యాప్తంగా పరీక్షలు సమగ్రంగా జరుపుతూ ఉండటం వలన ఇది సాధ్యమైంది. ఈరోజు వరకు జరిపిన మొత్తం పరీక్షలు 9.5 కోట్లు దాటాయి.

అధిక సంఖ్యలో పరీక్షలు జరపటం వలన కేసులను తగ్గించటం సాధ్యమైందని ఆధారాలు రుజువు చేస్తున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గటం చూస్తే ఇన్ఫెక్షన్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్నట్టు, వ్యాధి నియంత్రణ పెరిగి కట్టడి చేయగలుగుతున్నట్టు అర్థమవుతోంది.
అధిక సంఖ్యలో పరీక్షలు జరపటం వలన చాలా త్వరగా తొలిదశలోనే కేసులు గుర్తించటం, తగిననిఘా ద్వారా వ్యాధి సోకే అవకాశమున్నవారిని గుర్తించటం, సకాలంలో ఐసొలేషన్ కు తరలించి పర్యవేక్షణలో ఉంచటమో, తీవ్ర లక్షణాలుంటే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించటమో జరుగుతోంది. ఈ చర్యల ఫలితంగా మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

అక్టోబర్ లో వరుసగా మూడో వారం కూడా పాజిటివ్ కేసులు 6.13% గా నమోదయ్యాయి. పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే కేంద్ర ప్రభుత్వపు త్రిముఖ వ్యూహం అమలు చేయటం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేయటం వలన ఇది సాధ్యమైంది.

భారత దేశంలో కోవిడ్ చికిత్స పొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. నెలన్నరగా తగ్గుదలబాటలో ఉన్న కేసులు వరుసగా మూడో రోజు 8 లక్షలకంటే తక్కువ స్థాయికి వచ్చాయి. ఇప్పుడు ఇదే తగ్గుదల ధోరణి సాగుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కరోనా బాధితులు ఈరోజుకు 7,72,055 మంది ఉన్నారు. వీరు మొత్తం ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో దాదాపు 10.23% . ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారు 66 లక్షలకు పైగా (66,63,608) ఉన్నారు. దీనివలన చికిత్స పొందుతున్నవారికంటే కోలుకున్నవారు అధికంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. గడిచిన 24 గంటల్లో 66,399 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఉండగా కొత్త పాజిటివ్ గా నమోదైనవారి సంఖ్య 55,722. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 88.26%.
కొత్తగా కోలుకున్నవారిలో 79% మంది పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే. ఆ రాష్ట్రాలలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, చత్తీస్ గఢ్ ఉన్నాయి. వీటిలో మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులోనే 11,00 మందికి పైగా కోలుకోగా, కేరళ , కర్నాటక రాష్ట్రాలు ఎనిమిదేసి వేలకు పైగా కోలుకున్న కేసులతో రెండో స్థానంలో ఉన్నాయి

కొత్తగా పాజిటివ్ గా నమోదైన కేసులు 55,722 ఉన్నాయి. వీటిలో 81% కూదా అవే 10 రాష్ట్రాలలో నమోదయ్యాయి. ఇమ్దులో మహారాష్ట్ర అత్యధికంగా 9,000 కు పైగా కొత్తకే నమోదు చేసుకుంది., కేరళ, కర్నాటక ఏడేసి వేలకంటే ఎక్కువ కేసులతో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

గడిచిన 24 గంటలలో 579 మరణాలు నమొదయ్యాయి. 90 రోజుల తరువాత మరణాలు 600 లోపు నమోదు కావటం గమనార్హం, మరణాలలో దాదాపు 83% 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోనే నమోదయ్యాయి. మరణాలలో దాదాపు 25% పైగా ( 150) మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.

***
(Release ID: 1665789)
Visitor Counter : 220
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam