మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
హజ్ 2021 సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ముక్తార్ అబ్బాస్ నక్వీ
కోవిడ్ సంక్షోభం కారణంగా హజ్ 2021 జాతీయ, అంతర్జాతీ ప్రొటోకాల్ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుందిః ముక్తార్ అబ్బాస్ నక్వీ
కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం, సౌదీ అరేబియా ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని హజ్ 2021పై అంతిమ నిర్ణయం
Posted On:
19 OCT 2020 3:38PM by PIB Hyderabad
కోవిడ్ సంక్షభం కారణంగా అమలులో ఉన్న జాతీయ, అంతర్జాతీయ ప్రోటోకాల్ మార్గదర్శకాలను అనుసరించి హజ్ 2021 ఉంటుందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి సోమవారం వెల్లడించారు.
రాజధాని న్యూఢిల్లీలో హజ్ 2021 సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన నక్వీ, హజ్ 2021 జూన్ -జులై 2021కి షెడ్యూల్ అయి ఉందని, కానీ దీనిపై అంతిమ నిర్ణయాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం, భారత ప్రభుత్వం ప్రజారోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కోవిడ్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని జారీ చేసే మార్గదర్శకాల ఆధారంగా ప్రకటిస్తామని చెప్పారు.

సౌదీ అరేబియా ప్రభుత్వం హజ్ 2021పై ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, ఇతర భారతీయ ఏజెన్సీలు హజ్ 2021 దరఖాస్తు ప్రక్రియను, తత్సంబంధిత ఏర్పాట్ల గురించి అధికారికంగా ప్రకటిస్తాయని నక్వీ తెలిపారు.
అవసరమైన మార్గదర్శకాల నేపథ్యంలో హజ్ ప్రక్రియలో చెప్పుకోదగిన మార్పు ఉంటుందని ఆయన అన్నారు. భారత్‌లోనూ, సౌదీ అరేబియాలోనూ, వసతి, రవాణా, ఆరోగ్యం, ఇతర సౌకర్యాలలో సహా ఈ మార్పులు కనిపించవచ్చని ఆయన చెప్పారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా యాత్రికుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని ఆయన వివరించారు. ఈ విషయంలో భారతీయ ఏజెన్సీలు అవసరమైన ఏర్పాట్లు చేస్తాయని అన్నారు. యాత్రికుల ఆరోగ్యం, సంక్షేమాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం, హజ్ కమిటీ తగిన ఏర్పాట్లు ప్రారంభించాయి.
భారత్‌లో హజ్ ప్రక్రియ నూటికి నూరు శాతం డిజిటల్ కావడంతో, కరోనా కారణంగా హజ్ 2020 రద్దు అయిన నేపథ్యంలో రూ. 2100 కోట్లను డిబిటి పద్ధతిలో ఎటువంటి కత్తిరింపులు లేకుండా 1 లక్ష 23,000 మందికి తిరిగి ఇవ్వడం జరిగిందని నక్వీ చెప్పారు. రవాణా కోసం తీసుకున్న రూ. 100 కోట్లను సౌదీ అరేబియా ప్రభుత్వం తిరిగి ఇచ్చిందన్నారు.
కేవలం నూటికి నూరు శాతం డిజిటల్ హజ్ ప్రక్రియ కారణంగానే, కరోనా సంక్షోభ సమయంలో కూడా గత మూడు ఏళ్ళల్లో హజ్ యాత్రికులకు చెందిన రూ. 514 కోట్ల మిగులు మొత్తాన్ని వారి బ్యాంకు అకౌంట్లలో వేయడం జరిగిందని చెప్పారు. హజ్ ప్రక్రియ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని మంత్రి వెల్లడించారు.
మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పి.కె. దాస్, మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి విపుల్, పౌరవిమాన శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.కె. మిశ్ర కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. సౌదీ అరేబియాకు భారతీయ రాయబారి అయిన డాక్టర్ అవుసఫ్ సయీద్, జెద్దాలో తాత్కాలిక కాన్సల్ జనరల్ వై. సాబీర్, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా సిఇఒ ఎం.ఎ. ఖాన్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎయిర్ ఇండియాకు చెందిన అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యారు.


*****
(Release ID: 1665897)
Visitor Counter : 198