PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 15 OCT 2020 6:13PM by PIB Hyderabad

#Unite2FightCorona

#IndiaFightsCorona

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్ కేసుల తీరులో భారత్ అసాధారణ రికార్డు.  కేసులు రెట్టింపు కావటానికి సమయం సుమారు 73 రోజులు
  • చికిత్సలో ఉన్న కేసులు మంరింత తగ్గుదల; ప్రస్తుతం మొత్తం కేసుల్లో సుమారు 11%   
  • గడిచిన 24 గంటల్లో కొత్తగా కోలుకున్నవారి సంఖ్య 81,514, కొత్త పాజిటివ్ కేసులు 67,708
  • కోవిడ్ వాక్సిన్ పరిశోధన, పంపిణీ మీద ప్రధాని అధ్యక్షతన సమీక్షా సమావేశం
  • కోవిడ్ కు తగిన ప్రవర్తనా నియమాలు పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చిన ఆరోగ్యశాఖామంత్రి  
  • కోవిడ్ మీద పోరుకు ప్రజలను సమాయత్తం చేయటానికి సిద్ధమైన ఆయుష్ రంగం
  • ప్రపంచంలో జనరిక్ ఔషధాల తయారీ, ఎగుమతులలో అతిపెద్ద దేశాల్లో భారత్ ఒకటి : శ్రీ గౌడ

Image

భారత్ లో అసాధారణ రికార్డు: కోవిడ్ కేసుల రెట్టింపుకు73 రోజుల సమయం; చికిత్సలో ఉన్న బాధితుల సంఖ్య మరింత తగ్గి 11 శాతానికి చేరిక 

భారత దేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య అసాధారణంగా పెరుగుతూ ఉండటంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ సోకుతున్నవారి సంఖ్య రెట్టింపు కావటానికి 73 రోజులు (72.8) పడుతున్నట్టుగా తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన 24 గంటలలో  81,514 మంది కొత్తగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరలు కోలుకున్న కోవిడ్ పాజిటివ్ ల సంఖ్య 64 లక్షలకు (63,83,441) చేరింది. ఒక్కో రోజూ కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉండటం వల్ల జాతీయ స్థాయిలో కోలుకున్నవారిశాతం 87 దాటి ప్రస్తుతం 87.36% అయింది. కొత్తగా కోలుకున్నవారిలో దాదాపు 79% మంది 10 రాష్ట్య్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే పరిమితం కావటం కూడా గమనార్హం.  వీటిలో మహారాష్ట్రలోనే 19,000 కు పైగా కేసులు నమోదు కాగా కర్నాటక 8,000 తో తరువాత స్థానంలో ఉంది.  ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసులలో 11.12 % మంది చికిత్స పొందుతూ ఉన్నారు. వీరి సంఖ్య 8,12,390 గా నిలిచింది. వారం రోజులుగా ఈ సంఖ్య 9 లక్షల లోపే ఉంటూ వస్తున్నది. గత 24 గంటలలో 67,708 కేసులు కొత్తగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 77% కేసులు కేవలం 10 రాష్ట్రాలకు చెందినవే కావటం గమనార్హం. వాటిలో మహారాష్ట్రలో అత్యధికంగా 10,000 కు పైగా కేసులు నమోదు కాగా దాదాపు 9,000 కు పైగా కేసులతో కర్నాటక రెండో స్థానంలో ఉంది.  గత 24 గంటల్లో 680 మంది కోవిడ్ బాధితులు చనిపోయారు. గడిచిన 12 రోజులుగా మరణాల సంఖ్య స్థిరంగా 1000 కి లోపే ఉంటూ వస్తున్నది.  మృతులలో 80% మంది పది రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యారు. వారిలో 23% (158 మంది) కొత్తగా మరణించినవారు మహారాష్ట్రకు చెందినవారే.

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664739

 

కోవిడ్ వాక్సిన్ పరిశోధన, పంపిణీ మీద ప్రధాని అధ్యక్షతన సమీక్షా సమావేశం

కోవిడ్ వాక్సిన్ పరిశోధన, దాని పంపిణీ విషయమై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమీక్షా సమావేశం జరిగింది. పరీక్షించే సాంకేతిక పరిజ్ఞానం, సోకే అవకాశమున్నవారిని గుర్తించటం. ఔషధాలు, చికిత్స తదితర అంశాలు కూడా ఈ సమీక్షలో భాగమయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు, ప్రధాన శాస్త్ర సాంకేతిక సలహాదారు, సీనియర్ శాస్త్రవేత్తలు తదితర అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్ సవాలును స్వీకరిస్తూ భారత దేశంలో వాక్సిన్ కనుక్కోవటంలో నిమగ్నమైన వారిని, తయారీదారులను ప్రధాని అభినందించారు. అలాంటి ప్రయత్నాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. నియంత్రణా సంస్కరణలు ఒక నిరంతర ప్రక్రియ అని, ఇప్పటి, భవిష్యత్ అవసరాలకు తగిన నిపుణుల సేవలు అందుకోసం వాడుకుంటామని చెప్పారు. వాక్సిన్ అందుబాటులోకి రాగానే పంపిణీకి ఆరోగ్యమంత్రిత్వశాఖ తీసుకకోదలచిన సమగ్ర ప్రణాళికను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. తగినంత వాక్సిన్ సేకరణ, పెద్దమొత్తంలో నిల్వ చేయటానికి వాడుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, సమర్థవంతంగా పంపిణీ చేయటం కూదా అందులో ఇమడ ఉన్నాయి. తక్కువ ధరలో సులభంగా లభ్యమయ్యే వాక్సిన్ ను తగిన పరిమాణంలో భారత్ తో బాటు మొత్తం ప్రపంచానికి సైతం అందించటానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు.

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664881

 

ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ విజన్ 2050 కి అనుగుణంగా ప్రభుత్వ సంపూర్ణ వైఖరిని పెంపొందించటంపై మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ హర్షవర్ధన్

ఈ రోజు జరిగిన ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ, వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన అంతర్-మంత్రిత్వశాఖల సమావేశానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షత వహించారు. విజన్ 2050 లక్ష్యంగా “దేశానికి సరైన తిండి ఉద్యమం” దిశలో ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాన్ని ఈ సందర్భంగా సమీక్షించారు. ఆహారం వలన సంక్రమించే వ్యాధులకయ్యే ఖర్చు దాదాపు 1500 కోట్ల డాల్ర్లుంటుందని అంచనా వేసినట్టు గుర్తు చేశారు. 21% వృధాకావటం, 36% మంది బరువు తక్కువగా ఉండటం, 38% మంది పిల్లల్లో తగిన ఎదుగుదల లేకపోవటం లాంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. 50% మంది మహిళలు, పిల్లలు రక్తహీనతతో బాఢపడు తున్నారన్నారు. అదే సమయంలో 2005-15 దశాబ్దంలో ఊబకాయం సమస్య 9.3% నుంచి 18.6శాతానికి రెట్టింపైందని కూడా గుర్తు చేశారు. ఆహార భద్రత నుంచి మనం పౌష్టికాహార భద్రతవైపు అడుగులేయాల్సి ఉందన్నారు. ఈ విషయంలో సంబంధిత మంత్రిత్వశాఖలన్నీ ఒక్కటై ఒక ఉమ్మడి వేదిక నుంచి లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. ఈట్ రైట్ ఇండియా, ఫిట్ ఇండియా లాంటి ఉద్యమాలను మరింత ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఫలితాలు వచ్చే పదేళ్లలో ఆరోగ్య రంగంలో అనూహ్యమైన మార్పులు తీసుకువస్తాయని డాక్టర్ హర్ష వర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664814

అన్ని ఎయిమ్స్. కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల అధిపతులలో డాక్టర్ హర్ష వర్ధన్ సమావేశం: జన్ ఆందోళన్, కోవిడ్ అనుకూల ప్రవర్తనపై సమీక్ష

కోవిడ్ అనుకూల ప్రవర్తనకు సంబంధించిన జన్ ఆందోళన్  కార్యకలాపాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి దాక్టర్ హర్ష వర్ధన్ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరు సలపటంలో రాబోయే కొన్ని నెలలు ఎంతో కీలకమన్న విషయాన్ని మంత్రి మరోమారు గుర్తు చేశారు. “ మనం కోవిడ్-19 మీద పోరులో పదో నెలలో ప్రవేశిస్తున్నాం. నిపుణుల బృందంతో మనం జనవరి 8న తొలి సమావేశం జరిపాం. అప్పటినుంచి విరామం లేకుందా పోరు సాగిస్తూనే ఉన్నాం. ఈరోజు మనం తగినంత ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించుకోగలిగామని గర్వంగా చెప్పుకో గలుగుతున్నాం. అందులో 90 లక్షల పడకలు, 12,000 కు పైగా క్వారంటైన్ కేంద్రాలు, 1900 కు పైగా లాబ్ లు అందులో భాగమే” అన్నారు. అవిశ్రాంతంగా కృషి చేసిన కోవిడ్ యోధులను మంత్రి మరోసారి అభినందించారు. ఈ పోరులో బాధితులను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలియజేశారు. ఈనెల 8న ప్రధాని జన్ అందోళన్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా కోవిడ్ కు తగిన వ్యవహారశైలిని ప్రజలు అలవరచుకోవాలని డాక్తర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచం మొత్తాన్నీ వైరస్ అతలాకుతలం చేసిందని చెబుతూ, చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా కరోనాను సమర్థంగా నియంత్రించగలిగామన్నారు. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించటం, చేతుల పరిశుభ్రత, శ్వాస విషయంలో జాగ్రత్తలు అనే సామాజిక వాక్సిన్ పట్ల స్పృహతో మెలగాలని కోరారు.

 

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664448

 

కోవిడ్ 19 మీద పోరులో జన్ అందోళన్ కు మద్దతుగా నిలిచిన ఆయుష్ రంగం: 2000 మందితో  ప్రతిజ్ఞ

 

కోవిడ్ 19 మీద పోరులో భాగంగా ఆయుష్ మంత్రిత్వశాఖ జన్ ఆందోళన్ ప్రచారోద్యమం చేపట్టింది. కోవిడ్ పట్ల ప్రజారోగ్య స్పందనే దీని మూల సూత్రం. కోవిడ్ కు తగిన ప్రవర్తన అలవరచుకునేలా చేయటమే ఈ ఉద్యమలక్ష్యం. అక్టోబర్ 8న ప్రధానమంత్రి ఒక ట్వీట్ చెస్తూ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. రానున్న పండుగల సీజన్ ను, శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దేశ వ్యాప్తంగా ప్రజలందరోరూ కోవిడ్ నియంత్రణకు అనుగుణంగా వ్యవహారశైలిని తీర్చిదిద్దుకోవాలని చెప్పటమే దీని ఉద్దేశ్యం. ప్రజలతో కలిసి పనిచేస్తూ ఆయుష్ సిబ్బంది ప్రజలను భాగస్వాములను చేస్తూ ఈ ఉద్యమానికి ఊపందించే పనిలో ఉన్నారు. ఆయుష్ ప్రాక్టీషనర్లు ఉత్ప్రేరకంలా పనిచేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలకు ఈ సమాచారాన్ని చేరవేసి అవగాహన పెంచుతారు.

మాస్కు ధరించటం, భౌతిక దూరం పాటించటం, చేతులు పరిశుభ్రత పాటించటం అనే మూడు సూత్రాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ ప్రచారోద్యమం సాగుతుంది. మంత్రిత్వశాఖలోని వివిధ విభాగాల. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల, పరిశ్రమల, విద్యారంగ  భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం  చేయటానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని  ఆయుష్ డైరెక్టరేట్లు, వాటి పరిధిలోని డిస్పెన్సరీలు ఒక నెట్ వర్క్ గా తయారై ఇందులో పాలుపంచుకుంటాయి.

మరిన్ని వివరాలకుhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664584

 “కోవిడ్-19కి ఆయుర్వేదం” ప్రధానాంశంగా 5వ ఆయుర్వేద దినోత్సవం 

ఈ ఏడాది అయుర్వేద దినోత్సవం ప్రధానంగా కోవిడ్-19 నియంత్రణలో ఆయుర్వేదం పాత్ర అనే అంశం కేంద్ర బిందువుగా పాటించబోతున్నారు.  ధన్వంతరి జయంతి ఈ ఏడాది  నవంబర్ 13న వస్తుందగా ఆరోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 2016 నుంచి ఏటా ఈ రోజును ఆయుర్వేద దినోత్సవంగా పాటిస్తున్న సంగతి తెలిసిందే.  ఆయుర్వేద విజ్ఞానపు బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పటం, ఈ చికిత్సావిధానపు విశిష్టతను చాటిచెప్పటం దీని ప్రధాన లక్ష్యం. జాతీయ ఆరోగ్య విధానం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలోకి వెళుతూ తన శక్తిని సమాజానికి తెలియజెప్పాలని ఆయుర్వేదం భావిస్తోంది.దుకే ఆయుర్వేద దినోత్సవాన్ని ఒక వేడుకలా జరుపుకొకోవటం కంటే  ఈ వృత్తికి పునరంకితమవుతున్నట్టు చాటిచెప్పటానికి వినియోగిస్తున్నారు.

మరిన్ని వివరాలకుhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664879

ప్రపంచంలో జనరిక్ ఔషధాల తయారీ, ఎగుమతులలో అతిపెద్ద దేశాల్లో భారత్ ఒకటి : శ్రీ డివి సదానంద గౌడ ప్రపంచవ్యాప్తంగా జనరిక్ ఔషధాల తయారీలోను, ఎగుమతులలోను అతిపెద్ద దేశాల్లో భారతదేశం ఒకటని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖామంత్రి  శ్రీ డివి సదానంద గౌడ్ అన్నారు. తొలిదశలో హెచ్ సి క్యు, అజిత్రోమైసిన్ అత్యవసర పరిస్థితులో కోవిడ్ చికిత్సకు వాడవచ్చునని గుర్తించామన్నారు. ఈ మందులను భారత్ దాదాపు 120 దేశాలకు పైగా సరఫరా చేయటాన్ని ఆయన ప్రస్తావించారు. సకాలంలో నమ్మకమైన ఔషధ తయారీ, పంపిణీదారుగా భారతదేశానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు దక్కాయన్నారు. ఫిక్కీ గత రాత్రి ఏర్పాటు చేసిన లీడ్స్ 2020 సదస్సులో భాగంగా  “దూరాలను కొత్త దృష్టితో చూడటం” మీద లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలతో వర్చువల్ విధానంలో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత ఫార్మా రంగం 2024 నాటికి 6500 కోట్ల డాలర్లకు ఎదుగుతుందన్నారు.

మరిన్ని వివరాలకుhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664739 

 

జి20 ఆర్థిక మంత్రులు. కేంద్ర బాంకుల గవర్నర్ల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

నిన్న వీడియో కన్ఫరెన్స్ ద్వారా జరిగిన జి20 ఆర్థిక మంత్రులు. కేంద్ర బాంకుల గవర్నర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్ పాల్గొన్నారు. జి20 దేశాల మంత్రులు, కేంద్రబ్యామ్కుల గవర్నర్లు ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల గురిమ్చి చర్చించారు. 2020 కి అనుగుణమైన అనేక ఆర్థిక సంబంధ  అంశాలతోబాటు  కోవిడ్ 19 మహమ్మారికి జి20 దేశాల స్పందనను కూడా సమీక్షించారు. కోవిడ్ -19 కి అనుగుణంగా వ్యవహరించాల్సిన తీరుమీద మొదటి సెషన్ లో భారత ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన అంశాలకు అందరూ ఆమోదం తెలియజేసారు.ప్పటివరల్కు అనుసరిస్తున్న విధానాన్నే కోవిడ్ 19 కు సమాధానంగా కూడా  కొనసాగించాలని ఆమె సూచించారు. కోలుకోవటంలో భాగంగా ఆరోగ్యాన్ని, ఆర్థిక పురోగతిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. అంతర్జాతీయ నియంత్రణల నేపథ్యంలో విధాన పరమైన స్పందనలు ఎలా ఉండాలో సూచించారు.

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664654

 

భారత రాష్ట్రపతికి, టర్క్ మెనిస్తాన్ అధ్యక్షునికి మధ్య టెలిఫోన్ సంభాషణ

భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవిడ్ కు ఈరోజు (అక్టోబర్ 15,2020న) టర్క్ మెనిస్తాన్ అధ్యక్షుడు శ్రీ గుర్బంగులీ బెర్దిముహమెదోవ్ నుంచి టెలిఫోన్ వచ్చింది. ఇరుదేశాలమధ్య ఉన్న సత్సంబంధాలను, చారిత్రక, నాగరిక బంధాన్ని నెమరువేసుకున్నారు.  విభిన్న అండ్శాలలో సహకారం పట్ల ఇరువురూ సంతృప్తి వ్యక్తం చేశారు. వర్తక, ఆర్థిక రంగాలలో ఇరుదేశాల మధ్య ఉన్న అవకాశాలున్నాయని అంకరిస్తూ భారత్-టర్క్ మెనిస్తాన్ కంపెనీల ద్వారా, ముఖ్యంగా ఫార్మా కంపెనీల ద్వారా ఈ బంధం మరింత బలపదాలని ఆకాంక్షించారు. 

మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664738

 

పారా ఆర్చర్ అంకిత్ కు కరోనా పాజిటివ్, సోనెపట్ ఆస్పత్రికి తరలించిన స్పోర్ట్స్ అథారిటీ అధికారులు

 

విలువిద్య క్రీడాకారుడు అంకిత్ కు కరోనా సోకినట్టు తేలింది. ప్రస్తుతం ఆయన సోనేపట్ లోని స్పోర్ట్స్ అధారిటీ ఆఒఫ్ ఇండియా వారి జాతీయ శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుతునన్నారు. తగిన చికిత్స అందిస్తూ నిరంతర పర్యవేక్షణలో కొనసాగేలా ఆయనను బుధవారం నాడు సోనేపట్ లోని భగవాన్ దాస్ ఆస్పత్రికి తరలించారు. పారా ఆర్చరీ కాంప్ ఈ నెల 5న ప్రారంభం కాగా కోవిడ్ నెగటివ్ ధ్రువపత్రాలు సమర్పించిన మీదట ఎనిమిది మంది ఆర్చర్లతో సహా పలువురు క్రీడాకారులకు ఈ శిబిరానికి అనుమతించారు. ప్రామాణిక విధి విధానాలకు అనుగుణంగా శిబిరం నిర్వహిస్తూ ఉండఘా అక్టోబర్ 12న మళ్లీ పరీక్షలు జరిపినప్పుడు అంకిత్ పాజిటివ్ గా తేలటంతో వెంటనే భగవాన్ దాస్ ఆస్పత్రిలోని ఐసొలేషన్ వార్డుకు తరలించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664582

 

పిఐబి క్షేత్రస్థాయి అధికారులనుంచి అందిన సమాచారం

  • మహారాష్ట్ర: మిషన్ పునరారంభం లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం లైబ్రరీలు, పరిశొధనకు అవసరమైన లాబ్ ల కోసం ఉన్నత విద్యాసంస్థలు, మెట్రో రైలు సర్వీసులు, వ్యాపార ప్రదర్శనలు, వారాంతపు మార్కెట్ల పునఃప్రారంభానికి అనుమతించింది.  రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలిస్తూ, కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల గురువారం నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.
  • గుజరాత్t: గుజరాత్ హైకోర్ట్ రెండో విడత కోవిడ్ కారణంగా మూతపడుతోంది. పూర్తిగా సానితైజ్ చేయటఆం కోసం ఈ నెల 16 నుంచిఒ 19 వరకు మూసివేస్తారుఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఒక సర్క్యులర్ జారీచేశారీ విరామంలో లాయర్లకు, సిబ్బందికి కోవిడ్ పరీక్షలు కూడా జరుపుతామని అందులో పేర్కొన్నారు. ..రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల 1.55 లక్షలు దాటగా చికిత్సలో ఉన్నవ్చారికంటే  కోలుకున్నవారి సంఖ్య ఎక్కువస్థాయిలో కొనసాగుతోంది.
  • రాజస్థాన్: దేశంలోనే మొదటి సారిగా రాజస్థాన్ రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన కోవిడ్ సహాయక కార్యకలాపాల మీద సామాజిక్ ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్ణయించారు. సంక్షోభ సమయంలో, ముఖ్యంగా లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్న కాలంలో  రాజస్థాన్ ప్రభుత్వం రూ.3,500 చొప్పున రోజువారీ అవసరాలకోసం పేదలకు ఏకకాల సాయంగా అందించిందని,  ఉచిత రేషన్ అందించిందని చెప్పారు.  
  • మధ్యప్రదేశ్: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దుర్గామాత ఆలయాలనూ తెరచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తులిఉ సులభంగా దర్శనం చేసుకోవటానికి వీలుకల్పిస్తున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో వీలైనంత వరకు ప్రజలు గుంపులని నివారించేందుకు  ఇళ్లలోనే పూజ నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు
  • అస్సాం: గడిచిన 24 గంటలలో అస్సాంలో 139,868 కోవిడ్ పరీక్షలు జరిగాయి. వాళ్లలో  1427 మంది పాజిటివ్ గా తేలారు. దీంతో మొత్తం కోవిడ్ కేసులు 198213 కి చేరాయి.
  • మేఘాలయ: రాష్ట్రంలో ఈరోజు  176 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  చికిత్సలో ఉన్న వారి మొత్తం సంఖ్య 2339 కు చేరింది. వీరిలో 122 మంది బి ఎస్ ఎఫ్, సాయుధ దళాలకు చెందినవారు.  
  • కేరళ: ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఈరోజు తిరువనంతపురంలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ వైరాలజీని ప్రారంభించారు.  ఇది వివిధ రకాల వైరస్ లను, వైరల్ ఇన్ఫెక్షన్లను నిర్థారించటానికి పనికొస్తుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది పాఠశాలలు ఫీజుల్లో 25% తగ్గించుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఆదేశించిందీ ఆదేశం ప్రభత్వ, సిబిఎస్ ఇ, ఐసిఎస్ ఇ స్కూళ్ళకు వర్తిస్తుందని పేర్కొంది. ఇలా ఉందగా . 6,244 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 93,837 మంది బాధితులు చికిత్స పొందుతూ ఉన్నారు. 2.78 లక్షలమంది పరిశీలనలో ఉన్నారు. ఇప్పటి వరకు నమోదైన మరణాలు 1066.
  • తమిళనాడు: తమిళనాడులో కోవిడ్ కేసులు వరుసగా మూడో రోజు కూడా తగ్గుతూ వస్తున్నాయి.  బుధవారం నాడు 4,462 మంది పాజిటివ్ గా తేలగా  5,083మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 52 మంది మరణించారు. నిరుటి కేసులతో పోల్చుకుంటే చెన్నై లో 2% మాత్రమే డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.  నైరుతి రుతు పవనాల కారణంగా డెంగ్యూ రావటం సహజం కాగా ఇప్పుడు రుతుపవనాలు తగ్గుముఖం పట్టాయి. కోవిడ్ వలన రద్దీగా మారిన ఆస్పత్రులు నిజానికి చికిత్స అందించగలిగే స్థితిలో ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఎలాగూ డెంగ్యూ కెసులు లేకపోవటం కలిసి వచ్చిందని సీనియర్  వైద్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. .
     
  • కర్నాటక: కర్నాటక ఉప ఎన్నికలలో పోటెదెచేస్తున్న అభ్యర్థులకు ప్రతి రెండు రోజులకొక సారి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో దసరా, దీపావళి సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలతో రాష్ట్రప్రభుత్వం మార్గదర్శకాల జాబితాను విడుదల చేసింది.  బాణసంచా అమ్మకాల్కు నవంబర్ 1 నుంచి 17 వరకు అనుమతించింది. చిన్న చిన్న గుంపుల మాత్రమే ఉండాలనే నిబంధన విధించింది. కొంతమంది బాధితులకు ఇతర వ్యాధులు ఉండగా వాటిని గుర్తించలేకపోతున్నట్టు కర్నాటకలో కొంతమంది దాక్తర్ల దృష్టికి వచ్చింది. అలాంటి వ్యాధులలో మలేరియా, టైఫాయిడ్, టీబీ, డెంగ్యూ ఉన్నాయి. 

 

  • ఆంధ్రప్రదేశ్: సగం సామర్థ్యంతో థియేటర్లు, మల్టీప్లెక్స్ లు తెరచుకోవచ్చునని కేంద్రం అన్ లాక్ 5.0 లో అనుమతించినప్పటికీ ఈరోజు మూసివేతలోనే ఉన్నాయి. అనేక అవరోధాల రీత్యా ప్రదర్శ్నలౌ కుఅదరవని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.  ప్రధానంగా నిర్వహణ ఖర్చులభారం ఎక్కువగా ఉండటం,  లాక్ డౌన్ ఫలితంగాఐదారు నెలలుగా షూటింగ్స్ నిలిచిపోయన కారణంగా కొత్త సినిమాలు అందబాటులొ లేకపోవటం లాంటి సమస్యలను ప్రస్తావించారు. పైగా ఒక్కో థియేటర్ కోవిడ్ నిబంధనల అమలుకోసం రూ. 4 లక్షల మేరకు ఖరెచు చేసిందని కూడా చెప్పారు; ఇలా ఉండగా టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కరోనా బారిన పడినట్టు తేలింది.
  • తెలంగాణ: గడిచిన 24 గంటలలో 1432 కొత్తకేసులు, 1949 మందికోలుకున్నవారు,  8 మరణాలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో . మొత్తం కేసులు 2,17,670 కాగా ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు 23,203 మంది; మరణాలు1249; కోలుకున్నవారు: 1,93,218 మంది. ప్రభుత్వం కోవిడ్ మీద పోరుకు చెస్తున్న కృషికి తోడుగా  అపోలో ఆస్పత్రి గురువారం నాడు ఒక  ప్రకటన చెస్తూ తాము 10 లక్షల కోవిడ్ వాక్సిన్లు వేయగలమని చెప్పింది. కేంద్రం వాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా తమకు ఉన్న నెట్ వర్క్ సాయంతో  19 కేంద్రాల ద్వారా 70మ్ ఆస్పత్రులను, 400 క్లినిక్స్ ను, 500 కార్పొరేట్ ఆరోగ్య కేంద్రాలను., దాదాపు 4,000 ఫార్మసీలను వాడుకుంటూ తమ డిఒజిటల్ వెదిక సాయంతో ఈ పని పూర్తి చేయగలమని ప్రకటించింది  .

నిజ నిర్థారణ

 

*****

 

 

 

 

 

 

 

 



(Release ID: 1664961) Visitor Counter : 221