ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19 కు వ్యతిరేకంగా పరిశోధన మరియు వ్యాక్సిన్ విస్తరణ పర్యావరణ వ్యవస్థ యొక్క సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన - ప్రధానమంత్రి
Posted On:
15 OCT 2020 5:30PM by PIB Hyderabad
పరీక్షా సాంకేతికతలు, కాంటాక్ట్ ట్రేసింగ్, మందులు, చికిత్స మొదలైన వాటితో సహా, కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పరిశోధన మరియు వ్యాక్సిన్ విస్తరణ పర్యావరణ వ్యవస్థ యొక్క సమీక్షా సమావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ నిర్వహించారు.
ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హర్ష వర్ధన్; నీతీ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం); ప్రధాన శాస్త్రీయ సలహాదారుని తో పాటు ; సీనియర్ శాస్త్రవేత్తలు; ఇతర అధికారులు పాల్గొన్నారు.
కోవిడ్-19 సవాలును ఎదుర్కోడానికి భారతదేశానికి చెందిన వ్యాక్సిన్ డెవలపర్లు మరియు తయారీదారులు చేసిన కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు. అటువంటి కృషికి అవసరమైన సదుపాయాలనూ, మద్దతును కొనసాగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.
నియంత్రణ సంస్కరణ ఒక క్రియాశీల ప్రక్రియ అని ప్రధానమంత్రి అభివర్ణిస్తూ, అనేక కొత్త విధానాలు వెలువడిన నేపథ్యంలో, ప్రస్తుత మరియు అభివృద్ధి చెందుతున్న ప్రతి డొమైన్‌లోని నిపుణులను రెగ్యులేటర్ ముందుగానే ఉపయోగించాలని సూచించారు.
వ్యాక్సిన్ల కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ అమలుచేయనున్న సమగ్ర పంపిణీ మరియు డెలివరీ విధానం గురించి, ప్రధానమంత్రి, అడిగి, తెలుసుకున్నారు. అదేవిధంగా, తగినంత సేకరణ కోసం యంత్రాంగాలు మరియు బల్క్-స్టాక్ నిల్వ కోసం సాంకేతికతలు, పంపిణీ కోసం వెయిల్స్ నింపడం మరియు సమర్థవంతమైన డెలివరీని నిర్ధారించడం మొదలైన వివరాల గురించి కూడా ఆయన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
సెరో సర్వేలు మరియు పరీక్షలు రెండింటినీ తప్పక పెంచాలని ప్రధానమంత్రి ఆదేశించారు. క్రమం తప్పకుండా, వేగంగా మరియు చవకగా పరీక్షించే సదుపాయం, తప్పకుండా, అందరికీ త్వరగా అందుబాటులో ఉండాలని ఆయన కోరారు.
సాంప్రదాయ ఔషధ చికిత్సల యొక్క నిరంతర మరియు కఠినమైన శాస్త్రీయ పరీక్ష మరియు ధ్రువీకరణ యొక్క అవసరాన్ని కూడా ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ క్లిష్ట సమయంలో, నిదర్శనంతో కూడిన పరిశోధనలు మరియు నమ్మకమైన పరిష్కారాలను అందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.
పరీక్ష, వ్యాక్సిన్ మరియు ఔషధాల కోసం భారతదేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి తక్కువ ఖర్చుతో కూడుకున్న, తేలికగా లభించే మరియు నిర్దిష్ట పరిష్కారాలను అందించే భారతదేశం యొక్క సంకల్పాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
మహమ్మారికి వ్యతిరేకంగా నిరంతర అప్రమత్తత మరియు ఉన్నత స్థాయి సంసిద్ధతతో ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
*****
(Release ID: 1664881)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam