ఆయుష్
కోవిడ్ -19పై యుద్ధానికి ఆయుర్వేద అన్నది ప్రధాన ఇతివృత్తంగా ఐదవ ఆయుర్వేద దినోత్సవం
Posted On:
15 OCT 2020 5:27PM by PIB Hyderabad
ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవ వేడుకలలో కోవిడ్ -19 మహమ్మారి నియంత్రణలో ఆయుర్వేద సంభావ్య ప్రభావ పాత్రపై దృష్టి పెట్టనున్నారు.
ఆయుర్వేద దినోత్సవాన్ని 2016 నుంచి ధన్వంతరి జయంతి రోజున నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 13వ తేదీన ఈ దినోత్సవం జరుగనుంది.
ఆయుర్వేద దినోత్సవ లక్ష్యం ఆయుర్వేద బలాల, దాని ప్రత్యేక చికిత్సా సూత్రాలపై దృష్టిపెట్టడం. ఆయుర్వేద సామర్ధ్యంతో వ్యాధుల భారాన్ని, సత్సంబంధిత మరణాలను తగ్గించడం, జాతీయ ఆరోగ్య విధానం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు ఆయుర్వేద సామర్ధ్యం దోహదం చేసేలా చూడడం, సమాజ స్వస్థతకు ఆయుర్వేద సూత్రాలను ప్రోత్సహించడం కూడా ఈ లక్ష్యంలో భాగమే. అందుచేత, ఆయుర్వేద దినోత్సవం అన్నది వేడుకలు, సంబరాలు జరుపుకోవడం కన్నా ఈ వృత్తిని తిరిగి సమాజానికి పునరంకితం చేసే సందర్భం.
ప్రస్తుత మహమ్మారికి సంబంధించిన ఆందోళనలపై, ఈ సందర్భంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఆయుర్వేద ఎలా తోడ్పడగలదు అన్నదానిపై ప్రత్యేక దృష్టిని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఐదవ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా పెట్టనుంది.
కోవిడ్ -19 మహమ్మారికి విరుగుడుగా ఆయుర్వేద అన్న అంశంపై ఆయుర్వేద దినోత్సవంనాడు వెబినార్‌ను నిర్వహించనున్నారు. కోవిడ్ -19ని తగ్గించడానికి ఆయుర్వేద రంగం చేపట్టిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ఈ సందర్భంగా వ్యాప్తి చేయాలని లక్ష్యిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 1.5 లక్షల మంది ఈ వెబినార్‌లో పాలు పంచుకుంటారని అంచనా. ప్రజలను కలుపుకుని, తగిన కార్యకలాపాలతో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించవలసిందిగా విదేశాలలో ఉన్న ఎంబెసీలను/ మిషన్లకు ఆయుష్ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా వెబినార్ మాత్రమే కాకుండా వివిధ కార్యకలాపాలను కూడా నిర్వహించాలని తలపెట్టారు. అక్టోబర్ నెల రెండవ పక్షంలో బిఐఎమ్ ఎస్ టిఇసి, ఐబిఎస్ ఎ దేశాలతో , అలాగే వాణిజ్య శాఖ, విదేశాంగ శాఖ, ఆయుర్వేద ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి ఎగ్జిమ్ బ్యాంక్ తో కలిసి పరిశ్రమలకు పారస్పరిక వెబినార్లను నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
వివిధ రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కోవిడ్ -19 మహమ్మారికి ఆయుర్వేద అన్న అంశంతో వెబినార్లు, రేడియో ప్రసంగాలు, క్విజ్‌లు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారానికి ఎలక్ర్టానిక్, ప్రింట్ మీడియాలలో ప్రచారం కల్పించడం, ఆయుర్వేద కళాశాలలు, ఆయుర్వేద మందుల తయారీ సంస్థలు, ఆయుర్వేద ప్రాక్టిషనర్స్ అసోసియేషన్్స, జాతీయ ఆరోగ్య మిషన్ / జాతీయ ఆయుష్ మిషన్ కింద ఉన్న రాష్ట్ర పిఎంయులలను, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వంటివాటిని వివిధ కార్యకలాపాల కోసం కలుపుకోవడం గురించి కూడా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
మానవాళికి సహజ ఆరోగ్య సంరక్షణ సంప్రదాయమైన ఆయుర్వేదం కేవలం వైద్య వ్యవస్థే కాదు, ప్రకృతితో మన సహజీవన సంబంధం అభివ్యక్తి కూడా. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి చక్కగా గ్రంథస్థం చేసిన వ్యవస్థ. వ్యాధిని నిరోధించడం, ఆరోగ్యాన్ని పెంపొందించడం అన్న రెండు అంశాలకూ సమాన ప్రాధాన్యత ఇచ్చిన వ్యవస్థ ఇది.
***
(Release ID: 1664879)
Visitor Counter : 267