రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా జెనెరిక్ ఔషధాల తయారీదారులు, ఎగుమతి చేసే దేశాలలో భారతదేశం ఒకటి: శ్రీ డివి సదానంద గౌడ

భారతదేశంలో కెమికల్స్ , పెట్రోకెమికల్స్ రంగం మార్కెట్ పరిమాణం సుమారు 165 బిలియన్ డాలర్లు; 2025 నాటికి 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా: శ్రీ డివి సదానంద గౌడ

Posted On: 15 OCT 2020 10:14AM by PIB Hyderabad

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా జెనెరిక్ ఔషధాల తయారీదారులు, ఎగుమతి చేసే దేశాలలో భారతదేశం ఒకటని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి  శ్రీ డివి సదానంద గౌడ తెలిపారు. ప్రారంభ దశలో, అత్యవసర సందర్భాల్లో కోవిడ్ -19 చికిత్స ప్రోటోకాల్ కింద ఉన్న మందులలో హెచ్‌సిక్యూ, అజిత్రోమైసిన్ ఒకటిగా గుర్తించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలకు ఈ మందులను సరఫరా చేస్తున్న దేశంగా భారత్ ను గుర్తించాయని, తద్వారా భారతదేశం ఔషధాల నమ్మకమైన సరఫరాదారుగా భారత్ ఖ్యాతిని సంపాదించిందని చెప్పారు.  

 

అమెరికా వెలుపల అత్యధిక సంఖ్యలో యుఎస్-ఎఫ్డిఎ కంప్లైంట్ ఫార్మా ప్లాంట్లు (ఎపిఐలతో సహా 262 కన్నా ఎక్కువ) ఉన్న ఏకైక దేశం భారతదేశం అని శ్రీ గౌడ తెలియజేశారు. యుఎస్ మరియు యూరప్ వంటి దేశాలను అనుసరించే ఉన్నత ప్రమాణాలతో సహా వివిధ దేశాలకు 20 బిలియన్ డాలర్ల  విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేశామని చెప్పారు. 

 

నిన్న సాయంత్రం ఫిక్కీ నిర్వహించిన లీడ్స్ 2020 సందర్భంగా 'రీఇమాజినింగ్ డిస్టెన్స్‌'పై లాటిన్ అమెరికా & కరేబియన్ సెషన్‌లో వర్చువల్ గా  ప్రసంగించిన శ్రీ గౌడ, 2024 నాటికి భారత ఫార్మా రంగం 65 బిలియన్ డాలర్ల పరిశ్రమకు ఎదగగలదని అన్నారు. "మేము ఇటీవల ఏడు మెగా పార్కులు-మూడు బల్క్ డ్రగ్ పార్కులు మరియు నాలుగు మెడికల్ డివైస్ పార్కులు  అభివృద్ధి కోసం పథకాలను ప్రారంభించాము . కొత్త తయారీదారులు ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకానికి అర్హులు, దీని కింద వారు మొదటి 5-6 సంవత్సరాలు అమ్మకాల ఆధారంగా ఆర్థిక ప్రోత్సాహకాలకు అర్హులు, " అని శ్రీ గౌడ వివరించారు.

పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం అని, ఫార్మా రంగంలో భారతదేశంలో ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. "జాయింట్ వెంచర్స్ ద్వారా కూడా ఇండియా మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. ఫార్మా రంగానికి సంబంధించినంతవరకు మీరు భారతదేశం ద్వారా దేశీయ భారతీయ మార్కెట్, యుఎస్, జపాన్, ఇయు మరియు సౌత్ ఈస్ట్ ఆసియా వంటి పెద్ద మార్కెట్లకు ప్రవేశం పొందవచ్చు. ఏదైనా సంస్థ వారు భారతీయ ఫార్మా రంగంపై ఆసక్తి కలిగి ఉంటే,నా కార్యాలయం సంప్రదించవచ్చు, మేము అన్ని సౌకర్యాలు  కల్పిస్తాము, చేదోడుగా ఉంటాము  "అని ఆయన  స్పష్టం చేశారు

భారతదేశంలో కెమికల్స్ & పెట్రోకెమికల్స్ రంగం మార్కెట్ పరిమాణం సుమారు 165 బిలియన్ డాలర్లు అని శ్రీ గౌడ అన్నారు. 2025 నాటికి ఈ పరిమాణం 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఇది రసాయన రంగ భారతదేశంలో భారీ అవకాశాన్ని అందిస్తుంది. ఉదాహరణకు, పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశానికి 2025 నాటికి 5 క్రాకర్లు మరియు 2040 నాటికి అదనంగా 14 క్రాకర్లు అవసరం. ఈ క్రాకర్స్‌కు మాత్రమే 65 బిలియన్ డాలర్ల సంచిత పెట్టుబడి అవసరం. విదేశీ భాగస్వామ్యాన్ని ఆకర్షించడానికి, భారత ప్రభుత్వం రసాయన మరియు పెట్రోకెమికల్ రంగానికి సంబంధించిన విధానాలను పునః సమీక్షిస్తోంది అని ఆయన తెలిపారు. 

భారతదేశంలో ఎరువుల రంగం కూడా ఆకర్షణీయమైన రంగమని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం మా రైతులు ఎరువుల కోసం భారీ డిమాండ్ ఉంది. ఎరువుల అవసరాలను తీర్చడానికి దేశీయ ఉత్పత్తి సరిపోదు. మేము యూరియా, & పి & కె ఎరువుల పెద్ద దిగుమతిదారులం. ఉదాహరణకు, 2018-19లో భారతదేశం 7.5 మిలియన్ టన్నుల యూరియాను, 6.6 మిలియన్ టన్నుల డిఎపి, 3 మిలియన్ టన్నుల ఎంఓపిని, 0.5 మిలియన్ టన్నుల ఎన్‌పికె ఎరువులను దిగుమతి చేసుకుంది.

"లాటిన్ అమెరికన్ మరియు కరేబియన్ దేశాలు కూడా రసాయన ఎరువుల నికర దిగుమతిదారులు అని నాకున్న సమాచారం. కొనుగోలుదారులుగా మార్కెట్లో పోటీ పడటానికి బదులుగా, సరఫరా గొలుసులను మరింత సమర్థవంతంగా చేయడానికి మేము సహకరించాలి, తద్వారా పోటీ ధరలకు తగిన పరిమాణాన్ని పొందవచ్చు." అని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రత్యామ్నాయ ఎరువుల అభివృద్ధికి సహకారం అవసరమని శ్రీ గౌడ స్పష్టం చేశారు. ఉదాహరణకు నానో ఎరువులు, ఇవి ఎరువులకు సంబంధించిన మన అవసరాన్ని / వాడకాన్ని తగ్గించగలదు, అందువల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. ప్రత్యామ్నాయ ఎరువుల అభివృద్ధి కోసం ఉమ్మడి ఆర్ ‌అండ్‌ డి సహకారం కోసం నా ప్రతిపాదనపై ఏవైనా అభిప్రాయాలను నేను స్వాగతిస్తాను. అని శ్రీ గౌడ తెలిపారు. 

****



(Release ID: 1664739) Visitor Counter : 207