యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

పారా ఆర్చ‌ర్ అంకిత్‌కు కోవిడ్ పాజిటివ్

- సోనేప‌ట్‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించిన శాయి అధికారులు

Posted On: 14 OCT 2020 6:10PM by PIB Hyderabad

సోనేప‌ట్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయి) ఎన్ఆర్‌సీ జాతీయ శిబిరంలో పాల్గొంటున్న పారా-ఆర్చర్ అంకిత్‌కు కోవిడ్-19 వైర‌స్ సోకింది. శిబిరంలో ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు కోవిడ్‌-19 నిర్ధార‌ణ అయింది. మేటి చికిత్స మరియు అతని ప్రాణాధారాలను అతి దగ్గరగా పర్యవేక్షించడానికి గాను అధికారులు అంకిత్‌ను బుధవారం సోనేపట్లోని భగవాన్ దాస్ ఆసుపత్రికి తరలించారు. పారా-ఆర్చరీ శిబిరం సోనేప‌ట్‌లో అక్టోబర్ 5న ప్రారంభమైంది. ఎనిమిది మంది ఆర్చర్లతో సహా శిబిరంలోని వారు కోవిడ్ ఆర్టీ-పీసీఆర్ పరీక్షల నెగ‌టీవ్ నివేదికలను సమర్పించిన తరువాత శిబిరానికి రిపోర్టు చేశారు. శిబిరం కోసం ఏర్పాటు చేసిన ఎస్ఓపీల నిబంధ‌న‌ల‌ ప్రకారం శిబిరంలో ఉన్న వారి నుంచి ఈ నెల‌ 12న న‌మూనాల‌ను సేక‌రించి కోవిడ్ నిర్ధార‌ణపు ప‌రీక్ష‌ల్ని నిర్వ‌‌హించారు. ఈ ప‌రీక్ష‌ల‌లో అంకిత్‌కు కోవిడ్ సోకిన‌ట్టుగా నిర్ధార‌ణ అయింది.
ఆసుపత్రికి తరలించే ముందు అతన్ని శాయి ఎన్‌ఆర్‌సీ సోనేపట్‌లోని వైద్య కేంద్రం పైన ఏర్పాటు చేసిన‌ ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
                           

*******

 (Release ID: 1664582) Visitor Counter : 198