PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 09 OCT 2020 6:28PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహాపీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 

  • దేశంలో నెల తర్వాత తొలిసారి 9 ల‌క్ష‌లక‌న్నా దిగువ‌కు చికిత్స పొందే కేసుల సంఖ్య.
  • వరుసగా మూడోవారం కూడా కొత్త కేసులను అధిగమించిన కోలుకునే కేసుల సంఖ్య.
  • గత 24 గంటల్లో 78,365 మందికి వ్యాధినయం; నమోదైన తాజా కేసులు 70, 496.
  • కోలుకునేవారి సగటు మరింత మెరుగుపడి 85.52 శాతానికి చేరిక.
  • కోవిడ్‌ అనంతర కాలంలో సంకల్పబలం చూపడమేగాక రకరకాల సమస్యలను అధిగమించే పరిష్కారాలు చూపిన దేశంగా ఆవిర్భవించిన భారత్‌: ప్రధానమంత్రి సహర్ష ప్రకటన.

Image

స్థిరమైన తగ్గుదల దిశ‌గా చికిత్సపొందే కోవిడ్ బాధితుల సంఖ్య‌; నెల తర్వాత తొలిసారి 9ల‌క్ష‌లక‌న్నా దిగువ‌కు ఆస్ప‌త్రుల్లోని కేసులు; 3 వారాలుగా కొత్త కేసులకన్నా కోలుకునేవే  అధికం

దేశవ్యాప్తంగా చికిత్సలోగల కోవిడ్ బాధితుల సంఖ్య బాగా తగ్గుతోంది. ఈ మేరకు నెల తర్వాత తొలిసారిగా ఆస్పత్రులలోని రోగుల సంఖ్య 9 లక్షలకన్నా దిగువకు పడిపోయింది. ఈ మేరకు సెప్టెంబరు 9వ తేదీన 8.97 లక్షల కేసులు నమోదవగా, సరిగ్గా నెల తర్వాత ఇవాళ ఆ సంఖ్య 8.93 లక్షలకు తగ్గింది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 8,93,952 కాగా- మొత్తం కేసులలో ఇది 12.94 శాతం మాత్రమే. దేశంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 59,06,069గా నమోదైంది. ఆ మేరకు కోలుకున్న, చికిత్సలోగల కేసుల అంతరం 50,12,477గా ఉంది. కోలుకునేవారి సంఖ్య పెరిగేకొద్దీ, జాతీయ సగటు 85.52 శాతానికి దూసుకెళ్లింది. గత 24 గంటల్లో 78,365 మంది కోలుకోగా, 70,496 కొత్త కేసులు నమోదయ్యాయి. కోలుకున్న  తాజా కేసులలో 75 శాతం 10 రాష్ట్రాల్లోనివి కాగా- మహారాష్ట, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో ఒక్క మహారాష్టలోనే ఒకేరోజు 15,000 మంది కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో నమోదైన 70,496 కొత్త కేసులకుగాను 78 శాతం 10 రాష్ట్రాల్లోనివి కాగా- ఇందులోనూ 13,000 కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. అటుపైన 10,000 కేసులతో కర్ణాటక రెండోస్థానంలో ఉంది. గత 24 గంటలలో సంభవించిన 964 మరణాలకుగాను దాదాపు 82 శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనివే కాగా- 37 శాతానికిపైగా (358) మహారాష్ట్రలో నమోదయ్యాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663066

 ‘భారత విదేశాంగ సేవ’ దినోత్సవం సందర్భంగా ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

‘భారత విదేశాంగ సేవ’ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఐఎఫ్‌ఎస్‌ (IFS) అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. “ఐఎఫ్‌ఎస్‌ దినోత్సవం సందర్భంగా భారత విదేశాంగ సేవ అధికారులందరికీ నా శుభాభినందనలు. మాతృభూమికి సేవలో భాగంగా జాతీయ ప్రయోజనాలను అంతర్జాతీయంగా మీరు ముందుకు తీసుకెళ్తున్న తీరు ప్రశంసనీయం. వందేభారత్‌ మిషన్‌ సందర్భంగా వారి కృషి, కోవిడ్‌ సంబంధిత అంశాల్లో ప్రవాస భారతీయులకేగాక విదేశీ పౌరులకూ వారు విశేష సహాయం అందించారు” అని ఆయన ‘ట్విట్టర్‌’ద్వారా కొనియాడారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662996

 

అక్టోబరు 11న నిర్వహించే వినూత్న కార్యక్రమంలో భాగంగా ‘స్వామిత్వ’ పథకం కింద ఆస్తి కార్డుల పంపిణీని ప్రారంభించనున్న ప్రధానమంత్రి

పరివర్తనాత్మక గ్రామీణ భారతం, లక్షలాది భారతీయులకు సాధికారత కల్పన దిశగా చేపట్టిన చారిత్రక చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 11న ‘స్వామిత్వ’ పథకం కింద ఆస్తి కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రారంభిస్తారు. తద్వారా సుమారు లక్షమంది ఆస్తి హక్కుదారులు తమ ఫోన్లకు అందే ఎస్‌ఎంఎస్‌ లింకుద్వారా ఆస్తికార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అనంతరం దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు హక్కుదారులకు ఆస్తికార్డులను నేరుగా పంపిణీ చేస్తాయి. ఈ కార్డుల ద్వారా గ్రామీణులు రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ఆస్తిని హామీగా ఉంచే వీలు కలుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి కొందరు లబ్ధిదారులతో సంభాషిస్తారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663164

కెనడాలో ‘ఇన్వెస్ట్‌ ఇండియా' సదస్సు; కీలకోపన్యాసం చేసిన ప్రధానమంత్రి

కెనడాలో నిర్వహించిన ‘ఇన్వెస్ట్‌ ఇండియా’ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా కీలకోపన్యాసం చేశారు. రాజకీయ స్థిరత్వం, పెట్టుబడి-వ్యాపార స్నేహపూర్వక విధానాలు, పాలనలో పారదర్శకత, నిపుణ-ప్రతిభావంతుల శక్తివంటి  పెట్టుబడి పారామితులను ప్రపంచంతో పంచుకుటున్న ఏకైక వివాదరహిత దేశం భారత్‌ మాత్రమేనని ఈ సందర్భంగా ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సంస్థాగత పెట్టుబడిదారులు, తయారీదారులు, పర్యావరణ ఆవిష్కరణ వ్యవస్థల మద్దతుదారులు, మౌలిక వసతుల కల్పన సంస్థలుసహా ప్రతి ఒక్కరికీ భారత్‌లో అవకాశాలు అపారమని ఆయన చెప్పారు. కోవిడ్ అనంతర కాలంలో సంకల్పబలం చూపడమేగాక రకరకాల సమస్యలను అధిగమించే పరిష్కారాలు చూపిన దేశంగా భారత్‌ ఆవిర్భవించిందని స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662930

కెనడాలో ‘ఇన్వెస్ట్‌ ఇండియా' సదస్సు; ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662931

రాజకీయ పార్టీల నమోదులో బహిరంగ నోటీసు అనంతరం వ్యవధిని సడలించిన భారత ఎన్నికల సంఘం

దేశంలో రాజకీయ పార్టీల నమోదుకు సంబంధించి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) బహిరంగ నోటీసు అనంతర వ్యవధిని సడలించింది. ఈ మేరకు 07.10.2020కి ముందు బహిరంగ నోటీసు ప్రకటించిన పార్టీలకు నమోదు వ్యవధిని 30 రోజుల నుంచి 7 రోజులకు తగ్గించింది. తదనుగుణంగా పై తేదీకి ముందు 7 రోజుల్లోపు బహిరంగ నోటీసు ప్రకటించిన పార్టీలుసహా ఇతర పార్టీలకు ఏవైనా అభ్యంతరాలుంటే 2020 అక్టోబరు 10వ తేదీ సాయంత్రం 5.30 గంటల్లోపు లేదా ఇచ్చిన వాస్తవ గడువు 30 రోజుల్లోగా- ఏది ముందైతే దాని ప్రకారం సమర్పించాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662625

శిక్షణ ఏర్పాట్లపై భారత విలువిద్య క్రీడాకారుల సంతృప్తి; దిగ్బంధం అనంతర శిక్షణ ప్రారంభంతో త్వరలోనే పుంజుకునేందుకు ఉద్యుక్తం

భారత ఒలింపిక్‌ క్రీడాకారులకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ దేశంలోని  క్రీడా సదుపాయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దిగ్బంధం ఫలితంగా శిక్షణ సదుపాయాలు మూతపడిన తర్వాత చాలాకాలానికి పునఃప్రారంభం కాగా, శిక్షణకు దూరంగా ఉన్న క్రీడాకారులంతా తిరిగి వచ్చారు. ఇందులో భాగంగా భారత మహిళా-పురుష విలువిద్య క్రీడాకారులు పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్  ఇన్‌స్టిట్యూట్‌లో ఆగస్టు 25 నుంచి శిక్షణ పొందుతున్నారు. తిరిగి శిక్షణ ప్రారంభం కావడంపై వారంతా హర్షం వ్యక్తంచేస్తూ త్వరలోనే తమ పూర్వస్థాయిని అందుకోగలమని ఆశిస్తున్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663208

దేశంలో 2020-21 తొలి 6 నెలల్లో 3951 కి.మీ. రోడ్లను నిర్మించిన ఎంవోఆర్డీహెచ్‌; కోవిడ్‌-19 ఇబ్బందులున్నా రోజుకు 21.60 కి.మీ. ప్రగతి సాధన

ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-సెప్టెంబర్) తొలి 6 నెలల్లో 3951 కిలోమీటర్ల పొడవైన రహదారుల నిర్మాణాన్ని కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వశాఖ (MoRTH) విజయవంతంగా పూర్తిచేసింది. కోవిడ్‌-19 ఇబ్బందులున్నప్పటికీ రోజుకు 21.60 కిలోమీటర్ల నిర్మాణ ప్రగతిని సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 11,000 కిలోమీటర్ల పొడవైన రహదారుల నిర్మాణం పూర్తిచేయాలని మంత్రిత్వ శాఖ నిర్దేశించుకుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663088

లేబర్ బ్యూరో సర్వేలపై నిపుణుల బృందం తొలి సమావేశంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి ప్రసంగం

కేంద్ర కార్మిక-ఉపాధిశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ నిన్న లేబర్ బ్యూరో సర్వేలపై నిపుణుల బృందం తొలి సమావేశంలో ప్రసంగించారు. ప్రముఖ ఆర్థిక, గణాంకవేత్తలుసహా ప్రభుత్వ అధికారులు తదితరలు ఈ నిపుణుల బృందంలో సభ్యులుగా ఉన్నారు. కోవిడ్‌ మహమ్మారి కాలంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ సందర్భంగా మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన విశ్వసనీయ సమాచార నిధి అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. వారి స్థితిగతుల మెరుగు, ఉపాధి అవకాశాల కల్పన ప్రణాళికలు, ఆచరణాత్మక పరిష్కారాల రూపకల్పనకు ఈ సమాచార నిధి వీలు కల్పిస్తుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663287

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • కేరళ: రాష్ట్రంలో కోవిడ్-19 నిర్ధారిత కేసుల సగటు 14 శాతం నుంచి ఒక్కసారిగా 8 శాతానికి దిగిరావడం రాష్ట్ర ఆరోగ్య రంగంలో చర్చకు దారితీసింది. అయితే, కోవిడ్ బారినపడిన వ్యక్తులపై ఒక వారం పరిశీలించాకే ఏదైనా నిర్ణయానికి రాగలమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సుదీర్ఘకాలం అధికంగా నమోదవుతూ వచ్చిన కేసుల సగటు అకస్మాత్తుగా పడిపోవడానికి అంత ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఏదో ఒకరోజుకు పరిమితమైన పరిణామం కావచ్చునని పేర్కొంది. ఏదేమైనా కేసుల నమోదు సగటున 10 శాతంకన్నా దిగువన ఉంచాలని అన్ని జిల్లాలకూ ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో ఇవాళ ముగ్గురు మరణించడంతో మృతుల సంఖ్య 933కు చేరింది. కేరళలో నిన్న 10,000 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో ఇవాళ 5445 తాజా కేసులతోపాటు 7003 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90,579 మంది చికిత్స పొందుతుండగా 2.71 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి కారణంగా పరిశ్రమల మూసివేతతో తమిళనాడునుంచి వెళ్లిపోయిన దాదాపు 2 లక్షలమంది వలస కార్మికులలో 47,000 మంది నెల వ్యవధిలో కోయంబత్తూరు జిల్లాకు తిరిగివచ్చారు. కాగా, కోవిడ్-19 వ్యాప్తి కారణంగా సేలంలోని బేలూర్ గ్రామంలో ప్రజలు గురువారం స్వీయ దిగ్బంధం ప్రకటించారు.
  • కర్ణాటక: రాష్ట్ర రాజధాని పరిధిలోని బెంగుళూరు అర్బన్ ప్రాంతంలో నిన్న ఒకేరోజు అత్యధికంగా 5121 కేసులు నమోదయ్యాయి. కాగా, కర్ణాటకలోని 12 జిల్లాల్లో క్రియాశీల కేసులు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇతర జిల్లాల్లోనూ పెరుగుతూనే ఉన్నాయి. కాగా, కోవిడ్‌ పరిస్థితి అదుపులోకి వచ్చేదాకా పాఠశాలలు తెరవకుండా చూడాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎస్.సురేష్ కుమార్కు లేఖ రాశారు. మరోవైపు కోవిడ్ కారణంగా ఈ విద్యా సంవత్సరంలో ఎటువంటి పరీక్షలు నిర్వహించరాదని సిఫారసు చేస్తూ కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ ప్రాథమిక విద్యాశాఖకు లేఖ రాసింది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం దిశగా ‘మాస్కు ధారణ, భౌతిక దూరం అనుసరణ, చేతి పరిశుభ్రత పాటించడం’ అనే మూడు ముఖ్యసందేశాల వ్యాప్తి లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన పలు కార్యాలయాలు ఇవాళ ప్రతినబూనాయి. కోవిడ్ ద్వితీయ విజృంభణ ముప్పు ఉన్నందున ప్రజల ప్రాణరక్షణ లక్ష్యంగా నివారణ చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఒక ప్రకటనలో నొక్కి చెప్పారు. తిరుపతికి చెందిన అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఒకటిన్నర నెల వ్యవధిలో రెండోసారి కరోనా వైరస్ సోకింది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1891 కొత్త కేసులు, 7 మరణాలు నమోదవగా 1878 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 285 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసులు: 2,08,535; క్రియాశీల కేసులు: 26,374; మరణాలు: 1208; డిశ్చార్జి: 1,80,953గా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో అవయవ మార్పించి ఉచితంగా చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సదరు చికిత్సలు ఇకపై ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకం పరిధిలోకి వస్తాయి.
  • మహారాష్ట్ర: ముంబై మహానగరంలో గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా నియంత్రణ మండళ్లను గుర్తించేందుకు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ వినూత్నరీతలో గూగుల్‌ సంస్థతో జట్టుకట్టింది. తద్వారా గూగుల్ మ్యాప్స్లో ఈ సమాచారం ముంబై పౌరులకు ఒక్క క్లిక్తో అందుబాటులోకి వస్తుంది. కోవిడ్-19పై అవగాహన ప్రచారం ‘ప్రజా ఉద్యమంగా రూపొందుతున్న నేపథ్యంలో ప్రాచీన నలుపు/పసుపు రంగ టాక్సీల డ్రైవర్లు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారు. ఈ మేరకు కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి చేయాల్సిన, చేయకూడని వాటిగురించి ప్రజలకు తెలిసేలా సమాచార కరపత్రాలను తమ టాక్సీలలో అతికించారు.
  • గుజరాత్: రాష్ట్రంలో రాపిడ్ యాంటీబాడీ పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ ప్రయోగశాలలను అనుమతిస్తున్నట్లు గుజరాత్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. దీని ప్రకారం- జిల్లాల్లో లేదా పురపాలికలలోని ముఖ్య ఆరోగ్య అధికారులు కొన్ని షరతులకు లోబడి ప్రైవేట్ ప్రయోగశాలలకు అనుమతి ఇస్తారు. అలాగే ఎలిసా, సీఎల్ఐఏ యాంటీబాడీ పరీక్షల నిర్వహణకూ ప్రైవేట్ ప్రయోగశాలలను అనుమతించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 16,487 యాక్టివ్ కేసులున్నాయి.
  • మధ్యప్రదేశ్: కేంద్ర హోం మంత్రిత్వశాఖ జారీ చేసిన తాజా కోవిడ్‌-19 మార్గదర్శకాల ప్రకారం- మధ్యప్రదేశ్‌లో రాజకీయ సభలకు 100 మందికిపైగా హాజరుకారాదన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. అయితే, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారు తగురీతిలో భౌతిక దూరం పాటించేలా చూడాలని స్పష్టం చేసింది.
  • ఛత్తీస్‌గఢ్‌: ఇతర రాష్ట్రాలనుంచి ఛత్తీస్‌గఢ్‌ వచ్చేవారికి తప్పనిసరి నిర్బంధవైద్య పర్యవేక్షణ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అలాగే రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు తెరవకూడదని కూడా నిర్ణయించింది. గురువారంనాటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. మరోవైపు ఛత్తీస్గఢ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా నవంబర్ 1న నిర్వహించే ప్రధాన కార్యక్రమాన్ని ఈసారి నిర్వహించరాదని నిర్ణయించింది.
  • అసోం: రాష్ట్రంలో నిన్న 1188 కొత్త కేసులు నమోదవగా, 2198 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. అసోంలో మొత్తం కేసులు 1,91,397 కాగా, క్రియాశీల 30,767, మరణాలు 794గా ఉన్నాయి.
  • మేఘాలయ: రాష్ట్రంలో ప్రస్తుతం 2369 క్రియాశీల కేసులుండగా, 4832 మంది కోలుకున్నారు.
  • నాగాలాండ్: నాగాలాండ్లో ఇవాళ 21 మందికి కోవిడ్‌-19 నిర్ధారణ అయింది.

FACT CHECK

****

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



(Release ID: 1663292) Visitor Counter : 228