యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
శిక్షణా ఏర్పాట్లతో సంతృప్తి
శిక్షణ ప్రారంభించిన భారత విలువిద్య క్రీడాకారులు
గతిని అందుకోవడానికి సిద్ధం
Posted On:
09 OCT 2020 3:22PM by PIB Hyderabad
కరోనా జోరుతగ్గడంతో దేశవ్యాపితంగా క్రీడా సౌకర్యాలు తెరుచుకొంటున్నాయి. కరోనా వైరస్ వల్ల శిక్షణకు దూరంగా ఉన్నక్రీడాకారులు తిరిగి శిక్షణా కేంద్రాలకు చేరి తమ నైపుణ్యాలకు మెరుగు పెట్టుకొంటున్నారు. శిక్షణ కేంద్రాలు మూత పడదంతో ముఖ్యంగా ఒలంపిక్ క్రీడలలో పతాకాలపై దృష్టి పెట్టిన క్రీడాకారులు కొంత నిరాశకు గురిఅయ్యారు. అయితే, తిరిగి శిక్షణా కేంద్రాలు అందుబాటులోకి రావడంతో వీరు ఉత్సాహంగా మైదానంలోకి దిగుతున్నారు. ఒలంపిక్ క్రీడల్లో పతకాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్న భారత మహిళలు, పురుషుల విలువిద్య క్రీడాకారులకు పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందుతున్నారు.ఆగస్టు 25 వ తేదీన ఈ శిక్షణా శిబిరం ప్రారంభం అయ్యింది. తిరిగి శిక్షణ ప్రారంకావడంతో ఈ శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
" కరోనా ప్రారంభంకాక ముందు మేము మార్చి వరకు కఠోరంగా శిక్షణ పొందాము. కరోనా ప్రారంభం కావడంతో శిక్షణకు అంతరాయం కలిగింది. విరామం తరువాత తిరిగి శిక్షణలో పాల్గొంటున్నాం. ఇంతవరకు శిక్షణలో ఇంత విరామం ఎప్పుడూ రాలేదు. విరామం తరువాత ప్రారంభం అయిన శిక్షణలో తొలి రెండు రోజుల్లో కొంత ఇబ్బందిగా అనిపించింది. అయితే ఇప్పుడు శిక్షణలో ఎలాంటి ఇబ్బందులు లేవు" అని అర్జున అవార్డు గ్రహీత అత్తను దాస్ వివరించారు.
ప్రస్తుతం శిక్షణా శిబిరం ప్రాధమిక దశలోనే ఉంది. క్వారంటైన్ నుంచి బయటకు వస్తున్న క్రీడాకారులు శిక్షణా కేంద్రానికి చేరుకొంటున్నారని కోచ్ మాఝి సవైయన్ తెలిపారు. ప్రస్తుతానికి శారీరక దృఢత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. " క్వారంటైన్ నుంచి వస్తున్న క్రీడాకారులు శిభిరంలో చేరుతున్నారు. క్రీడాకారులు సహనంతో బలంగా ఎలా ఉండాలి అన్న అంశాలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నాం. మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడాకారులు యోగా మరియు ధ్యానం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు." అని కోచ్ మాఝి సవైయన్ వివరించారు.
కరోనా వైరస్ సోకకుండా చూడడానికి ఎఎస్ఐ అమలు చేస్తున్న చర్యలు, తీసుకొంటున్న ముందు జాగ్రత్త చర్యలపట్ల క్రీడాకారులు సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణా కేంద్ర ప్రాంగణం అత్యంత సురక్షితంగా ఉందని గత ప్రపంచ నెంబర్ వన్ విలువిద్య క్రీడాకారిణి దీపికా కుమారి అన్నారు. " ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి. శిక్షణా కేంద్రం పరిశుభ్రంగా ఉంది. వసతి భోజన ఏర్పాట్లు బాగున్నాయి. మాకు అవసరమైన ఏర్పాట్లు చేసి మేము శిక్షణపై దృష్టి సారించడానికి అనువైన సౌకర్యాలు కల్పించారు " అని దీపికా కుమారి వివరించారు.
విలువిద్య క్రీడాకారుల ప్రతిభపై వారి మానసిక దృఢత్వం ప్రభావం చూపుతుంది. కరోనా తరువాత అమలు జరుగుతున్న నూతన విధానాలకు అలవాటు పడడం కొంత ఇబ్బందికర సమస్యగా ఉంటుంది. అయితే తమ నైపుణ్యాలకు ఇవి పెద్దగా ఆటంకం కలిగించవన్న ధీమాతో విలువిద్య క్రీడాకారులు ఉన్నారు. కొన్ని నెలలపాటు సాధన చేస్తే తమ పూర్వపు లయని అందుకోగలమన్న ఆశాభావంతో క్రీడాకారులు ఉన్నారు.
2020 ఆగస్టులో జరగనుకున్న ఒలంపిక్ క్రీడల్లో భారత పురుషుల విలువిద్య జట్టుతోపాటు దీపిక అర్హత సాధించారు. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ అర్హత పోటీల్లో చూపే ప్రతిభపై మహిళల జట్టు భవిషత్తు ఆధారపడి ఉంటుంది.
***
(Release ID: 1663208)
Visitor Counter : 179