ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

తగ్గుదలబాటలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితులు

నెలరోజుల తరువాత మొదటి సారిగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య 9 లక్షల లోపు

కొత్తగా వస్తున్న కేసులకంటే కోలుకుంటున్నవారే మూడు వారాలుగా అధికం

Posted On: 09 OCT 2020 11:12AM by PIB Hyderabad

చికిత్స పొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య దేశవ్యాప్తంగా బాగా తగ్గుతో వస్తోంది. నెలరోజుల తరువాత మొట్టమొదటి సారిగా 9 లక్షలకంటే తక్కువ స్థాయికి పడిపోయింది. 9న 8.97 లక్షల కేసులు నమోదు కాగా ఈ రోజు ఆ సంఖ్య 8.93 లక్షలకు తగ్గింది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 8,93, 952 గా నమోదైంది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 12.94% మాత్రమే.

WhatsApp Image 2020-10-09 at 10.16.49 AM.jpeg

కోలుకుంటున్నవారి శాతం పెరుగుతున్నకొద్దీ చికిత్సలో ఉన్నవారి శాతం బాగా తగ్గుతూ వస్తున్నది. ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 59,06,069 మందిగా నమోదైంది. కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా 50 లక్షలు దాటింది. కచ్చితంగా చెప్పాలంటే 50,12, 477 మంది. కోలుకుంటున్నవారు పెరిగేకొద్దీ, ఈ తేడా కూడా పెరుగ్గుతూ వస్తోంది. కోలుకుంటున్నవారి సంఖ్య పెరిగేకొద్దీ, జాతీయస్థాయిలో కోలుకుంటున్నవారి శాతం కూడా పెరుగూ వస్తోంది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం85.52% అయింది. గడిచిన 24 గంటల్లో 78.365 మంది కోలుకున్నారు.కొత్తగా నమోదైన కేసులు 70,496 ఉన్నాయి.

కొత్తగా వస్తున్న కేసులకంటే కొత్తగా కోలుకుంటున్నవారి సంఖ్య వరుసగా మూడు వారాలుగా పెరుగుతూనే ఉంది. మూడువారాలౌలుగా నమోదవుతున్న కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నాయి.రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వసహకారంతో  సాగిస్తున్న కృషిఫలితంగా, ఆస్పత్రులు నాణ్యమైన సేవలందిస్తూ ప్రామాణిక విధానాలు పాటించటం వల్లనే ఇది సాధ్యమైంది.

 

Image

కొత్త కేసులలో 75% మేరకు 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. వాటిలో మహారాష్ట, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఉన్నాయి. మహారాష్ట ఒక్కటే గరిష్ఠంగా ఒక్క రోజులో 15,000 కేసులు నమోదు చేసింది.

 

WhatsApp Image 2020-10-09 at 10.16.43 AM.jpeg

70,496 కొత్తకేసులు గత 24 గంటలలో నమోదయ్యాయి. కొత్త కెసులలో 78% 10 రాష్ట్రాలనుంచే నమోదు కాగా ఇందులో కూడా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 13,000 కేసులు నమోదయ్యాయ్తి. ఆ తరువాత స్థానం 10,000 కేసులతో కర్నాటక నమోదు చేసుకుంది.   

WhatsApp Image 2020-10-09 at 10.16.42 AM.jpeg

గడిచిన 24 గంటలలో 964 మరణాలు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 82% కేవలం పది రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. 37% పైగా కొత్త మరణాలు (358 మంది)  మహారాష్ట్రలొ నమోదయ్యాయి.

WhatsApp Image 2020-10-09 at 10.16.41 AM.jpeg

ఎంటర్టైన్మెంట్ పార్కులు, తదితర స్థలాలు తరచూ జనం పెద్ద సంఖ్యలో గుమికూడే ప్రదేశాలు కాబట్టి  అక్కడ కోవిడ్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ఆరోగ్య, క్టుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రామాణిక ఆచరణావిధానాలు రూపొందించ వలసిందిగా కోరింది. ఆ సమాచారం ఈ కింది లింక్ లో చూడవచ్చు.

https://www.mohfw.gov.in/pdf/SOPonpreventivemeasurestobefollowedinEntertainmentParksandsimilarplacestocontainspreadofCOVID19.pdf

****



(Release ID: 1663066) Visitor Counter : 207