వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారత-యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యానికి వాణిజ్య మరియు ఆర్థిక వ్యవస్థలు మూల స్తంభాలని పేర్కొన్న - శ్రీ పియూష్ గోయల్;

యూరోపియన్ యూనియన్ తో కలిసి ఎఫ్.టి.ఏ. వైపు పనిచేయాలని ఆశిస్తున్నాము;

భారతదేశం విశ్వసనీయ భాగస్వామి కావచ్చు మరియు భారతదేశంతో బలమైన మరియు స్థిరమైన అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ కోసం దేశాలు పనిచేయవచ్చు

Posted On: 07 OCT 2020 7:09PM by PIB Hyderabad

భారత-యూరోపియన్ యూనియన్ (ఐ.యు) భాగస్వామ్యానికి వాణిజ్య మరియు ఆర్థిక వ్యవస్థలు మూల స్తంభాలని, కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు.  ఈయూ-ఇండియా సహకార ఆర్థిక వృద్ధి పై దౌత్యపరమైన మరియు పారిశ్రామిక నాయకత్వ సదస్సునుద్దేశించి ఆయన ఈ రోజు ప్రసంగించారు.  ఎఫ్.‌టి.ఎ. వైపు యూరోపియన్ యూనియన్ తో కలిసి పనిచేయాలని ఆశాభావంతో ఉన్నామనీ, వేగవంతమైన ఫలితాలను పొందడానికి ముందస్తు ఫలితాల కోసం బహుశా ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్‌తో ప్రారంభించనున్నామనీ కూడా ఆయన తెలియజేశారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హయాంలో యూరోపియన్ యూనియన్ అంతటా మా సంబంధాలను పెంపొందించుకున్నామని శ్రీ గోయల్ పేర్కొన్నారు.  యూరోపియన్ యూనియన్ తో దౌత్య సంబంధాలను పెంపొందించి, స్నేహ హస్తాన్ని విస్తరించిన మొదటి దేశాలలో భారతదేశం ఒకటి.  "యూరోపియన్ యూనియన్ ప్రజలతో మా స్నేహంతో పాటు, ప్రధానమంత్రి మోదీ మరియు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలకు చెందిన వివిధ నాయకుల మధ్య సంబంధాలు నిజంగా చాలా విశేషమైనవి.  రాజకీయ, ఆవిష్కరణ మరియు సాంస్కృతిక సహకారాలను అధిగమించి, మన భాగస్వామ్యం కొనసాగుతోంది.   ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరులుగా పాల్గొనడానికి సంసిద్ధులమైన మన మిద్దరం చాలా సహజ భాగస్వాములం.  ముఖ్యమైన విషయాలకు పరిష్కారాలను కనుగొనే సమయంలో, యూరోపియన్ యూనియన్ మరియు భారతదేశం రెండూ చాలా ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నాయని మేము నమ్ముతున్నాము.” అని శ్రీ గోయల్ వివరించారు.

యూరోపియన్ యూనియన్ మరియు భారతదేశం ఉపయోగిస్తున్న 3-"ఆర్" విధానాన్ని బలోపేతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు: (రీ-ఎనర్గ జ్) తిరిగి శక్తినివ్వండి, (రీ-ఇన్వెన్ట్) తిరిగి ఆవిష్కరించండి మరియు (రీ-ఓరియంట్) తిరిగి రూపమివ్వండి. ఐరోపా మరియు భారతదేశాల మధ్య వాణిజ్యానికి అడ్డంకులను తొలగించడం ముందుకు సాగడానికి అత్యవసరమని ఆయన అన్నారు.  2019 లో 105 బిలియన్ డాలర్ల సరుకుతో యూరోపియన్ యూనియన్ భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని శ్రీ గోయల్ చెప్పారు.  భారత ఎగుమతులకు ఇది 2వ అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది.  "మేము సమతుల్య, ప్రతిష్టాత్మక మరియు పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం మరియు పెట్టుబడి ఒప్పందాల కోసం పనిచేయాలని మేము నమ్ముతున్నాము.  2020 జూలై నెలలో జరిగిన 15వ భారత-ఈ.యు. శిఖరాగ్ర సమావేశంలో, మేము ఈ.యు.-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్వీకరించాము. ఇది భవిష్యత్తులో మన సహకారానికి మార్గనిర్దేశం చేస్తుంది.”, అని ఆయన చెప్పారు. 

కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి, వివిధ యూరోపియన్ దేశాలకు తగినంత మందుల సరఫరా కోసం లేదా కరోనా వైరస్ తో పోరాడటానికి అవసరమైన ఇతర వస్తువుల కోసం భారతదేశం మరియు యూరప్ కలిసి పనిచేశాయని శ్రీ గోయల్ చెప్పారు.  లాక్ డౌన్ సమయంలో కూడా, మన సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగం ఐరోపాలో వ్యాపారాలకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోంది.  "మేము మా అంతర్జాతీయ బాధ్యతలన్నింటినీ నెరవేర్చాము, అందువల్ల, భారతదేశం యూరోపియన్ యూనియన్ యొక్క విశ్వసనీయ భాగస్వామిగా పరిగణించబడుతోంది. ఒక్క ఆధారంతో ఉన్న సరఫరా వ్యవస్థ నుండి దూరంగా వెళ్ళడానికి భారతదేశం విశ్వసనీయ భాగస్వామి కావచ్చు.  అదేవిధంగా దేశాలు భారతదేశంతో భాగస్వామ్యంతో బలమైన మరియు స్థిరమైన ప్రపంచ సరఫరా వ్యవస్థల కోసం పనిచేయగలవు.  మహమ్మారి సమయంలో కూడా, భారతదేశం తన స్నేహితులెవ్వరినీ, నిరాశపరచలేదు.” అని ఆయన చెప్పారు.

కోవిడ్-19 గురించి, శ్రీ గోయల్ మాట్లాడుతూ, భారతదేశంలో సమస్యను పరిష్కరించడానికి ఇది వచ్చినప్పుడు,  మేము మా ప్రాణాలను కాపాడుకోడానికి లాక్ డౌన్ లోకి వేగంగా వెళ్ళి, కోవిడ్ తో పోరాడటానికి మాకు మేము సిద్ధం చేసుకోగలిగాము, అని వివరించారు.  “మేము జూన్ నుండి అన్ ‌లాక్ ప్రక్రియను ప్రారంభించాము. మేము ప్రాణాలను రక్షించుకోవడం నుండి జీవితాలనూ, జీవనోపాధినీ కాపాడుకునే క్రమంలో, ఎదురైనా పరిస్థితులకు అనుగుణంగా మేము పరిణితి చెందాము. ప్రపంచంలో అత్యధిక రికవరీ రేట్లలో ఒకటి మరియు అతి తక్కువ మరణాల రేటును కలిగి ఉండటంలో దాని ప్రయోజనాలను మనం చూడవచ్చు. ప్రపంచంలో అత్యధిక రికవరీ రేట్లలో ఒకటి మాకు ఉంది.” అని ఆయన తెలియజేశారు. 

మేము ఆర్థిక వ్యవస్థను తెరిచినందున, భారతదేశం వేగంగా తిరగడం, ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించడం, వేగంగా సాధారణ స్థితికి రావడం మనం చూస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల, మేము ఎన్-95 మాస్కులు మరియు వ్యక్తిగత రక్షణ సామగ్రి ఎగుమతులపై అన్ని పరిమితులను తొలగించాము.  వస్తువులు మరియు వాణిజ్య రంగంలో,  గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, సెప్టెంబర్ నెలలో, మేము 5.27 శాతం వృద్ధి సాధించాము.  విద్యుత్ వినియోగం కూడా గత ఏడాదితో పోలిస్తే, 2020 సెప్టెంబర్ నెలలో 4.6 శాతం పెరిగింది.  ప్రపంచ వాణిజ్యంలో కూడా, భారతదేశం ఉనికి గుర్తింపు పొందింది.  సెప్టెంబర్ నెలతో పాటు అక్టోబర్ నెలలో మొదటి ఆరు రోజుల్లో, రైల్వే సరుకు రవాణా గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 15 శాతం మేర పెరిగింది.  భారతీయ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి మాత్రమే కాకుండా, రాబోయే సంవత్సరాల్లో వృద్ధికి సిద్ధంగా ఉందని, ప్రజలకు మరియు పరిశ్రమలకు ఉపశమనం కోసం ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీని అందించారని ఆయన చెప్పారు.  వ్యవసాయం, కార్మిక, రక్షణ, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, గనుల తవ్వకం, ఇంధన రంగాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రారంభించింది.

*****


(Release ID: 1662625) Visitor Counter : 360