ప్రధాన మంత్రి కార్యాలయం
‘స్వామిత్వ’ (ఎస్‌విఎఎమ్ఐటివిఎ) పథకం లో భాగం గా సంపత్తి కార్డుల పంపిణీ అక్టోబర్ 11న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
ఈ చర్య గ్రామీణ భారతదేశం పై ఒక పరివర్తనాత్మక ప్రభావాన్ని కలిగించనుంది.
అంతేకాకుండా, నాలుగేళ్ళ కాలం లో దశలవారీగా 6.62 లక్షల గ్రామాలలో నివాసులకు ఈ పథకం సాధికారత ను కూడా కల్పిస్తుంది
ఇది గ్రామీణులు సంపత్తిని ఒక ఆర్థిక ఆస్తిగా వినియోగించుకొనేందుకు బాట వేయనుంది
Posted On:
09 OCT 2020 1:26PM by PIB Hyderabad
భారతదేశం లోని గ్రామీణ ప్రాంతాల లో నివసిస్తున్న లక్షల కొద్దీ పౌరుల కు సాధికారత కల్పించే చరిత్రాత్మక చర్యలో భాగం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘స్వామిత్వ’ పథకం లో సంపత్తి కార్డుల పంపిణీని ఈ నెల 11న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా సుమారు లక్ష మంది సంపత్తిదారులు వారి సంపత్తి కార్డుల ను వారి మొబైల్ ఫోన్ లలో ఎస్ఎమ్ఎస్ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొనేందుకు అవకాశం లభించనుంది. దీనికి తరువాయిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంపత్తి కార్డుల ను దస్తావేజుల రూపంలో అందజేస్తాయి. ఈ పథకం లబ్ధిదారుల లో ఆరు రాష్ట్రాల లోని 763 గ్రామాల నివాసులు ఉన్నారు. వారిలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 346 గ్రామాల వారు, హరియాణా కు చెందిన 221 గ్రామాల వారు, మహారాష్ట్ర కు చెందిన 100 గ్రామాల వారు, మధ్య ప్రదేశ్ కు చెందిన 44 గ్రామాల వారు, ఉత్తరాఖండ్ కు చెందిన 50 గ్రామాల వారు, కర్నాటక కు చెందిన రెండు గ్రామాల వారు కలసి ఉన్నారు. ఒక మహారాష్ట్ర మినహా, మిగిలిన రాష్ట్రాల లబ్ధిదారులు ఒకే రోజు లో సంపత్తి కార్డుల దస్తావేజుల ను అందుకోనున్నారు. మహారాష్ట్ర లో ప్రాపర్టీ కార్డుదారు వద్ద నుంచి నామమాత్ర ఖర్చును రాబట్టుకొనే వ్యవస్థ కారణంగా దీనికి ఒక నెల రోజుల వ్యవధి పడుతుంది.
ఈ చర్యతో గ్రామస్తులు రుణాలు, ఇతర ఆర్థిక రూపేణా ప్రయోజనాల ను పొందడానికి సంపత్తిని ఒక ఆర్థిక ఆస్తిగా వినియోగించుకొనేందుకు మార్గం అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు, గ్రామ ప్రాంతాల లోని లక్షలాది సంపత్తి యజమానులకు మేలు చేయడం కోసం సాంకేతికత తాలూకు అత్యాధునిక మార్గాన్ని వినియోగించుకొంటూ, ఇంత భారీ ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి కానుంది.
ఈ కార్యక్రమం లో భాగం గా లబ్ధిదారుల లో కొంత మందితో ప్రధాన మంత్రి మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ కేంద్ర మంత్రి హాజరవుతారు. ఈ కార్యక్రమం వచ్చే ఆదివారం ఉదయం 11 గంటలకు మొదలవుతుంది.
‘స్వామిత్వ’ ను గురించి
‘స్వామిత్వ’ అనేది పంచాయతీరాజ్ శాఖ కు చెందిన కేంద్ర రంగ పథకం. దీనిని ప్రధాన మంత్రి ఈ ఏడాది ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు ప్రారంభిస్తారు. ఈ పథకం గ్రామీణ కుటుంబ యజమానులకు ‘హక్కుల రికార్డు’ ను అందించడంతో పాటు, ప్రాపర్టీ కార్డులను జారీ చేయాలన్న లక్ష్యం పెట్టుకుంది.
ఈ పథకాన్ని నాలుగేళ్ళ కాలం లో (2020 నుంచి 2024 మధ్య) దశల వారీగా దేశమంతటా అమలు చేయనున్నారు. దీనితో దేశం లో దాదాపుగా 6.62 లక్షల పల్లెల లో ప్రాపర్టీ కార్డుల ను ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం ప్రయోగాత్మక దశ 2020-21 మధ్య కాలం లో ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్నాటక రాష్ట్రాల తో పాటు, పంజాబ్, రాజస్థాన్ లలోని కొన్ని సరిహద్దు గ్రామాలు కలుపుకొని మొత్తం ఇంచుమించు ఒక లక్ష గ్రామాల లో ఈ కార్డులను ఇస్తారు. అలాగే, పంజాబ్, రాజస్థాన్‌ల లో కంటిన్యూవస్ ఆపరేటింగ్ సిస్టమ్ (సిఒఆర్ఎస్) స్టేషన్ ల నెట్ వర్క్ ను ఏర్పాటుచేస్తారు.
ఈ ఆరు రాష్ట్రాలు పథకం అమలుకు గాను గ్రామీణ ప్రాంతాల లో డ్రోన్ సర్వే నిమిత్తం సర్వే ఆఫ్ ఇండియా తో అవగాహన పూర్వక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ రాష్ట్రాలు డ్రోన్ ఆధారిత సర్వేక్షణ్ ను నిర్వహించవలసిన గ్రామాలను, అలాగే డిజిటల్ మాధ్యమం లో ప్రాపర్టీ కార్డు ఫార్మేట్ ను ఖరారు చేశాయి. భవిష్యత్తు కాలంలో డ్రోన్ లను ఉపయోగించే కార్యకలాపాల లో సహాయం తీసుకొనేందుకు సిఒఆర్ఎస్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడానికి పంజాబ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు సర్వే ఆఫ్ ఇండియా తో ఎంఒయు ను కుదుర్చుకున్నాయి.
సంపత్తి కార్డుల కు వివిధ రాష్ట్రాలు వేరు వేరు పేర్లను పెట్టుకొన్నాయి. ఉదాహరణకు హరియాణా లో ‘టైటిల్ డీడ్’ అనే పేరును పెట్టగా, కర్నాటక లో ‘రూరల్ ప్రాపర్టీ ఓనర్‌షిప్ రికార్డ్స్’ (ఆర్ పిఒఆర్) అనే పేరును, మధ్య ప్రదేశ్ లో ‘అధికార్ అభిలేఖ్’ అనే పేరును, మహారాష్ట్ర లో ‘సన్నద్’ అనే పేరును, ఉత్తరాఖండ్ లో ‘స్వామిత్వ అభిలేఖ్’ అనే పేరును, ఉత్తర్ ప్రదేశ్ లో ‘ఘరావుని’ అనే పేరును ప్రాపర్టీ కార్డుల కు పెట్టుకోవడం జరిగింది.
***
(Release ID: 1663164)
Visitor Counter : 313
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam