PIB Headquarters
కోవిడ్ -19 మీద పిఐబి రోజువారీ బులిటెన్
Posted On:
03 DEC 2020 5:40PM by PIB Hyderabad
(కోవిడ్ కి సంబంధించి గత 24 గంటలలో జారీచేసిన పత్రికాప్రకటనలు, పిఐబి క్షేత్రస్థాయి అధికారులు సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఇందులో ఉంటాయి)
- ఇండియా గత 24 గంటలలో 40,736 మంది కోవిడ్ నుంచి కొత్తగా కోలుకున్నారు.
- ఇదే కాలంలో 35,551 మంది ఇదే సమయంలో కొవిడ్ వ్యాధికి గురయ్యారు. దీనితో 5,701 యాక్టివ్ కేసులు తగ్గిపొయాయి.
- రికవరీ రేటు ఈరోజు 94.11 శాతానికి మెరుగుపడింది.
- గత 24 గంటలలో 526 మరణాలు నమోదయ్యాయి.
#Unite2FightCorona
#IndiaFightsCorona
రోజువారి రికవరీలు రోజువారి కొత్త కేసులకంటే ఎక్కువగా ఉంటున్నాయి.దీనితో యాక్టివ్ కేస్‌లోడ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మొత్తం క ఏఉలలో యాక్టివ్ కేస్‌లోడ్ 4.5 శాతానికి పడిపోయింది: ఇండియా లో గత 24 గంటలలో కొత్తకేసుల కన్న కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇండియాలో ఇదే సమయంలో 35,551 మంది కోవిడ్ బారిన పడినట్టు తేలగా, మరోవైపు దేశంలో 40,726 మంది కొత్తగా కోలుకున్నారు. గత 24 గంటలలో మొత్తం యాక్టివ్ కేస్ లోడ్ నుంచి 5,701 కేసులు నికరంగా పడిపోయాయి. కొత్తగా కోలుకున్న వారి శాతం రోజువారి కొత్త కేసులను గత ఆరు రోజులుగా దాటిపోతున్నది. ఇండియా యాక్టివ్ కేస్‌లోడ్ ఈరోజు 4.5 శాతం మార్కుకు దిగువకు వచ్చింది.ఇండియా ప్రస్తుత యాక్టివ్ కేస్‌లోడ్ 4,22,943 దేశ మొత్తం పాజిటివ్ కేసులలో 4.44 శాతం గా ఉంది. కొత్త రికవరీలు రోజువారి కోవిడ్ పాజిటివ్ కేసుల కంటే మెరుగుపడుతూ రికవరీ రేటు ఈరోజు 94.11 శాతానికి చేరింది. మొత్తం కోలుకున్న కేసులు 89,73,373. దేశంలో 64 శాతం కొత్త కోవిడ్ నుంచి కోలుకున్న కేసులు పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినవి.5,924 మంది కోవిడ్ నుంచి కోలుకున్న వారితో కేరళ ముందుస్థాయిలో నిలిచింది.ఢిల్లీ లో 5,329 రోజువారి రికవరీలు నమోదు కాగా మహారాష్ట్ర 3,706 కొత్త రికరవరీలను నమోదు చేసింది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 75.5 శాతం కొత్త కేసులు నమోదు చేశాయి. కేరళ గత 24 గంటలలో 6,316 కేసులు నమోదు చేశాయి. ఢిల్లీ 3,944 కొత్త కేసులు నమోదు చేయగా, మహారాష్ట్ర 3,350 కొత్త కేసులను నమోదు చేసింది. గత 24 గంటలలో నమోదైన 526 మరణాలలో 79.28 శాతం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినది. 21.10 కొత్త మరణాలు మహారాష్ట్రనుంచి నమోదయ్యాయి. వీటి సంఖ్య 111. ఢిల్లీలో 82 మంది మరణించగా , పశ్చిమ బెంగాల్‌లో 51 మంది మరణించారు. మరిన్ని వివరాలకు
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి సందేశం: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ, ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది మరింత మెరుగ్గా తిరిగి పునర్నిర్మాణం: అన్నిరకాల వైకల్యాలు, అందుబాటు, కోవిడ్ -19 అనంతర సుస్థిర ప్రపంచం థీమ్‌తో చేపడుతున్న కార్యక్రమాలకు అనుగుణంగా, మన దివ్యాంగులైన సోదర, సోదరీమణులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి తెచ్చేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. దివ్యాంగులైన వారి పట్టుదల మనకు ప్రేరణ నిస్తుందన్నారు. యాక్ససబుల్ ఇండియా చొరవ కింద మన దివ్వాంగులైన సోదర సోదరీమణుల జీవితాలలో సానుకూల మార్పు తీసుకు వచ్చేందుకు ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలకు
స్వావలంబనతో కూడిన, సమగ్ర, బలమైన భారతావనిని నిర్మించేందుకు దివంగత డాక్టర్ అబ్దుల్ కలామ్ నుంచి ప్రేరణ పొందాల్సిందిగా యువతకు పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. మాజీ రాష్ట్రపతి దివంగత ఎపిజె అబ్దుల్ కలాం నుంచి ప్రేరణ పొంది బలమైన భారతావనిని, స్వావలంబిత భారతావనిని నిర్మించేందుకు కృషిచేయాల్సిందిగా ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు యువతకు పిలుపునిచ్చారు. డాక్టర్ కలామ్ లాగా యువత వినూత్న ఆలోచనలు చేయాలని, దేశంలోని వివిధ వర్గాల ప్రజలపై ప్రభావం చూపుతున్నసామాజిక ఆర్ధిక సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు సాంకేతిక పరిజ్హానాన్నివినియోగించాలని పిలుపునిచ్చారు. 40 ఇయర్స్ ఆఫ్ అబ్దుల్ కలామ్- అన్‌టోల్డ్ స్టోరీస్, పేరుతో డాక్టర్‌శివథాను పిళ్లై రాసిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు వర్చువల్ పద్ధతిలో విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆయన ఇందులో డాక్టర్ కలామ్ జీవితానికి సంబంధించి ఆయనను అతి దగ్గరగా పరిశీలించి రాసిన అంశాలు ఉన్నాయని ఉపరాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. కష్టాలు, నిరుత్సాహం వంటి వాటిని సరైన స్ఫూర్తితో తీసుకుంటే వ్యక్తిత్వాన్ని, అద్భుతమైన ఆలోచనా రీతిని మలచడంలో ఇవి కీలకభూమిక పోషిస్తాయని డాక్టర్ కలాం జీవితం శక్తిమంతమైన సందేశాన్ని ఇస్తున్నదని ఆయన అన్నారు. వలస కార్మికులకు సంబంధించి కోవిడ్ -19 ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఆయన గ్రామాలు, చిన్న పట్టణాలో ఉపాధి , ఆర్ధిక అవకాశాలు కల్పించాలన్నారు. మనం వికేంద్రీకృత ప్రణాళికపై , స్థౄనిక సంస్థల సామర్ధ్యాల నిర్మాణంపై పెద్ద ఎత్తున కుటీర పరిశ్రమల ప్రోత్సాహంపై దృష్టిపెట్టాలన్నారు. దీనివల్ల మన గ్రామాలు, పట్టణాలు గ్రోత్ సెంటర్లుగా ఎదుగుతాయన్నారు. ,స్థానిక అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చేందుకు స్థానిక సంస్థలకు ప్రేరణనివ్వాలన్నారు. మరిన్ని వివరాలకు
ప్రస్తుత పరీక్షాసమయం వంటి పరిస్థితులలో సహాయం అవసరమున్న దేశాలకు సహాయపడడంలో ఇండియా మరిచిపోలేదు- ఉపరాష్ట్రపతి ఇండియా తన దేశ ప్రజలను కోవిడ్-19 నుంచి రక్షించుకోవడంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, అవసరమున్న ఇతర దేశాలకు మన దేశ ఫార్మా ఉత్పత్తుల వంటి వాటిని అందజేయడం మరచిపోలేదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ గవర్నింగ్ కౌన్సిల్ 18వ సమావేశంలో మాట్లాడుతూఆయన ఈ మాటలన్నారు. ఐసిడబ్ల్యుఎ అధ్యక్షుడి హోదాలో వీఇయో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభోపన్యాసం చేస్తూ శ్రీ ఎం. వెంకయ్యనాయుడు, కోవడ్‌మహమ్మారిపై పోరాటంలో అంతర్జాతీయంగా జరుగుతున్న కృషికి ఇండియా ముందు వరుసలో ఉండి నాయకత్వం వహిస్తున్నదని ఆయన అన్నారు. పరిశోధన కృషిలోనూ మనం నాయకత్వం వహిస్తున్నామని త్వరలోనే శుభవార్త వినబోతామని ఆయన అన్నారు. కోవిడ్ సమయంలో అంతర్జాతీయ సంబంధాల పాత్ర, విదేశీవిధానం పాత్ర సామాన్యులకు తెలిసివచ్చిందని అన్నారు. వందేభారత్ మిషన్‌లు విదేశాలలో నివశిస్తున్న, పనిచేస్తున్న భారతీయులను తమ స్వస్థలాలకు తీసుకువచ్చిందని, ఇందుకు కృషిచేసిన అధికారులను ఆయన అభినందించారు. ఇంత పెద్ద అంశాన్ని నైపుణ్యతతో కృషి చేసినందుకు ఉపరాష్ట్రపతి అభినందించారు. ఇలాంటి ప్రజా కేంద్రక లక్ష్యాన్ని నైపుణ్యతతో చేపట్టినందుకు అధికారులను ఆయన అభినందించారు.ఐసిడబ్ల్యుఏ ముందు ముందు ఇలాంటి ప్రజాసానుకూల చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మరిన్నివివరాలకు
ఎస్.సి.ఒ యంగ్ సైంటిస్ట్‌కాన్‌క్లేవ్ సందర్భంగా వివిధ అంశాలపై తమ ఆలోచనలను పంచుకున్న యువశాస్త్రవేత్తలు ఎస్‌సిఒ యువ శాస్త్రవేత్తల సదస్సు సందర్భంగా పలు అంశాలపై తమ వినూత్న ఆలోచనలను యువశాస్త్రవేత్తలు పంచుకున్నారు. వ్వవసాయం , ఫుడ్ ప్రాసెసింగ్ సుస్థిర ఇంధనం ,ఇంధన నిల్వ,బయోటెక్నాలజీ ,బయో ఇంజనీరింగ్ వంటి అంశాలలో వారు తమ వినూత్న ఆలోచనలను పంచుకున్నారు. వినూత్న పరిశోధన పనులకు, ఆలోచనలకు22 మంది యువ శాస్త్రవేత్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, శాస్త్ర విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్‌హర్ష వర్ధన్ ఈ సదస్సును ప్రారంభించారు. సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు శాస్త్రవిజ్ఞానాన్ని ఒక ఉపకరణంగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు
కోవిడ్ -19 వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎస్‌టిఐపి 2020 ఎలా ఉపయోగపడుతుందో చర్చించిన నిపుణులు కోవిడ్-19 సృష్టించిన అవకాశాలు దీర్ఘకాలిక ప్రభావాన్ని ఏరకంగా చూపనున్నాయో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్ ఒక వెబినార్‌లో తెలిపారు. కోవిడ్-19 వంటి పరిస్థితులను భవిష్యత్తులో ఎదుర్కొనేందుకు శాస్త్ర విజ్హానం,ఆవిష్కరణల పాలసీ (ఎస్‌టిఐపి) 2020 ఏవిధంగా ఉపయోగపడుతుందో డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ ప్రొఫెసర్ అశుతోష్ శర్మ తెలిపారు. కోవిడ్ -19 ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, అయితే అది మనకు భవిష్యత్ మార్గం కూడా సూచించిందని డాక్టర్‌సారస్వత్ తెలిపారు.డిఎస్‌టి స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రసంగ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్, టెక్నాలజీ కమ్యూనికేషన్ ,విజ్ఞాన్ ప్రసార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మరిన్ని వివరాలకు
బంగ్లాదేశ్ నేషనల్ డిఫెన్స్‌కాలేజ్ ని ఉద్దేశించిన కోవిడ్ -19 మహమ్మారి అనంతర కాలంలో సెక్యూరిటీ సవాళ్లు అనే అంశంపై ప్రసంగించిన వైస్ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భద్రతా సవాళ్లు- కోవిడ్ 19 అనంతర పరిస్థితులు అనే అంశంపై బంగ్లాదేశ్ నేషనల్ డిఫెన్స్‌కోర్సులో పాల్గొన్న వారిని ఉద్దేశించి డిసెంబర్ 2, 2020న లెఫ్టినెంట్ జనరల్ ఎస్.కె.సైనీ వర్చువల్ ప్లాట్‌ఫారం ద్వారా ప్రసంగించారు. ఇంతకు ముందు విసిఒఎఎస్2011లో బంగ్లాదేశ్ నేషనల్‌డిఫెన్స్‌కాలేజిని సందర్శించారు.ప్రపంచంపై కరోనా వైరస్‌ప్రభావం గురించి ఆయన ప్రస్తావించారు. అలాగే దీని ప్రభావంసైనిక సామర్ధ్యం,భద్రతా సవాళ్లు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన చర్యలు వంటి వాటిని ఆయన ప్రస్తావించారు. వైరస్‌ప్రభావం గురించి ప్రస్తావిస్తూ, సైనికసామర్ధ్యానికి సంబంధించి నిధుల తగ్గించినందువల్ల దాని ప్రభావం పలు దేశాలపై పడిందన్నారు. మరిన్ని వివరాలకు
డిజిపిలు, ఐజిపిల వార్షిక సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డిజిపిలు,ఐజిపిల 55 వ వార్షిక ప్రారంభ సదస్సునుద్దేశించి కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్‌షా నిన్న ప్రసంగించారు.ఇందులో వివిధ కేంద్ర పారామిలటరీ బలగాల అధిపతులు , వివిధ రాష్ట్రాల డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లు, ఇన్స్‌పెక్టర్‌జనరల్స్ ఆఫ్ పోలీస్‌లు వర్చువల్ పద్ధతిలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఇంటెలిజెన్సు బ్యూరో ఏర్పాటుచేసిన ఈ తరహా తొలి సమావేశం ఇది. పోలీసు అమరులకు హోంమంత్రి అమిత్‌షా నివాళులర్పించారు భారత పోలీసు పతకాలు పొందిన 50 మందికి వాటిని బహుకరించి వారిని అభినందించారు. తమ ప్రారంభోపన్యాసంలో శ్రీ అమిత్‌షా, జాతీయ భద్రతపై విధానపరమైన అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సంక్షోభ సమయంలో, విపత్తుల నిర్వహణ సమయంలో పోలీసుల కృషిని ఆయన అభినందించారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పోలీసుల పాత్ర, పోలీసులచే రక్షణ ప్రొటోకాల్స్ వినియోగం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. మరిన్ని వివరాలకు
డిసెంబర్ 12 నుంచి జరగనున్న రెజ్లింగ్ ప్రపంచ కప్‌కు భారత్‌నుంచి ప్రాతినిధ్యం వహించనున్న 24 మందిలో రవికుమార్,దీపక్‌పునియా డిసెంబర్ 12 నుంచి జరగనున్నరెజ్లింగ్ ప్రపంచ కప్ కుహాజరౌతున్న 24 మంది రెజలర్లలో రవికుమార్, దీపక్‌పునియా ఉన్నారు.మార్చిలో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత జరగబోతున్న తొలి అంతర్జాతీయ పోటీలివి. డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 18 వరకు బెల్గ్రేడ్, సెర్బియాలో జరగనున్న సీనియర్ వ్యక్తిగత ప్రపంచ కప్ పోటీలలొ 42 మంది (24 మంది రెజ్లర్లు, 9కోచ్ లు ముగ్గురు సపోర్టుస్టాఫ్, ముగ్గురు రెఫరీలు పాల్గొన నున్నారు. వరల్డ్‌కప్ పోటీలు డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 18, 2020 వరకు జరగనున్నాయి. కోవిడ్ కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించిన తర్వాత భారతీయ రెజ్లర్లు అంతర్జాతీయ పోటీలలో పాల్గొననుండడం ఇదే మొదటిసారి.
మరిన్ని వివరాలకు
పిఐబి క్షేత్ర స్థాయి అధికారులు అందించిన సమాచారం
మహారాష్ట్ర: మహారాష్ట్రలో కోవిడ్ -19 కేసులు , మరణాలు సెప్టెంబర్, అక్టోబర్ నెలలతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. అక్టోబర్‌లో మహారాష్ట్రలో 2,93,960 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. నవంబర్‌లో ఇవి 50.5 శాతం తగ్గి 1,45,490 కి చేరుకున్నాయి. అక్టోర్‌లో నమోదైన మరణాలు 7,249. ఇవి నవంబర్‌లో 49.-9 శాతం తగ్గి3690 కి చేరుకున్నాయి. కేస్ పాజిటివిటీ రేటు రాష్ట్రంలో 7.7 శాతానికి పడిపోయింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 88,537కు చేరింది.
గుజరాత్ : గుజరాత్ లో 1,511 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం నాడు 1570 కేసులు కోలుకున్నాయి. 14 మంది పేషెంట్లు ఇన్‌ఫెక్షన్‌తో రాష్ట్రంలో మరణించారు. గుజరాత్ ఆరోగ్య విభాగం ప్రకారం కేస్ పాజిటివిటీ రేటు గుజరాత్‌లో గణనీయంగా పడిపోయింది. ఆగస్టులో 16.15 శాతం నుంచి డిసెంబర్ లో 2.98 శాతానికి పడిపోయింది. యాక్టివ్ కేసులు 14,813
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లో బుధవారం నాడు 1459 కొత్త కేసులు నమోదు కావడంతో కోవిడ్ కేస్‌లోడ్ 2,08,924 కు చేరింది. 17 మంది పేషెంట్లు ఈరోజు కోవిడ్ కారణంగా మరణించారు. దీనితో రాష్ట్రంలో మరణాల సంఖ్య 3,287కు చేరింది. మరోవైపు 1838 మంది పేషెంట్లు ఆస్‌మత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. దీనితో యాక్టివ్ కేసులు 14,019 వద్ద ఉన్నాయి.
గోవా : గోవాలో పబ్లిక్, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలనుంచి ఆరోగ్య కార్యకర్తల సమాచారం సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ కోవిడ్ -19 వాక్సిన్ కార్యక్రమానికి సంబంధించి బుధవారం నాడు ప్రభుత్వం ప్రభుత్వం కోవిడ్ వాక్సిన్ కార్యక్రమానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు మొదలు పెట్టింది.
అస్సాం: అస్సాంలో మరో 173 మంది కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. 138 మంది పేషెంట్లు నిన్న డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసులు 213171 ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన వారు 208666, యాక్టివ్ కేసులు 3519, మొత్తం మరణాలు 983
కేరళ : బురేవి తుపాను హెచ్చరికతో రాష్ట్ర ఆరోగ్య విభాగం హై అలర్ట్ ప్రకటించింది. ఆరోగ్యశాఖ మంత్రి కె.కె. శైలజ మాట్లాడుతూ, తుపాను కారణంగా ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ , భారీవర్షాలు, తుపాన్లవల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు తెలిపారు. కేరళ దక్షిణాది రాష్ట్రాలలో డెయిలీ కేస్ లోడ్ విషయంలో ముందుంది. రాష్ట్రంలో నిన్న 6,313 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 28 మంది మరణించగా , టెస్ట్ పాజిటివిటీ రేటు 11.08 శాతం వద్ద ఉంది.
తమిళనాడు : తమిళనాడులో సుదీర్ఘ విరామం అనంతరం కాలేజీలు తిరిగి తెరిచినప్పటికీ మెజారిటీ విద్యార్ధులు క్యాంపస్‌లకు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి భయాలు ఎక్కువ ఉండడంతో విద్యార్ధులు విద్యాలయాలకు దూరంగా ఉన్నారు. జనవరి 2021లో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన కొద్ది గంటలలోనే , సినీనటుడు రజనీకాంత్ తన రాజకీయ ఎంట్రీని కోవిడ్ మహమ్మారి ఏవిధంగా జాప్యం అయ్యేలా చేసిందో వివరించారు.
కర్ణాటక : వాక్సిన్ ప్రయోగాలు కోవిడ్ చికిత్సకు కర్ణాటక 300 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రాథమికంగా వెయ్యిమంది వాలంటీర్లకు వాక్సిన్ వేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రయోగాలను క్లిన్ ట్రాక్ ఇంటర్నేషనల్‌తోకలిసి చేపట్టనున్నారు. వలంటీర్లకు రెండు డోస్‌ల వాక్సిన్ ఇస్తారు. ఇదిలా ఉండగా హుబ్బలి విమానాశ్రయం కోవిడ్ ఇబ్బందులనుంచి బయటపడింది.ప్రయాణీకుల రాకపోకల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఇండిగో హుబ్బలి- ముంబాయి మధ్య విమానాలను వారానికి మూడుసార్లు నడుపుతోంది. ఇది రోజువారీ విమాన కార్యకలాపాలను ఈ మార్గంలో డిసెంబర్ 10 నుంచి ప్రారంభించనుంది.
.ఆంధ్రప్రదేశ్ : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ వాక్సిన్ మార్గదర్శకాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో తొలిదశలో 35,000 మంది వైద్య ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్ వాక్సిన్ పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ డి. మురళీ దర్ రెడ్డి తెలిపారు.వాక్సిన్ కు సంబంధించి ఎవరైనా పుకార్లు వ్యాప్తి చేస్తున్నట్టుతేలినా, వాక్సిన్‌కు సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారం చేసినా టాస్క్ ఫోర్సు చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 19 వరకు ప్రజా చైతన్యకార్యక్రమాలు చేపట్టనున్నట్టు కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ : తెలంగాణాలో ఇటీవల పెద్ద ఎత్తున జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారాల అనంతరం కోవిడ్ మరోసారి విజృంభించే ప్రమాదం ఉందన్న భయాలతో , రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు వారం రోజులపాటు స్వీయ ఐసొలేషన్‌లో ఉండాల్సిందిగా ప్రజారోగ్య శాఖడైరక్టర్ సూచించారు.తెలంగాణాలో బుధవారం నాడు 609 కొత్త కోవిడ్‌కేసులు నమోదు కాగా ముగ్గురు మరణించారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 1465 కు చేరింది.మొత్తం పాజిటివ్ కేసులు ఇప్పటివరకు 2,71,492.
నిజనిర్థారణ
*******
(Release ID: 1678170)
Visitor Counter : 192