యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

డిసెంబర్ 12వ తేదీ నుండి జరిగే రెజ్లింగ్ ప్రపంచ కప్‌ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 24 మంది అభ్యర్థుల్లో రవి కుమార్, దీపక్ పునియా ఉన్నారు


మార్చిలో కరోనావైరస్ వ్యాప్తి తరువాత జరుగుతున్న - మొదటి అంతర్జాతీయ పోటీ

Posted On: 03 DEC 2020 4:33PM by PIB Hyderabad

2020 డిసెంబర్, 12వ తేదీ నుండి డిసెంబర్, 18వ తేదీ వరకు జరిగే, సీనియర్ వ్యక్తిగత ప్రపంచ కప్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 42 మంది సభ్యులు (24 మంది రెజ్లర్లు, 9 మంది కోచ్ ‌లు, ముగ్గురు సహాయ సిబ్బందితో సహా ముగ్గురు 3 రిఫరీలు) సెర్బియాలోని బెల్ గ్రేడ్ వెళ్తున్నారు.  కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మార్చిలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన తరువాత, భారత రెజ్లర్లు పాల్గొంటున్న మొదటి అంతర్జాతీయ పోటీ ఇది.

క్రీడాకారులు, కోచ్ లు, రిఫరీల విమాన ప్రయాణ టికెట్లు; భోజన, వసతి సౌకర్యాలు; యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ లైసెన్సు ఫీజు; వీసా ఫీజుతో పాటు వ్యక్తిగత ఖర్చుల కోసం మొత్తం 90 లక్షల రూపాయల వ్యయంతో, ఈ పోటీల్లో పాల్గొనడానికి ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది.

ఈ పోటీల్లో పాల్గొంటున్న రెజ్లర్లు :

పురుషుల ఫ్రీస్టైల్ విభాగం :  రవి కుమార్ (57 కిలోలు), రాహుల్ అవేర్ (61 కిలోలు), నవీన్ (70 కిలోలు), గౌరవ్ బలియన్ (79 కిలోలు), దీపక్ పునియా (86 కిలోలు), సత్యావర్త్ కడియన్ (97 కిలోలు), సుమిత్ (125 కిలోలు).

పురుషుల గ్రీకో-రోమన్ విభాగం :  అర్జున్ హలకుర్కి (55 కిలోలు), జ్ఞానేందర్ (60 కిలోలు), సచిన్ రానా (63 కిలోలు), అశు (67 కిలోలు),  ఆదిత్య కుండు (72 కిలోలు), సజన్ (77 కిలోలు), సునీల్ కుమార్ (87 కిలోలు), హర్దీప్ (97 కిలోలు), నవీన్ (130 కిలోలు)

మహిళల విభాగం :  నిర్మలా దేవి (50 కిలోలు), పింకీ (55 కిలోలు), అన్షు (57 కిలోలు), సరిత (59 కిలోలు),  సోనమ్ (62 కిలోలు), సాక్షి మాలిక్ (65 కిలోలు), గుర్షరన్ ప్రీత్ కౌర్ (72 కిలోలు), కిరణ్ (76 కిలోలు)

బజరంగ్ పునియా (పురుషుల ఫ్రీస్టైల్ 65 కిలోలు); వినేష్ ఫోగట్ (మహిళల 53 కిలోలు) తో పాటు రవి కుమార్ మరియు దీపక్ పునియా ల ద్వారా కుస్తీలో భారతదేశం మొత్తం నాలుగు ఒలింపిక్ కోటాలను సాధించింది.

2021 మార్చి నెలలో జరిగే ఆసియా అర్హత పోటీలు మరియు 2021 ఏప్రిల్, 29వ తేదీ నుండి 2021 మే, 2వ తేదీ వరకు జరిగే ప్రపంచ అర్హత పోటీల్లో మిగిలిన కోటాలు సాధించడానికి వారికి మరో రెండు అవకాశాలు ఉంటాయి.

*******


(Release ID: 1678123) Visitor Counter : 278