శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఎస్.సి.ఓ. యువ శాస్త్రవేత్తల సదస్సు లో అనేక అంశాలపై వినూత్న ఆలోచనలను పంచుకున్న - యువ శాస్త్రవేత్తలు


'మన దేశాలను వేగంగా అభివృద్ధి వైపు నడిపించడానికి 'ఇన్నోవేట్, పేటెంట్, ప్రొడ్యూస్ & ప్రోస్పర్' అనే సూత్రాన్ని పాటించాలని, మొదటి ఎస్.సి.ఓ. యువ శాస్త్రవేత్తల సదస్సు ‌లో చురుకైన శాస్త్రవేత్తలను కోరిన - డాక్టర్ హర్ష్ వర్ధన్


ఈ ప్రాంతాలలో నెట్‌వర్కింగ్ మరియు సహకారానికి వీలుగా, ఎస్.సి.ఓ. సభ్య దేశాలలో యువ శాస్త్రవేత్తల మార్పిడి కోసం నిబంధనలతో రూపొందించబడిన - కార్యాచరణ ప్రణాళిక

Posted On: 03 DEC 2020 3:49PM by PIB Hyderabad

ఇటీవల ముగిసిన ఐదు రోజుల షాంఘై సహకార సంస్థ (ఎస్.సి.ఓ) యువ శాస్త్రవేత్తల సదస్సు‌లో యువ శాస్త్రవేత్తలు అనేక అంశాలపైతమ వినూత్న ఆలోచనలను పంచుకున్నారు. ఆ అంశాలలో - వ్యవసాయం; ఆహార ప్రాసెసింగ్; స్థిరమైన విద్యుత్తు; విద్యుత్తు నిల్వ; జీవ సాంకేతిక విజ్ఞానం; బయో ఇంజనీరింగ్; పరిశోధన, ఆవిష్కరణల ద్వారా కోవిడ్-19 తో పాటు అభివృద్ధి చెందుతున్న మహమ్మారిని ఎదుర్కోవడం; పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల నిర్వహణ మొదలైనవి ఉన్నాయి.

22 మంది యువ శాస్త్రవేత్తలకు వారి వినూత్న పరిశోధనలు మరియు వారు ఎస్.సి.ఓ. దేశాల సహకారంతో పనిచేయాలనుకుంటున్న ఆలోచనలకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.

కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూవిజ్ఞానం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూఈ సహస్రాబ్ది యొక్క అతిపెద్ద సవాలుగా నిలిచిన, సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు శాస్త్ర విజ్ఞానాన్ని ఒక సాధనంగా ఉపయోగించాలని, ఎస్.సి.ఓ. సభ్య దేశాల నుండి ఎంపికైన యువ శాస్త్రవేత్తలను కోరారు.  "ఆవిష్కరణలు చేసి, హక్కు పొంది, ఉత్పత్తి చేసి, అభివృద్ధి చెంది" మన దేశాలు వేగంగా పురోభివృద్ధి సాధించడానికి కృషి చేయాలని, మొదటి ఎస్.సి.ఓ. యువ శాస్త్రవేత్తల సదస్సు ‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలకు డాక్టర్ హర్ష్ వర్ధన్ పిలుపునిచ్చారు.

ఎస్.సి.ఓ. సభ్య దేశాలకు చెందిన శాస్త్రవేత్తల మధ్య ఆలోచనల సంగమానికి, ఈ సమావేశం వీలు కల్పించడంతో పాటు, సభ్య దేశాలలో  నెట్‌ వర్క్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.  భవిష్యత్ సహకారం కోసం ఎస్.సి.ఓ. భాగస్వాముల పరిధిలో ఎస్.టి.ఐ. అవకాశాలతో ఉమ్మడి ప్రతిపాదనలకు గల  అవకాశాలను ఇది అంచనా వేసింది.  ఈ ప్రాంతాలలో నెట్‌వర్కింగ్ మరియు సహకారం కోసం, ఎస్.సి.ఓ. సభ్య దేశాలలో యువ శాస్త్రవేత్తల మార్పిడి కోసం, ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.  విజ్ఞానం మరియు సాంకేతికత బదిలీ కోసం అంతర్జాతీయ విద్యార్థుల మార్పిడిని ప్రోత్సహించడానికి యువ మనస్సులను ఒకచోట చేర్చడం ఈ సదస్సు ప్రత్యేకత.  ఈ సదస్సుకు ఎస్.సి.ఓ. సభ్య దేశాల నుండి అనూహ్య స్పందన లభించింది.

మహమ్మారి కారణంగా ఈ సదస్సు దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించడం జరిగింది.   యువ పరిశోధకులను ఒక సాధారణ వేదికపైకి తీసుకురావడంతో పాటు పరిశోధన మరియు ఆవిష్కరణల ద్వారా సాధారణ సామాజిక సవాళ్లను పరిష్కరించడానికీ అదేవిధంగా, యువత యొక్క పరిపూరకరమైన నైపుణ్యాలు మరియు పరిశోధనా సామర్థ్యాల పురోగతిని బలోపేతం చేయడానికి వారి జ్ఞానాన్ని ఉపయోగించుకునేలా యువతను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సుమారు 200 మంది పాల్గొన్నారు, వీరిలో 67 మంది యువ శాస్త్రవేత్తలతో పాటు ఎస్.సి.ఓ. సభ్య దేశాల నుండి ఎంపిక చేసిన విద్యార్థులు ఉన్నారు.

అంతర్జాతీయ సహకారం అధిపతి, సలహాదారుడు డాక్టర్ ఎస్.కె.వర్షిణి మాట్లాడుతూబహుళ-క్రమశిక్షణా ఆర్ & డి. ప్రాజెక్టులకు బహుళ పాక్షిక ఆకృతిలో మద్దతు ఇవ్వడానికి ఎస్.సి.ఓ. ఎస్.టి.ఐ. ఫ్రేమ్ ‌వర్క్ కార్యక్రమం తుది దశలో ఉందని, తెలియజేశారు.  యువ శాస్త్రవేత్తల కోసం ఫెలోషిప్ కార్యక్రమాన్ని రూపొందించడానికి ఎస్.సి.ఓ. సభ్య దేశాలు పరిగణించవచ్చని ఆయన సూచించారు.  ఇది ఎస్.సి.ఓ. దేశాలలో విద్యార్థులు మరియు ప్రారంభ వృత్తి పరిశోధకుల మార్పిడిని అనుమతిస్తుంది.

*****


(Release ID: 1678184) Visitor Counter : 195