ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువవుతుండటంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుముఖం
మొత్తం కేసులలో చికిత్సలో ఉన్నవారి శాతం 4.5% లోపే
Posted On:
03 DEC 2020 11:25AM by PIB Hyderabad
గత 24 గంటలలో భారత్ లో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులకంటే తాజాగా కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా నమోదైంది. కొత్తగా 35,551 మందికి కోవిడ్ సోకగా 40,726 మంది కోలుకున్నారు. దీనివల్ల తేడా 5,701 కేసులు చికిత్సలో ఉన్నవారి సంఖ్యను తగ్గించినట్టయింది. గడిచిన ఆరు రోజులుగా కొత్త కేసులను మించి కోలుకుంటూ ఉన్నారు.
దేశంలో ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య బాగా తగ్గింది. అది మొత్తం కేసులలో 4.5 శాతానికి దిగువన ఉంది. ఎక్కువమంది కోలుకుంటూ, కొత్త కేసులు తక్కువగా ఉంటూ ఉండటం వల్ల చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీనివల్ల ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య 4,22,943 కు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 4.44% మాత్రమే.
కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటంతో కోలుకున్నవారి శాతం మెరుగుపడుతూ 94.11% కు చేరింది. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 89,73,373 కు చేరింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా క్రమంగా పెరుగుతూ 85,50,430 అయింది. కొత్తగా కోలుకున్నవారిలో 77.64% మంది పది రాష్ట్రాలకు చెందినవారు కాగా, అత్యధికంగా 5,924 మందితో కేరళ మొదటి స్థానంలోను, 5,329 మందితో ఢిల్లీ రెండో స్థానంలోను, 3,796 కొత్త కేసులతో మహారాష్ట్ర మూడో స్థానంలోను ఉన్నాయి. .
కొత్తగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులలో 75.5% పది రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. 6,316 కేసులతో కేరళ మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీలో 3,944 కేసులు, మహారాష్ట్రలో 3,350 కేసులు వచ్చాయి.
గత 24 గంటలలో 526 మంది చనిపోగా వారిలో 79.28% మంది కేవలం 10 రాష్టాల్లోనే నమోదయ్యారు.తాజా మరణాలలో అత్యధికంగా 21.10% (111 మంది) మహారాష్టకు చెందినవారు కాగా, ఢిల్లీలో 82, పశ్చిమ బెంగాల్ లో 51 మరణాలు నమోదయ్యాయి.
******
(Release ID: 1678018)
Visitor Counter : 230
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam