రక్షణ మంత్రిత్వ శాఖ
'కోవిడ్-19 మహమ్మారి తరువాత ఎదురయ్యే సవాళ్లు' అనే అంశంపై బంగ్లాదేశ్ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఆన్ సెక్యూరిటీని ఉద్దేశించి ప్రసంగించిన ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్
Posted On:
02 DEC 2020 6:26PM by PIB Hyderabad
'కోవిడ్-19 మహమ్మారి తరువాత ఎదురయ్యే సవాళ్లు' అనే అంశంపై బంగ్లాదేశ్ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఆన్ సెక్యూరిటీని ఉద్దేశించి భారత ఆర్మీస్టాఫ్ వైస్ చీఫ్
(వీసీఓఏఎస్) లెఫ్టినెంట్ జనరల్ ఎస్.కె. సైనీ ప్రసంగించారు. వర్చువల్ వేదిక విధాంలో ఎస్.కె. సైనీ తన ప్రసంగాన్ని అందించారు. తన కెరీర్ ప్రారంభంలో వీసీఓఏఎస్ 2011లో బంగ్లాదేశ్‌లోని నేషనల్ డిఫెన్స్ కాలేజీని సందర్శించారు.
అభివృద్ధి చెందుతున్న ప్రపంచంపై కరోనా వైరస్ ప్రభావం చూపడంతో పాటుగా
సైనిక వ్యవస్థపై దాని ప్రభావం, భద్రతా సవాళ్లు మరియు వాటిని పరిష్కరించే మార్గాలపై వీసీఓఏఎస్ తన అభిప్రాయాలను వెల్లడించారు. వైరస్ యొక్క ప్రభావం గురించి వీసీఓఏఎస్ మాట్లాడుతూ "సైనిక సామర్ధ్యం మరియు ప్రాజెక్టుల కోసం నిధులను తగ్గించడం వలన చాలా దేశాల వ్యూహాత్మక భద్రత ప్రభావితమైంది, ఎందుకంటే అత్యవసర ఆరోగ్య అవసరాల నిమిత్తం భారీ మొత్తంలో డబ్బు మళ్లించబడింది" అని వీసీఓఏఎస్ తన వర్చువల్ ప్రసంగంలో తెలిపారు. "డి-గ్లోబలైజేషన్" యొక్క ధోరణిపై వైస్ చీఫ్ వ్యాఖ్యానిస్తూ "అల్ట్రా-నేషనలిజంకు ఆజ్యం పోసిన దేశాలు డి-గ్లోబలైజేషన్ యొక్క వేగవంతమైన ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. దీని ఫలితంగా వస్తువులు, ప్రజలు, సేవలతో పాటుగా ఆలోచనల కదలికలనూ నివారించేలా సరిహద్దులను మూసివేయడానికి దారి తీస్తుంది" వీసీఓఏఎస్ వివరించారు. "ఆయా దేశాలు మహమ్మారిగా మారిన వైరస్‌ను నియంత్రించడానికి కృషి చేస్తున్న సమయాన్ని.. మరికొన్ని దేశాలు తమ ప్రభావాన్ని సైనికపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా విస్తరించేందుకు గల అవకాశంగా ఉపయోగించుకున్నాయి ఇది ప్రపంచ సమాజానికి మంచిది కాదు " అని ఆయన పేర్కొన్నారు." వైస్ చీఫ్ భవిష్యత్‌లో యుద్ధాల తీరు గురించి వ్యాఖ్యానిస్తూ.. "భవిష్యత్ చాలా యుద్ధాలు సున్నా వ్యయపు యుద్ధాల వైపు ఆకర్షితులవుతాయి, వీటిలో చాలా తీవ్రమైన వ్యాధికారక, అధిక - సాంకేతిక ఆయుధ సామగ్రిని స్థిరీకరణ జరగొచ్చు" అని పేర్కొన్నారు. "సామాజిక మీడియా కథనాలకు యుద్ధం కోసం ఎంపిక వెక్టర్ కొనసాగుతుంది.. బలహీన మిలటరీలో ఒక అనియంత్రిత యుద్ధం పరిసర పరిస్థితిలో ఒక అసమానమైన ప్రయోజనం కోరుకుంటూ కొనసాగుతుంది" అని అభిప్రాయపడ్డారు. మిలిటరీపై కోవిడ్-19 ప్రభావంపై వీసీఓఏఎస్ శక్తి సంసిద్ధత, శిక్షణ, కార్యాచరణ లాజిస్టిక్స్ మరియు హెచ్ఆర్ సమస్యలపై దాని ప్రభావం గురించి ప్రసంగించారు. "ఉత్పత్తి నిలిపి వేయడం, శ్రామిక శక్తి అంతరాయాల కారణంగా డెలివరీ షెడ్యూల్ ఆలస్యం కావడంతో శక్తి నిలకడ ఒక సవాలుగా పరిణమిస్తుంది" అని ఆయన ప్రధానంగా
తెలియజేశారు. కోవిడ్ తరువాత కాలానికి సిఫారసులు సూచించే దిశగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ సీనియర్ సైనిక నాయకత్వానికి గాను "ఈ ప్రాంతంలోని మిలిటరీలు రక్షణ సహకార ప్రణాళికను రూపొందించాలి.. ఎందుకంటే వీరు ఆరోగ్య విపత్తుల సమయంలో మొదటి ప్రతిస్పందనదారులుగా అవతరిస్తారు" అని ఉద్ఘాటించారు. ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు "టెక్నాలజీతో కూడిన
పరిష్కారాలు, సమీకృత గుర్తింపు, తగిన నియంత్రణ అవసరం" అని ఆయన తెలిపారు. "సుస్థిరత మరియు ఆధునీకరణ అవసరాలను తీర్చడానికి రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని తిరిగి ఉత్తేజపరిచాల్సిన అవశ్యకత ఉంది మరియు ఆరోగ్య భద్రతకు కొత్త ప్రేరణ ఇవ్వడం ద్వారా శక్తి సంరక్షణ. సంసిద్ధతను బలోపేతం చేయడం"పై దృష్టి పెట్టాలి. కోవిడ్-19 మహమ్మారితో ముడిపడి ఉన్న సవాళ్లను పరిష్కరించడానికి.. "శిక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, డిజిటల్ కమ్యూనికేషన్ అభివృద్ధి, మిలిటరీలలో ఉత్తమ పద్ధతులను పంచుకోవడం" తప్పనిసరిగా ఉండాలని వీసీఓఏఎస్ వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్‌తో రక్షణ సహకారాన్ని పెంపొందించే దిశలో వీసీఓఏఎస్ ప్రసంగం ఒక ముఖ్యమైన దశ, ఇది బంగ్లాదేశ్‌తో మనకు గత చారిత్రక, సాంస్కృతిక, సైనిక సంబంధానికి భారత సైన్యం ఇచ్చిన ప్రాధాన్యతను తెలియపరిచింది.
***
(Release ID: 1677872)
Visitor Counter : 221