శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వంటి పరిస్థితులను ఎదుర్కోడానికీ, భవిష్యత్తులో సిద్ధంగా ఉండటానికీ, ఎస్.టి.ఐ.పి-2020 ఎలా సహాయపడుతుందో అనే విషయమై నిపుణులు చర్చించారు
విజ్ఞానం యొక్క ప్రజాస్వామ్యీకరణకు, ప్రపంచవ్యాప్తంగా పోటీ ఉత్పత్తులను మరింత వేగంతో, నాణ్యతతో తయారు చేయడానికి పరిశోధన, అభివృద్ధిని పెంపొందించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి వీలుగా పరిశోధన, ఆవిష్కరణ రంగంలో మన పరిశ్రమలకు సాధికారత కల్పించడానికి, ఎస్.టి.ఐ.పి-2020 సహాయపడుతుంది : డి.ఎస్.టి. కార్యదర్శి, ప్రొఫెసర్ అశుతోష్ శర్మ
కోవిడ్-19 ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసింది, అయితే, ఇది మనకు ముందుకు వెళ్ళే మార్గాన్ని కూడా చూపించింది : నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్
Posted On:
03 DEC 2020 3:49PM by PIB Hyderabad
కోవిడ్-19 అవకాశాలను ఎలా సృష్టించిందో మరియు దీర్ఘకాలిక పరిణామాలను ఎలా కలిగించిందో, నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్, ఒక వెబినార్ లో ప్రముఖంగా తెలియజేశారు. కాగా, ఇదే వెబినార్ లో పాల్గొన్న శాస్త్ర, సాంకేతిక శాఖ (డి.ఎస్.టి) కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి, కొత్త శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల విధానం (ఎస్.టి.ఐ.పి) 2020, ఎలా సిద్ధంగా ఉంటుందో తెలియజేశారు.
డి.ఎస్.టి. స్వర్ణోత్సవ ప్రసంగాల పరంపరలో భాగంగా - "మహమ్మారికి మరో వైపు" అనే అంశంపై, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ & టెక్నాలజీ కమ్యూనికేషన్ మరియు విజ్ఞన్ ప్రసా నిర్వహించిన వెబినార్ లో డాక్టర్ సారస్వత్ మాట్లాడుతూ, కోవిడ్-19 ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసింది, అయితే ఇది మనకు ముందుకు వెళ్ళే మార్గాన్ని కూడా చూపించిందని పేర్కొన్నారు.
" ఈ సంక్షోభం కారణంగా ఆత్మీయులను కోల్పోవడం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రభావితమయ్యారు, అనేకమంది జీవనోపాధి కోల్పోయారు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తప్పనిసరి పరిస్థితుల్లో నిలిచిపోవడం ద్వారా సంస్థాగత నిబంధనలు, అనుసరించాల్సిన పద్ధతుల గురించి మన ప్రాథమిక ఊహలలో కొన్నింటిని తిరిగి పరీక్షించి, పరిశీలించవలసిన పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వారి ఆర్థిక వ్యవస్థను తిరిగి ఆవిష్కరించడానికి, పెంపొందించుకునే అవకాశాన్ని స్వావలంబనగా మార్చడానికి అవకాశం కల్పించింది. అటువంటి కోవిడ్-19 అవాంతరాలను ఎదుర్కోవడంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల ఉపయోగం కీలక పాత్ర పోషిస్తుంది.” అని డాక్టర్ సారస్వత్ పేర్కొన్నారు.
ఇటువంటి క్లిష్టమైన దశలో ఎస్.టి.ఐ.పి-2020 పోషించిన పాత్ర గురించి, ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, ప్రధానంగా ప్రస్తావిస్తూ, "భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవటానికీ, దేశాన్ని స్వావలంబనగా మార్చడానికీ, మనకు సహాయపడటానికి ఈ విధానం బాగా రూపొందించబడింది." అని తెలియజేశారు.
విజ్ఞానం యొక్క ప్రజాస్వామ్యీకరణకు, ప్రపంచవ్యాప్తంగా పోటీ ఉత్పత్తులను మరింత వేగంతో, నాణ్యతతో తయారు చేయడానికి పరిశోధన, అభివృద్ధిని పెంపొందించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి వీలుగా పరిశోధన, ఆవిష్కరణ రంగంలో మన పరిశ్రమలకు సాధికారత కల్పించడానికి, ఈ విధానం సహాయపడుతుందని ఆయన వివరించారు.
"గతంలో మనం కొన్ని రంగాలలో అవకాశాలను కోల్పోయాము, ఇప్పుడు ఆ రంగాలలో స్వావలంబన సాధించడానికి ఇది ఒక అడ్డంకిగా మారింది. ఇప్పుడు, మనం, ఈ అవకాశాన్ని కోల్పోలేము. ఇప్పుడు మనకు అవసరమైన ప్రతి అంశాన్నీ, ఎస్.టి.ఐ.పి-2020 పరిగణనలోకి తీసుకుంది. శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణలను ఉపయోగించడం ద్వారా మన దేశం స్వావలంబనగా మారడానికి, ఇది ఎంతో సహాయపడుతుంది. ”, అని, డి.ఎస్.టి. కార్యదర్శి పేర్కొన్నారు.
*****
(Release ID: 1678182)
Visitor Counter : 190