PIB Headquarters

కోవిడ్ -19 మీద పిఐబి రోజువారీ బులిటెన్

Posted On: 02 DEC 2020 5:34PM by PIB Hyderabad

 

 Coat of arms of India PNG images free download

(కోవిడ్ కి సంబంధించి గత 24 గంటలలో జారీచేసిన పత్రికాప్రకటనలు, పిఐబి క్షేత్రస్థాయి అధికారులు సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఇందులో ఉంటాయి)

  • భారతదేశంలో చికిత్సలో ఉన్న బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గి 4.28 లక్షలకు చేరిక
  • గత 24 గంటలలో నమోదైన కొత్త కేసులు  36,604.
  • గత 24 గంటలలో కోలుకున్నవారి సంఖ్య 43,062
  • కోలుకున్నవారిశాతం మెరుగుపడి 94.03% కి చేరిక
  • కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా ప్రామాణిక ఆచరణ విధానాలు విడుదల చేసిన ఆరోగ్య మంత్రిత్వశాఖ
  • 9 లక్షలు పూర్తి చేసుకున్న టెలిమెడిసిన్ సేవలు ఈ-సంజీవని సంప్రదింపులు

Image

132 రోజుల తరువాత చికిత్సలో ఉన్నవారి సంఖ్య 4.28 లక్షలకు తగ్గుదల; మూడు రోజులుగా రోజువారీ కొత్త కేసులు 30 వేల లోపే 

భారతదేశంలో చికిత్స పొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 4.28 లక్షలకు ( 4,28,644) కు తగ్గిపోయింది. ఇది 132 రోజుల తరువాత అతి తక్కువ స్థాయి. 2020 జులై 23న 4,26,167 మంది చికిత్స పొందుతూ ఉన్నట్టు తేలింది. ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ఈ స్థాయికి వచ్చింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో  ఇంకా చికిత్సలో ఉన్నవారు 4.51% మాత్రమే. గత మూడు రోజులుగా వస్తున్న కొత్త కోవిడ్ కేసుల సంఖ్య సుమారు 30 వేల స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. గత 24 గంటలలో నమోదైన పాజిటివ్ కేసులు 36,604. అదే సమయంలో కోలుకున్నవారి సంఖ్య 43,062. ఆ విధంగా గత ఐదు రోజులుగా కొత్త పాజిటివ్ కేసులకంటే  కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటూ వస్తోంది. కొత్తగా వస్తున్న కేసులకంటే కొత్తగా కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటం వలన కోలుకున్న శాతం పెరుగుతూ ఈరోజుకు 94.03% చేరింది. ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 89,32,647 అయింది. అదే సమయంలో మొత్తం పాజిటివ్ కేసులకు, ప్రస్తుతం చికిత్సలో మిగిలివారికి మధ్య తేడా పెరుగుతూ 81 లక్షలు పైబడి నేటికి 85,04,003కు చేరింది. అలా కొత్తగా కోలుకున్నవారిలో 78.35%  మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 6,290  మంది, కేరళలో 6,151 మంది, ఢిల్లీలో  5,036 మంది కోలుకున్నారు. తాజాగా పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 77.25% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే కాగా వారిలో అత్యధికంగా కేరళలో 5,375 పాజిటివ్ కేసులు వచ్చాయి. మహారాష్ట్ర 4,930 కేసులతో రెండో స్థానంలో ఉంది. గత 24 గంటలలో 501 మంది కరోనాతో చనిపోయారు. వాళ్లలో 79.84% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 95 మరణాలు నమోదు కాగా ఢిల్లీలో 86 మంది, పశ్చిమ బెంగాల్ లో 52 మంది చనిపోయినట్టు రికార్డయింది. 

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677629

మార్కెట్లలో కోవిడ్ వ్యాప్తి నిరోధానికి ప్రామాణిక ఆచరణ విధానాలు జారీచేసిన ఆరోగ్య మంత్రిత్వశాఖ  

దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు, ముందస్తు జాగ్రత్తలకు వీలుగా  మార్కెట్లలో పాటించాల్సిన ప్రామాణిక ఆచరణావిధానాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీచేసింది. ప్రజలు షాపింగ్,  ఆహారం, వినోదం తదితర   రోజువారీ అవసరాలకోసం మార్కెట్లకు పెద్ద సంఖ్యలో వెళుతుంటారన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్గర్శకాలు రూపొందించి విడుదల చేసింది. క్రమంగా ఆర్థిక కార్యకలపాలకు అవకాశం కల్పించటం వలన ఈ ప్రదేశాలలో రద్దీ పెరుగుతుందని అంచనావేసి ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కు తగినట్టు నడుచుకోకపోతే ఈ ప్రదేశాలలో సులభంగా వ్యాప్తి చెందుతుందని ఈ పత్రాన్ని రూపొందించింది. నిర్దిష్టమైన జాగ్రత్తలతో బాటు మరికొన్ని అదనపు ముందస్తు జాగ్రత్తలను కూడా ఇందులో పొందుపరచారు. ఈ మార్గదర్శకాలు చిల్లర, టోకు, హైపర్ మార్కెట్లకూ వర్తిస్తాయి. 

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677840

ఆరోగ్య మంత్రిత్వశాఖవారి టెలీమెడిసిన్ సేవ ఈ-సంజీవనికి 9 లక్షల సంప్రదింపులు పూర్తి

ఆరోగ్య మంత్రిత్వశాఖవారి టెలీమెడిసిన్ సేవ ఈ-సంజీవని 9 లక్షల సంప్రదింపులు పూర్తి చేసుకొని మరో మైలురాయి దాటింది. ఇందులో మొదటి 10 రాష్ట్రాలలో తమిళనాడు (2,90,770), ఉత్తరప్రదేశ్ (2,44,211), కేరళ(60,401), మధ్య ప్రదేశ్ (57,569),గుజరాత్ (52,571), హిమాచల్ ప్రదేశ్ (48,187), ఆంధ్రప్రదేశ్(37,681), ఉత్తరాఖండ్  (29,146), కర్నాటక (26,906), మహారాష్ట్ర (10,903) ఉన్నాయి. మారుమూల ప్రాంతం నుంచే రోగ నిర్థారణకు, చికిత్సకు ఇంటర్నెట్ ద్వారా సలహాలనిచ్చే వినూత్నమైన విధానమే టెలీమెడిసిన్. . రోగికీ, వైద్యునికీ మధ్య వర్చువల్ సమావేశానికి ఈ-సంజీవని వీలుకల్పిస్తుంది. భౌగోళికంగా దూరంగా ఉన్న ప్రదేశాలకు ఇది  వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంప్రదింపులకు అందుబాటులోకి వచ్చే వరం లాంటిది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో మందులు సూచించటం ఇందులో ప్రత్యేకత.  ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రారంభించిన ఈ వినూత్న పథకాన్ని కోవిడ్ సంక్షోభ సమయంలో దాదాపు 28 రాష్ట్రాలు ఈ సేవలను వినియోగించుకున్నారు

వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1677674

ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి ప్రపంచ మలేరియా నివేదిక, 2020: మలేరియా భారాన్ని తగ్గించుకోవటంలో భారత్ మెరుగైన ఫలితాల ప్రదర్శన  

ప్రపంచ ఆరోగ్య సంస్థ  తన 2020 ప్రపంచ మలేరియా నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మలేరియా కేసుల సంఖ్య అంచనాలను అందులో ప్రస్తావించింది. మలేరియా కేసుల భారాన్ని భారత్ గణనీయంగా తగ్గించుకున్నదని ఆ నివేదికలో పేర్కొంది. 2018 తో పోల్చుకున్నప్పుడు భారత్ 2019 లో 17.6% కేసులు తగ్గించుకోగలిగినట్టు ఆ నివేదిక వెల్లడించింది. వార్షిక పరాన్నజీవి ప్రభావం 2017 కంటే 2018 లో 27.6% తగ్గగా 2018 కంటే 2019 కి అది18.4% తగ్గింది. మొత్తంగా చూసినప్పుడు మలేరియా పరాన్నజీవి తగ్గుతూ వస్తున్నదని, ఒకప్పుడు 2 కోట్లు ఉందగా ఇప్పుడు బాధితుల సంఖ్య 60 లక్షలకు తగ్గినట్టు తేలింది.

వివరాలకు: . https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677671

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆయుష్ డే కేర్ థెరపీ కేంద్రాల్లో అనుమతికి ఆమోదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆయుర్వేద, యోగ, నేచరోపతి విధానాలకింద డే కేర్ థెరపీ ఉపయోగించుకునే సౌకర్యం కల్పించాలన్న ప్రతిపాదనలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆమోద ముద్రవేసింది. అదే విధంగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలోని ఆయుర్వేద, యోగ, నేచరోపతి విధానాలకింద డే కేర్ థెరపీ కేంద్రాలను కూడా అల్లోపతి వైద్య కేంద్రాల తరహాలోనే త్వరలో సిజి హెచ్ ఎస్ కింద ఎంపానెల్ చేస్తారు. పెన్షనర్లతో సహా సిజి హెస్ ఎస్ లబ్ధిదారులందరూ ఈ లబ్ధిపొందవచ్చు. ఆయుష్ విధానాలకు ప్రజలలో పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మూమ్దుగా దీన్ని పైలట్ ప్రాతిపదికన ఢిల్లీలోను, జాతీయ రాజధాని ప్రాంతంలోను ఏడాదిపాటు అమలు చేస్తారు. ఆ తరువాత ఇతర ప్రాంతాల్లో అమలు సంగతి చూస్తారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677836

శ్రీలంక ఆర్థిక శిఖరాగ్ర సదస్సు-2020 లో కీలకోపన్యాసం చేసిన ఆర్థికమంత్రి

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్ వర్చువల్ పద్ధతిలో నిన్న  జరిగిన  20వ శ్రీలంక ఆర్థిక శిఖరాగ్ర సదస్సు-2020 లో కీలకోపన్యాసం చేశారు.  ఈ సదస్సును ఏటా సిలోన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహిస్తుంది.  ఇది శ్రీలంకలో ఆర్థిక, వ్యాపార అంశాలమీద చర్చించే ప్రధానమైన వేదిక. ఈ ఏడాది సదస్సుకు “ఆరంభానికి ప్రణాళిక: ప్రజలే కేంద్రంగా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రయత్నం” అనే పేరు పెట్టారు.   శ్రీలంక అధ్యక్షుడు శ్రీ గొటబాయా రాజపక్సే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. . కరోనా మహమ్మారికి సంబంధించి ఎదురైన సవాళ్లను ఎదుర్కోవటానికి భారత్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను నిర్మలాసీతారామన్ ఈ సదస్సులో వివరించారు. భారత్ దేశం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్, శ్రీలంక చేపట్టిన స్వయం సమృద్ధ శ్రీలంక రెండూ పూర్తి సారూప్యంతో ఉన్నాయని తన కీలకోపన్యాసంలో పేర్కొన్నారు.  దీనివలన ఇరుదేశాల కృషి సత్ఫలితాలు సాధిస్తుందన్నారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677559

అర్థవంతమైన, స్పందనాపూర్వకమైన ముడి చమురు ధరలకే భారత్ మొగ్గు: శ్రీ ప్రధాన్

భారత దేశం ఎప్పుడూ అర్థవంతమైన, స్పందనాపూర్వకమైన ముడి చమురు ధరలకే మొగ్గు చూపుతుందని చమురు, సహజవాయువు, ఉక్కు శాఖామంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ మీద ఈరోజు జరిగిన స్వరాజ్య వెబినార్ లో ఆయన ప్రసంగించారు. గుత్తాధిపత్యానికి రోజులు చెల్లాయని, తయారీదారులు అనివార్యంగా వినియోగదారుల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్దారు. అంతర్జాతీయ ఇంధన అవసరాల పెరుగుదలలో వాటా 2040 నాటి వరకూ 3% పెరుగుతుందని ఆయన అంచనావేశారు. ఇది ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలకంటే కూడ ఎక్కువన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ గురించి మాట్లాడుతూ, కోవిడ్ ను భారత్ స్వయం సమృద్ధ నినాదంతో ఎదుర్కోగలిగిందన్నారు.ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు. చురుకైన జనాభా, డిమాండ్ అనేవి ఆత్మ నిర్భర్ భారత్ కు మూల స్తంభాలుగా నిలిచాయన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకూ ఆత్మ నిర్భర్ పాకేజ్, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ఊరటనిచ్చాయని చెప్పారు.130 కోట్లమంది భారతీయులకు అత్మ నిర్భర్ భారత్ ఒక మంత్రంగా మారిందన్నారు.

వివరాలకు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677838

2020 లో రికార్డ్ స్థాయిలో రైల్వే రవాణా లోడింగ్ నమోదు; గత నవంబర్ కంటే ఈ నవంబర్ లో 9% పెరుగుదల

భారత రైల్వేల సరకు రవాణా గణనీయమైన పెరుగుదల నమోదు చేసుకుంది. ఆదాయంలొను, లోడ్ లోను ఈ పెరుగుదల స్పష్టంగా కనబడుతోంది. నవంబర్ 2020 లో లోడు  నిరుటి స్థాయిని మించిపోయి 109.68 మిలియన్ టన్నులతో నిరుడు నవంబర్ కంటే  9% అధికంగా నమోదైంది. నిరుడు ఈ నెలలో same 100.96 మిలియన్ టన్నుల లోడింగ్ జరిగింది.  దీని ద్వారా భారత రైల్వేలకు  రూ. 10657.66 కోట్ల మేరకు సరకు రవాణా ఆదాయం లభించింది.  ఇది నిరుటి కంటే రూ. 449.79 కోట్లు అదనం. నిరుడు వచ్చిన ఆదాయం  రూ.10207.87 కోట్లు.  పండుగలు, తుపాను వచ్చినప్పటికీ సరకు రవానా పెరుగుదల నమోదు చేసుకుంది.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677556

దివ్యాంగుల సాధికారత జాతీయ  పురస్కారాల ఎంపిక కమిటీ సమావేశం కోవిడ్ దృష్ట్యా వాయిదా

దివ్యాంగుల సాధికారత కోసం ఇచ్చే జాతీయ పురస్కారాలను ఎంపికచేసే కమిటీ జాతీయ సమావేశం వాయిదా పడింది. ప్రస్తుతం నెలకొన్న కరోనా నేపథ్యంలో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగులు అందిమ్చిన సేవలకు గుర్తింపుగా ఏటా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నాడు వీటిని ప్రటించటం ఆనవాయితీ. అందుకు అనుగుణంగానే దివ్యాంగుల సాధికారతా విభాగం  జాతీయ పురస్కారాల కోసం 2020 జులై 25న దరఖాస్తులు కోరుతూ ఒక ప్రకటన ప్రచురించింది.  దరఖాస్తులు పరిశీలించాచిన అనంతరం వాటిని జాతీయ ఎంపిక కమిటీ ముందుంచుతారు. డిసెంబర్ 1న జరగాల్సిన సమావేశాన్ని కోవిడ్ కారణంగా వాయిదావేశారు.  

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677839

పిఐబి క్షేత్ర స్థాయి అధికారులు అందించిన సమాచారం

  • మహారాష్ట్ర: రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత 24 గంటలలో కొత్త కేసులకంటే కోలుకున్నవారి సంఖ్య అధికంగా నమోదైంది. మహారాష్ట్రలో కోలుకున్నవారి శాతం  92.49 చేరింది.  సోకినవారిలో మరణాల శాతం  2.58 కు చేరింది. ఏడు నెలల తరువాత మొదటి సారిగా ముంబయ్ లో మరణాల సంఖ్య ఒక అంకెకు చేరింది.   మంగళవారం మృతుల సంఖ్య 9 గా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 89,098 కి చేరింది. .
  • గుజరాత్: మాస్కులు ధరించనివారు కచ్చితంగా కోవిడ్ సెంటర్లలో ప్రజాసేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాల్సిందేనని గుజరాత్ హైకోర్ట్ స్పష్టం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా ఉండగా గుజరాత్ ప్రభుత్వం ఆర్ టి పిసి ఆర్ కోవిడ్ పరీక్ష గరిష్ఠ ధరను రూ.800 గా నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 14,885 మంది ఇంకా చికిత్సలో ఉన్నారు ..
  • రాజస్థాన్: రాజస్థాన్ లో కరోనా కలోలాన్ని సమీక్షించటానికి కేంద్ర నిపుణుల బృందం ఈ రోజు రాష్ట్రానికి చేరుకుంది.  నీతి ఆయోగ్ సభ్యుడైన డాక్టర్ వినోద్ కుమార్ పాల్ నాయకత్వంలోని ఈ బృందం ఈ రోజు ఉదయం ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్ష చేపట్టింది.   ముఖ్యంగా జైపూర్, జోధ్ పూర్ లో నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు.గత వారం రోజుల్లో కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి.. అయితే, జైపూర్, జోధ్ పూర్, కోట నగరాలలో మాత్రం ఇంకా తగ్గలేదు. చికిత్సలో ఉన్న కేసులలో 34 శాతం జైపూర్ లొనే నమోదయ్యాయి. మరో 22 శాతం మంది బాధితులు జోధ్ పూర్ లో ఉన్నారు.   
  • అస్సాం: అస్సాంలో  మరో 222 మందికి కోవిడ్ సోకినట్టు నిర్థారణ అయింది.  నిన్న 135 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం పాజిటివ్ కెకేల సంఖ్య 212998 కి చేరగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 208528గా నమోదైంది. చికిత్సలో ఉన్నవారు 3486 కాగా మొత్తం మృతులు 981 మంది.  
  • కేరళ: కోవిడ్-19 పరీక్షల మార్గదర్శకాలను రాష్ట ప్రభుత్వం మార్చింది. దీని ప్రకారం ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు 60 ఏళ్ళు పైబడిన వారికి, గర్భిణులకు పౌష్ఠికాహార లోపంతో బాధపడే పిల్లలకు చేపడతారు.   .అదే విధంగా వృద్ధాశ్రమాలలో ఉండేవారికి నెలకు ఒకసారి చొప్పున ఈ పరీక్షలు చేస్తారు.  ఇల ఉండగా ప్రభుత్వ ఆధ్వర్యంలొని కేరళ రాష్ట ఔషధ సంస్థ 2.5 లక్షల లీటర్లకు పైగా శానిటైజర్ తయారు చేసింది. దీన్ని వచ్చే వారం జరిగే స్థానిక సంస్థల ఎన్నిక సందర్భంగా 34,780 బూత్ లలో వాడతారు. కోవిడ్ సంక్షోభం మొదలయ్యాక కేరళలో జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి.  శబరిమల అయ్యప్ప ఆలయ దర్శనం కోసం అదనపు ఆన్ లైన్ టికెట్ల బుకింగ్ ఈ రోజు మొదలైంది.  సోమవారం నుంచి శుక్రవారం వరకు దర్శించుకునే అవకాశం కల్పించిన భక్తుల సంఖ్యను 1000 నుంచి 2000 కు పెంచారు.
  • తమిళనాడు:  బురెవి పేరుతో తమిళనాడుకు తుపాను ప్రమాదం పొమ్చి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి తుపాను అప్రమత్తతమీద  సమీక్షా సమావేశానికి అధ్యక్ష్తక్షత వహించారు. మదురై, కన్యాకుమారి,తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాలకు తొమ్మిది ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను పంపామన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. పునరావాస కేంద్రాలలో ప్రాథమిక అవసరాలు తీర్చాల్సిందిగా కోరారు.  అదే సమయంలో శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించటం లాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటామన్నారు.  ఇలా ఉండగా, దక్షిణ రైల్వే మరో 9 ప్రత్యేక రైళ్ళు నడపబోతోంది. డిసెంబర్ 2 ఉదయం 8 గంటల నుండి వీటికి రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి.
  • కర్నాటక: కొవాక్సిన్ ట్రయల్స్ రాష్ట్రంలో విజయవంతం కాబోతున్నాయి. వాక్సిన్ పంపిణీకి కర్నాటక పూర్తిగా సమాయత్తమైందని ఆరోగ్య, వైద్య శాఖామంత్రి డాక్టర్ కె. సుధాకర్ అన్నారు. వైదేహి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్  లో భారత్ బయోటెక్ వారి మూడో దశ ట్రయల్స్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.  కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర సాంకేతిక మండలి సలహాకు అనుగుణంగా  ఈ సారి కొత్త సంవత్సర వేడుకలను నిషేధించామన్నారు.డిసెంబర్ 26 నుంచి జనవరి 1 వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తామన్నారు.  
  • ఆంధ్రప్రదేశ్: 2021 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం మీద రాష్ట ప్రభుత్వం మంగళవారం నాడు హైకోర్టులో సవాలు చేసింది.  అది ఏకపక్ష నిర్ణయమని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. తగిన సంప్రదింపులు జరపకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపకూడదని ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని హైకోర్టును కోరారు. ప్రభుత్వ యంత్రాంగం కొవిడ్-19 నివారణ చర్యల్లో నిమగ్నమైందని, ప్రజారోగ్యమే ప్రధానం గనుక స్థానిక ఎన్నికలు జరపటానికి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. 
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటలలో  565 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా , 925 మంది కోలుకున్నారు. ఒక మరణం నమోదైంది.   మొత్తం కోవిడ్ కేసులు ఇప్పటి వరకు  2,70,883కి చేరాయి.  చికిత్సలొ ఉన్నవారు: 9,266; మరణాలు: 1462; కోలుకున్నవారు: 2,60,155 మంది. కోలుకున్నవారి శాతం 96.03.  జాతీయ స్థాయిలో కొలుకున్నవారి శాతం 94.హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలలో . 46.6% పోలింగ్ జరిగింది.  2016 లో 45.29% 2009 లో  42.04% నమోదైంది.

నిజనిర్థారణ

 

Image

 

Image

*******

 

 



(Release ID: 1677842) Visitor Counter : 164