సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
దివ్యాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డుల గ్రహీతల ఎంపికకు కమిటీ
- ప్రస్తుత నెలకొని ఉన్న కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో వాయిదా
Posted On:
02 DEC 2020 5:05PM by PIB Hyderabad
'అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం' సందర్భంగా దివ్యాంగుల సాధికారికత
దిశగా జాతీయ స్థాయిలో అవార్డుల ప్రదానం జరుగుతుంది. వివిధ రంగాలలో మేటి పనితీరు కనబరిచిన వారికి జాతీయ అవార్డులను ప్రదానం చేస్తుంటారు. దివ్యాంగుల సేవలు/ కనబరిచి నైపుణ్యాలతో పాటు దివ్యాంగుల సాధికారికతకు కృషి చేస్తున్న ప్రభుత్వ సంస్థలు / ప్రైవేటు సంస్థలకు ప్రతి యేటా డిసెంబరు 3వ తేదీన ఈ అవార్డులను ప్రదానం చేస్తుంటారు. ఇందుకుగాను సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని దివ్యాంగుల సాధికారత విభాగం (దివ్యంగ్జన్) ఈ ఏడాది జూలై 25న ఒక ప్రకటనను విడుదల చేస్తూ 2020వ సంవత్సరానికి సంబంధించి జాతీయ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి ప్రతిస్పందనగా దరఖాస్తులు / నామినేషన్లు వచ్చాయి. దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలు, రికార్డులను పరిశీలించడం ద్వారా ఎంపిక ప్రక్రియను వివరంగా చేపట్టాల్సి ఉంది. ఎంపిక చేసిన వారి జాబితాను తరువాత జాతీయ ఎంపిక కమిటీ ముందు ఉంచాలి. దీని ప్రకారం జాతీయ ఎంపిక కమిటీ సమావేశం 01.12.2020 న జరగాల్సి ఉంది. అయితే, కోవిడ్ 19 మహమ్మారి కారణంగా ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితి కారణంగా ఈ కమిటీ సమావేశం వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడిన తర్వాత, ముందస్తు నోటీసు ద్వారా ప్రజలకు దీని గురించి తెలియజేస్తూ.. ఎంపిక ప్రక్రియ చేపట్టడానికి జాతీయ ఎంపిక కమిటీ సమావేశం జరుగనుంది.
***
(Release ID: 1677839)
Visitor Counter : 223