ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

132 రోజుల తరువాత చికిత్సలో ఉన్నవారి సంఖ్య 4.28 లక్షలకు తగ్గుదల

మూడు రోజులుగా రోజువారీ కొత్త కేసులు 30 వేల లోపే

Posted On: 02 DEC 2020 11:30AM by PIB Hyderabad

భారతదేశంలో చికిత్స పొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 4.28 లక్షలకు ( 4,28,644) కు తగ్గిపోయింది. ఇది 132 రోజుల తరువాత అతి తక్కువ స్థాయి. 2020 జులై 23న 4,26,167 మంది చికిత్స పొందుతూ ఉన్నట్టు తేలింది. ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ఈ స్థాయికి వచ్చింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో  ఇంకా చికిత్సలో ఉన్నవారు 4.51% మాత్రమే.

 

WhatsApp Image 2020-12-02 at 10.32.49 AM.jpeg

గత మూడు రోజులుగా వస్తున్న కొత్త కోవిడ్ కేసుల సంఖ్య సుమారు 30 వేల స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. గత 24 గంటలలో నమోదైన పాజిటివ్ కేసులు 36,604. అదే సమయంలో కోలుకున్నవారి సంఖ్య 43,062. ఆ విధంగా గత ఐదు రోజులుగా కొత్త పాజిటివ్ కేసులకంటే  కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటూ వస్తోంది.

WhatsApp Image 2020-12-02 at 10.36.03 AM.jpeg

కొత్తగా వస్తున్న కేసులకంటే కొత్తగా కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటం వలన కోలుకున్న శాతం పెరుగుతూ ఈరోజుకు 94.03% చేరింది. ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 89,32,647 అయింది. అదే సమయంలో మొత్తం పాజిటివ్ కెసులకు, ప్రస్తుతం చికిత్సలో మిగిలివారికి మధ్య తేడా పెరుగుతూ 81 లక్షలు పైబడి నేటికి 85,04,003కు చేరింది. అలా కొత్తగా కోలుకున్నవారిలో 78.35%  మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 6,290  మంది, కేరళలో 6,151 మంది, ఢిల్లీలో  5,036 మంది కోలుకున్నారు.

WhatsApp Image 2020-12-02 at 10.26.55 AM.jpeg

తాజాగా పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 77.25% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే కాగా వారిలో అత్యధికంగా కేరళలో 5,375 పాజిటివ్ కేసులు వచ్చాయి. మహారాష్ట్ర 4,930 కేసులతో రెండో స్థానంలో ఉంది.

WhatsApp Image 2020-12-02 at 10.26.51 AM.jpeg

గత 24 గంటలలో 501 మంది కరోనాతో చనిపోయారు. వాళ్లలో 79.84% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 95 మరణాలు నమోదు కాగా ఢిల్లీలో 86 మంది, పశ్చిమ బెంగాల్ లో 52 మంది చనిపోయినట్టు రికార్డయింది. 

WhatsApp Image 2020-12-02 at 10.26.54 AM.jpeg

***



(Release ID: 1677629) Visitor Counter : 194