PIB Headquarters

కోవిడ్-19 మీద రోజువారీ పిఐబి బులెటిన్

Posted On: 24 NOV 2020 5:46PM by PIB Hyderabad

 

Coat of arms of India PNG images free download

(కోవిడ్-19 కి సంబంధించి గత 24 గంటలలో జారీచేసిన పత్రికాప్రకటనలు, పిఐబి క్షేత్రస్థాయి అధికారులు అందించిన సమాచారం, పిబి చేపట్టిన నిజనిర్థారణ ఫలితాల సమాహారం )

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Image

40 వేలకి దిగువన రోజువారీ కొత్త కేసులు; చికిత్సలో ఉన్న వారి సంఖ్య 4.4 లక్షలలోపు ; రోజువారీ పాజిటివ్ కేసులు 3.45%

ఆరు రోజుల తరువాత భారత లో కొత్త కోవిడ్ కేసులు 40 వేలలోపు నమోదయ్యాయి. గత 24 గంటలలో 37,975 కొత్త పాజిటివ్ కేసుల నిర్థారణ జరిగింది. నవంబర్ 8 నుంచి వరుసగా 17 రోజులుగా కొత్త కేసులు 50,000 కు లోపే ఉంటూ వస్తున్నాయి. గత 24 గంటలలో 10,99,545 శాంపిల్స్ పరీక్షించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు జరిపిన మొత్తం కోవిడ్ నిర్థారణ పరీక్షల సంఖ్య 13 కోట్లు దాటి 13,36,82,275 కు చేరింది.సగటున రోజుకు 10 లక్షలకు పైగా కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరుపుతూ ఉండటం వలన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య దిగువ స్థాయిలో ఉండిపొతున్నది. ఇప్పటివరకు జరిపిన పరీక్షలలో పాజిటివ్ గా నిర్థారణ జరిగిన కేసుల శాతం నేటికి 6.87% కు చేరి 7శాతానికి దిగువన నిలిచింది. రోజువారీ పాజిటివ్ నిర్థారణ శాతం ఇప్పుడు 3.45% మాత్రమే ఉంది. దీన్ని బట్టి కోవిడ్ నిర్థారణ పరీక్షలు ఎక్కువవుతున్నకొద్దీ పాజిటివ్ శాతం తగ్గుతూ వస్తునట్టు స్పష్టమవుతోంది. ప్రతి పదిలక్షల జనాభాల్లో కోవిడ్ పరీక్షల సంఖ్య పెరిగి 96,871 కు చేరింది. గత కొద్దివారాలుగా, చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటలలో 42,314 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఇంకా చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య 4,38,667 కి తగ్గింది. మొత్తం పాజిటివ్ కేసులుగా నమోదైన వారిలో ఇంకా చికిత్స పొందుతున్నవారు కేవలం 4.78% కాగా, ఇది తగ్గుతున్న ధోరణికి అద్దం పడుతోంది. కోలుకున్నవారి శాతం కూడా పెరుగుతూ 93.76% అయింది. ఈరోజు వరకు కోలుకున్నవారు 86,04,955 మంది. గత 24 గంటలలో తాజాగా కోలుకున్న వారిలో 75.71% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. అత్యధికంగా ఢిల్లీలో 7,216 మంది కోలుకోగా, కేరళలో 5,425 మంది, మహారాష్ట్రలో 3,729 మంది కోలుకున్నారు. . కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసులలో 77.04% కేవలం 10 రాష్ట్రాలకు చెందినవి కాగా అందులో ఢిల్లీలో అత్యధికంగా 4,454 కేసులు, ఆ తరువాత మహారాష్ట్రలో 4,153 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలో 480 మరణాలు నమోదయ్యాయి.అందులో 10 రాష్ట్రాల్లోనే 73.54% మంది చనిపోయారు. ఢిల్లీలో అత్యధికంగా 121 మంది చనిపోగా, పశ్చిమబెంగాల్ లో 47 మంది, మహారాష్ట్రలో 30 మంది మరణించారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675254

కోవిడ్ పరిస్థితిని, తీవ్రత ఎదుర్కునే సంసిద్ధతను సమీక్షించేందుకు ముఖ్యమంత్రులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని

 

ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు కోవిడ్-19 ప్రస్తుత పరిస్థితిని, అత్యవసర వాతావరణానికి సంసిద్ధతను సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా హర్యానా, ఢిల్లీ, చత్తీస్ గఢ్, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. కోవిడ్ వాక్సిన్ అందుబాటులోకి వచ్చాక చేరవేత, పంపిణీ, వాక్సిన్ ఇవ్వటం వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. దేశం చేసిన ఉమ్మడి కృషి వల్లనే కోలుకున్నవారి శాతం ఎక్కువగాను, మరణాలు తక్కువగాను నమోదయ్యాయన్నారు. అనేక ఇతర దేశాలలో కంటే భారత్ లో పరిస్థితి మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు. పరీక్షలు విస్తృతం చెయ్యాలను, చికిత్స మరింత మెరుగుపడాలని చెబుతూ పిఎం కేర్స్ నిధులను ప్రధానంగా ఆక్సిజెన్ అందుబాటు కోసం వెచ్చిస్తున్నామన్నారు. వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రులు ఆక్సిజెన్ తయారీలో స్వయం సమృద్ధం కావటానికి ప్రయత్నిస్తున్నామని, 160 ఆక్సిజెన్ ప్లాంట్ల ఏర్పాటు పని చురుగ్గా సాగుతోందని చెప్పారు. ఈ కఓనాసంక్షోభం ప్రజలమీద నాలుగుదశలుగా ప్రభావం చూపిందని విశ్లేషించారు. మొదటి దశ భయంతో, రెండో దశలో వైరస్ మీద అనేక అనుమానాలతో వ్యాధి దాచుకునే ప్రయత్నం చేయటం, మూడో దశలో ఒప్పుకొని అప్రమత్తంగా ఉండటం, నాలుగోదశలో ఎక్కువమంది కోలుకోవటం గమనించి నిర్లక్ష్యంగా ఉంటూ వ్యాధి కొనితెచ్చుకున్నారన్నారు. కొన్ని దేశాలలో ఇలా పెరుగుతున్న ధోరణి ఇక్కడ కూడా కొన్ని చోట్ల కనబడటానికి నిర్లక్ష్యమే కారణమన్నారు. అందుకే అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675352

సంస్కరణల వేగం కరోనా సంక్షోభంలోనూ, తరువాత కూడా కొనసాగుతుందన్న ఆర్థికశాఖామంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్; ఆర్థిక వ్యవస్థ కుదుటబడుతోందని వ్యాఖ్య

ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఎదుగుదలకు అవరోధాలు ఎదురైనప్పటికీ, సంస్కరణల వేగం కొనసాగిందని, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. భారత పరిశ్రమ సమాఖ్య (సిఐఐ) నిన్న ఏర్పాటు చేసిన జాతీయ ఎం ఎన్ సి ల సదస్సును ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థిక రంగంలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించటం లాంటి అనేక చర్యల ద్వారా సంస్కరణల వేగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. భారత సంస్థలతోబాటి బహుళజాతి సంస్థలు చిన్నాపెద్దా తేడా లేకుండా వ్యాపార నిర్వహణను సరిదిద్ది గాడిలో పెడుతున్నాయన్నారు. పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయమైన కేంద్రంగా మారేందుకు తగిన విధంగా విధానాలు రూపుదిద్దుతూ ఉన్నామని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ పాకేజ్ కింద ప్రభుత్వం చేసిన సంస్కరణల ఫలితంగా అణుశక్తి, అంతరిక్షం తదితర రంగాలో విదేశీ పెట్టుబడులకు ఆసక్తి పెరిగిందన్నారు. భారత్ లో ఉన్న బహుళ జాతి సంస్థల అవసరాలు తీర్చటంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నదని ఆమె అన్నారు. ఆ సంస్థల అవసరాల విషయమై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వారితో మాట్లాడుతుండటాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యల వలన అనేకదేశాలు ఆరి రాష్ట్రాల్లొని ప్రత్యేక తయారీ మండలాలలో ఫార్మా, వైద్య పరికరాలు తదితరాలలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయన్నారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675328

స్పైస్ హెల్త్, భారత వైద్య పరిశోధనామండలి సంయుక్తంగా రూపొందించిన కోవిడ్-19 మొబైల్ ఆర్ టి పి సి ఆర్ లాబ్ ను ఆవిష్కరించిన హోం మంత్రి శ్రీ అమిత్ షా

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షానిన్న న్యూ ఢిల్లీలో స్పైస్ హెల్త్, భారత వైద్య పరిశోధనామండలి సంయుక్తంగా రూపొందించిన కోవిడ్-19 మొబైల్ ఆర్ టి పి సి ఆర్ లాబ్ ను ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కూడా ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఐసిఎంఆర్ దైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, స్పైస్ జెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అజయ్ సింగ్, స్పైస్ హెల్త్ సీఈవో కుమారి అవని సింగ్ పాల్గొన్నారు. కోవిడ్ 19 పరీక్షలకు ఇలాంటి లాబ్ లు మరింత తోడ్పాటు ఇస్తాయి. దీనికి ఐసిఎంఆర్ ఆమోదం ఉండగా ఎన్ ఎ బి ఎల్ అక్రెడిటేషన్ ఇచ్చింది. ఒక్కో కోవిడ్ పరీక్ష ఖరీదు రూ.499 ఉంటుంది.దీన్ని ఐసిఎంఆర్ భరిస్తుంది. 24-48 గంటలకు బదులు 6-8 గంటల్లో ఫలితం వస్తుంది.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675299

కోవిడ్ సంక్షోభ సమయంలో గోవా పోలీసుల సేవలు అద్భుతం: శ్రీపాద నాయక్

కరోనా సంక్షోభ సమయంలొ గోవా పోలీసులు అద్భుతమైన పనితీరు కనబరచారు., అందుకే కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా వారికి తిరిగి ధన్యవాదాలు తెలియజేసే క్రమంలొ గోవా షిప్ యార్డ్ రూ. 23.80 లక్షల విలువచేసే అత్యాధునిక అంబుల్కెన్స్ ను పోలీసు దళాలకు బహుమతిగా అందజేసింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా రూ. 2.5 కోట్లతో కాన్సర్ నిర్థారణ యంత్రాన్ని ఒక బస్సులో బిగించి అందజేస్తున్నట్టు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి, రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాద నాయక్ నిన్న వెల్లడించారు. నిన్న గోవా పోలీస్ కేంద్ర కార్యాలయం ఉన్న పనాజీలో ఆయన ఈ అంబులెన్స్ అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. . ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, డిజిపి ముఖేశ్ కుమార్ మీనా, గోవా షిప్ యార్డ్ సిఎండీ బిబి నాగ్ పాల్ కూడా పాల్గొన్నారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675180

రోగనిరోధకశక్తిని పెంచే మరిన్ని ఉత్పత్తులు ఆవిష్కరించిన ట్రైబ్స్ ఇండియా

వినియోగదారులకు మరింత ఆకర్షణీయమైన ఉత్పత్తులు అందించేందుకు ట్రైబ్స్ ఇండియా ప్రయత్నం కొనసాగిస్తోంది. అదే సమయంలో లక్షలాది గిరిజనుల ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. గత నెలలో ఈ లక్ష్యంతోనే ట్రైబ్స్ ఇండియా అనేక ఉత్పత్తులను జోడించింది. అందులో ప్రధానంగా రోగనిరోధకశక్తి పెంచే అటవీ ఆర్గానిక్ ఉత్పత్తులు ఉండటం విశేషం. గుజరాత్ కి చెందిన గ్రామ్ సంఘటన్ కంబోడియా గిరిజనులు సహేలీ పేరుతో పర్యావరణ అనుకూల శానిటరీ పాడ్స్ ఈ సారి ప్రత్యేకతగా నిలిచాయి. వీటిని ట్రైబ్స్ ఇండియా దేసవ్యాప్తంగా పంపిణీ చెస్తోంది. మరికొన్ని అటవీ ఉత్పత్తులను బహుమతులుగా ఇవ్వటానికి వీలుగా ఆకర్షణఈయమైన పాకేజింగ్ తో అందిస్తోంది. అన్ని ట్రైబ్స్ ఇండియా దుకాణాలలో వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. మొబైల్ వ్యాన్లలోను, ఈ-మార్కెట్ ప్లేస్ లో కూడా కొనుగోలు చేసె వీలుంది. ఇది దేశవ్యాప్తంగా ఐదు లక్షలమంది గిరిజన వ్యాపారులను అనుసంధానం చేస్తుంది. వైవిధ్య భరితమైన సహజ ఉత్పత్తులు పురాతన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ గిరిజన సోదరులను ఆదుకునేందుకు ఉపయోగపడుతున్నాయి.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675088

కోవిడ్-19 లాంటి అంతర్జాతీయ సవాళ్ళు ఎదుర్కోవటానికి బహుళపక్ష సహకారం అవసరం: డాక్టర్ హర్షవర్ధన్

కోవిడ్-19 వాక్సిన్ అమలులో భారత వైద్య పరిశోధనామండలి కీలకపాత్ర పోషిస్తున్నదని, అన్ని ప్రధాన కోవిడ్ వాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ ఇక్కడ జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు. దాదాపు 30 రకాల వాక్సిన్లు ఇప్పుడు ప్రయోగదశలో ఉన్నాయన్నారు. ఐసిఎంఆర్- భారత్ బయోటెక్ ఆధ్వర్యంలో తయారవుతున్న కొవాక్సిన్ బాగా పురోగతిలో ఉందన్నారు. ఆ తరువాత సీరమ్ ఇన్ స్టిట్యూట్ వారి కోవిషీల్డ్ కూడా పురోగతిలో ఉన్నదని చెప్పారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వారు తయారుచేసిన వాక్సిన్ ను ఈ సంస్థ పరీక్షించి చూస్తున్నదన్నారు. ఈ రెండూ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. ఆఖరిదశ మానవ పరీక్షలు ముగిశాక డాక్టర్ రెడ్డీస్ వారు సంబంధిత అనుమతులు పొందిన అనంతరం రష్యా వాక్సిన్ ను భారత్ లో పంపిణీ చేస్తారని కూడా చెప్పారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675327

పిఐబి క్షేత్ర స్థాయి సిబ్బంది సమాచారం

  • మహారాష్ట్ర: రాష్ట్రానికి విమాన, రైలు, రోడ్డు మార్గాల్లో వచ్చే వారికి 25 నుంచి అమలయ్యేలా మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆచరణా ప్రామాణిక విధానాలు ప్రకటించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, గోవా, మహారాష్ట్ర నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ సమర్పించాలి. 9-12 తరగతులకు సంగ్లి, సతారా, వాషీమ్ జిల్లాలలో పాఠశాలలు పునఃప్రారంభించగా ముంబయ్, థానే, పూణె, నాసిక్, నాగ్ పూర్ నగరపాలక సంస్థలలో మాత్రం కోవిడ్ ఇంకా ఉన్నందున పునఃప్రారంభించకూడదని నిర్ణయించాయి. డిసెంబర్ 6న డాక్టర్ అంబేడ్కర్ వర్ధంతి మహాపరినిర్వాణ్ దినం సందర్భంగా చైతన్యభూమి వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడవద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
  • గుజరాత్: సూరత్ మున్సిపాలిటీ కోవిడ్ పడకలు నాలుగు రెట్లు పెంచాలని నిర్ణయించింది. గుజరాత్ లో ఇటీవల దీపావళి తరువాత మళ్ళీ కోవిడ్ విజృంభించటంతో ప్రభుత్వం కూడా నాలుగు ప్రధాన నగరాలలో పరీక్షాకేంద్రాలు పెంచాలని నిర్ణయించింది. వాటిలో అహమ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్ ఉన్నాయి.అహమ్మదాబాద్ నగరం 35 కంటెయిన్మెంట్ జోన్లను ప్రకటించింది.ఈ జోన్లలో ఇంటింటికీ వెళ్ళి కోవిడ్ పరీక్షలు జరుపుతున్నారు. ఇలా ఉండగా పర్యాటక కేంద్రాలైన దంగ్, వల్సాద్ మూసివేశారు. .
  • రాజస్థాన్: రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతున్నదని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కోవిడ్ పరిస్థితిని సమీక్షించారు. . మొదటి సారిగా రాష్ట్రంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 24 వేలు దాటింది. గత మూడు రోజులుగా రోజుకు 3,000 కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జైపూర్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 8,000 దాటింది. జోధ్ పూర్ లో 5 వేలు పైబడింది. ఆల్వార్, బికనీర్, అజ్మీర్, కోట జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతునన్నాయి. సోమవారం 18 మంది చనిపోగా మొత్తం మరణాలు 2181 కి చేరాయి.
  • మధ్య ప్రదేశ్: భోపాల్ లో ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ మాస్కులు పంపిణీ చేశారు. ప్రజలంతా కచ్చితంగా మాస్కులు ధరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు 1.94 లక్షలు దాటాయి. గత 24 గంటలలో 1,701 కొత్త కేసులు వచ్చాయి. మరో పది మంది మరణించగా మృతుల సంఖ్య 3,172 కి చేరింది. ఇండోర్ లో గరిష్ఠంగా 586 మంది, ఆ తరువాత భోపాల్ లో 349 మందికి సోమవారం కరోనా సోకింది. మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం 12, 336 మంది చికిత్సలో ఉన్నారు.
  • చత్తీస్ గఢ్: సోమవారం నాడు రాష్ట్రంలో 2,061 కొత్త కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,25,497 కి, మరణాలు 2,746 కి చేరాయి. కోలుకున్నవారు 2 లక్షలకు పైబడి 2,00,825 కు చేరారు. 105 మంది ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ కాగా 1,182 మంది ఇళ్లలో క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. రాష్ట్రంలొ ప్రస్తుతం 21,926 మంది చికిత్సపొందుతూ ఉన్నారు.
  • గోవా: సోమవారమ్ గోవాలో 75 కొత్త కోవిడ్ కేసులు గుర్తించారు. 104 మంది కొలుకున్నారు. 1140 మంది ఇంకా చికిత్సలో ఉన్నారు. కోవిడ్ మరణాలేమీ నమోదు కాలేదు. 1140 శాంపిల్స్ పరీక్షించగా పాజిటివ్ శాతం 5 గా నమోదైంది. 96% కోలుకోగా మరణాల శాతం తగ్గింది.
  • కేరళ: కేంద్ర ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా కేరళ ప్రభుత్వం ప్రైవేట్ ట్యూషన్ సెంటర్లకు, కంప్యూటర్ సెంటర్లకు, నాట్యశిక్షణాకేంద్రాలకు అనుమతి ఇచ్చింది. . సగం సీట్లు మాత్రమే నిండేలా హాల్స్ కు అనుమతి ఇచ్చింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్నికల కమిషన్ సాయంతో కోవిడ్ నిబంధనలు అమలు చేయటంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిమగ్నమైంది. చాలాచోట్ల అభ్యర్థులు, వారి సహచరులు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 5 లక్షలు దాటింది. .. పాజిటివ్ శాతం 10.54% కాగా 3,757 కొత్త కేసులు, 22 మరణాలు నమొదయ్యాయి. మొత్తం మరణాలు 2,071 కి చేరాయి..
  • తమిళనాడు: తీవ్ర తుపానును ఎదుర్కోవటానికి తమిళనాడు సన్నద్ధమయింది. తమిళనాడు-పాండిచ్చేరి మధ్య కారైకల్- మహాబలిపురం మధ్య బుధవారం దగ్గర తీరం దాటుతుందని అంచనావేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరిపి నివర్ తుపాను ప్రభావాన్ని అంచనా వేశారు. 30 పడవలతో మత్స్య కారులు సముద్రంలో చిక్కుబడినట్టు తెలుస్తోంది. పాండిచ్చేరిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. 196 సహాయ శిబిరాలు ఏర్పాటయ్యాయి. సహాయకచర్యలకోసం సంప్రదించటానికి ఒక యాప్ ను తమిళనాడు ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
  • కర్నాటక: ఈరోజు కోవిడ్ మీద ప్రధాని నిర్వహించిన వీడియీ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రితో బాటు ఆరోగ్య శాఖామంత్రి పాల్గొన్నారు. కేంద్రం ఆదేసాలమేరకు వాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నట్టు చెప్పారు.. 29,451 వాక్సిన్ పంపిణీ కేంద్రాలు, 10,000 మందికి పైగా వాక్సినేటర్లను గుర్తించారు. 2,855 నిల్వ కేంద్రాలను వాడుకోబోతున్నట్టు ఆరోగ్యమంత్రి డాక్టర్ కె సుధాకర్ చెప్పారు.
  • ఆంధ్రప్రదేశ్: వాక్సిన్ పంపిణీమీద ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ముఖ్యమంత్రి అధికారులతో సమావేశమయ్యారు.వాక్సిన్ పంపిణీ విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వాక్సిన్ ను భద్రపరచటం మొదలు అనేక అంశాలు చర్చించారు. రాష్ట్రంలో 1.46 లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యం ఉండగా మరో 23,500 లీటర్లు పెంచాలని సూచించారు.

· తెలంగాణ: 921 కొత్త కేసులు, 1097 కోలుకున్న కేసులు, 4 మరణాలు గత 24 గంటల్లో నమొదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 2,65,049కి; చికిత్సలో ఉన్నవి: 11,047 కు; మరణాలు: 1437 కి చేరాయి. కోలుకున్నవారు 2,52,565 కాగా కోలుకున్నశాతం 95.28 కి చేరింది.

  • అస్సాం: గత 24 గంటలలో అస్సాంలో 25225 కోవిడ్ పరీక్షలు జరపగా 169 కొత్త కేసులు బైటపడ్దాయి.
  • సిక్కిం: సిక్కింలో కొత్త కేసులు 41 బయట పడ్దాయి. చికిత్సలో ఉన్నవారు 238 మంది కాగా 4351 కేసులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

నిజనిర్థారణ

 

 

 

 

 

 

 

Image

Image

*******

 



(Release ID: 1675510) Visitor Counter : 172