ఆర్థిక మంత్రిత్వ శాఖ
మహమ్మారి సమయంలో సంస్కరణల వేగం కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకునే దశలో ఉందని అన్నారు.
Posted On:
23 NOV 2020 7:14PM by PIB Hyderabad
ప్రస్తుత మహమ్మారి కాలంలో వృద్ధికి దారితీసిన సంస్కరణలను వేగంగా కొనసాగించామని, ఇక నుంచి కూడా ఇవి కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి అన్నారు. ఈ రోజు ఇక్కడ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) నిర్వహించిన జాతీయ ఎంఎన్‌సి కాన్ఫరెన్స్ 2020 లో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు.
ఆర్థిక రంగంలో మరింత వృత్తినైపుణ్యాన్ని తేవడం , పెట్టుబడుల ఉపసంహరణకు చర్యలు తీసుకోవడం ద్వారా సంస్కరణలకు ఊతమిస్తున్నామని అన్నారు. "అన్ని సంస్థలు, ఎంఎన్సీ లు , ఇండియా ఇన్కార్పొరేషన్లు, పెద్ద, మధ్య , చిన్న సంస్థల (ఎంఎస్ఎంఈలు) వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. భారతదేశాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడానికి ఎంచుకున్న విధానాలు సరైనవేనని మేము నిర్ధారించుకోవాలి ”అని సీతారామన్ స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ పరిధిలో ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు న్యూక్లియర్ ఎనర్జీ, స్పేస్ వంటి రంగాలతో సహా అనేక రంగాల్లో పెట్టుబడులకు ద్వారాలను తెరిచాయి ఆత్మనిర్భర్ ప్యాకేజీ భారతదేశాన్ని అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బయటికి తీసుకురావడానికి కాదు. పోటీతత్వాన్ని పెంచడం ద్వారా అంతర్జాతీయ వాల్యూ చెయిన్లలోనూ దూసుకెళ్లేలా చేయడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం”అని ఆమె అన్నారు. భారతదేశం నుండి పనిచేస్తున్న ఎంఎన్‌సిలకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని సీతారామన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఎంఎన్‌సిలతో వారి సమస్యలపై చర్చిస్తున్నార, సంస్కరణలు , తగ్గిన పన్ను రేట్లపై ప్రభుత్వం చూపిన ఉత్సాహంతో, అనేక సావరిన్ ఫండ్లు మనదేశ జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పాలుపంచుకోవడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయని వివరించారు.
సంస్కరణల ఎజెండాకు అనుగుణంగా, ఆరు రాష్ట్రాల్లో ఫార్మా, మెడికల్ డివైజెస్ , ఎపిఐల ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్రత్యేక ఉత్పాదక మండలాల ఏర్పాటు చేస్తున్నామని, ప్రభావవంతమైన ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులు ఇస్తున్నామని వివరించారు. కరోనావైరస్ సంక్షోభం సమయంలో కూడా ప్రధానమంత్రి భారీ సంస్కరణలను విడిచిపెట్టలేదని ఆమె స్పష్టం చేశారు. సంస్కరణల వేగం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
ప్రస్తుత ఆర్థిక వాతావరణంలో సర్వసాధారణంగా మారిన శీఘ్ర సంస్కరణలను ఎంఎన్‌సిలు గుర్తించాయని ఎంఎన్‌సిలపై సిఐఐ ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్మన్ సౌమిత్రా భట్టాచార్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. కోవిడ్ అనంతర ప్రపంచంలో ప్రపంచ సరఫరా గొలుసులలో మార్పులను బట్టి సంస్కరణలు కొనసాగాలని, ఇవి చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను భారతదేశానికి మార్చడానికి అనేక విదేశీ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని భట్టాచార్య అన్నారు.
సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ అనేక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ఎంఎన్‌సిల కోసం బలమైన, శక్తివంతమైన , చైతన్యవంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం శ్రమిస్తోందన్నారు. ఎఫ్‌డిఐ పరిమాణాన్ని బట్టి స్లాబ్ ఆధారిత ప్రోత్సాహకాలను అందజేసే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. "విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశాన్ని మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చడంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిఐఐ కట్టుబడి ఉంది" అని ఆయన చెప్పారు.
****
(Release ID: 1675328)
Visitor Counter : 188