ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
40 వేలకి దిగువన రోజువారీ కొత్త కేసులు
చికిత్సలో ఉన్న వారి సంఖ్య 4.4 లక్షలలోపు
రోజువారీ పాజిటివ్ కేసులు 3.45%
Posted On:
24 NOV 2020 12:34PM by PIB Hyderabad
ఆరు రోజుల తరువాత భారత లో కొత్త కోవిడ్ కేసులు 40 వేలలోపు నమోదయ్యాయి. గత 24 గంటలలో 37,975 కొత్త పాజిటివ్ కేసుల నిర్థారణ జరిగింది. నవంబర్ 8 నుంచి వరుసగా 17 రోజులుగా కొత్త కేసులు 50,000 కు లోపే ఉంటూ వస్తున్నాయి.
దేశంలో కోవిడ్ పరీక్షల మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 2134 లాబ్ లు ఉన్నాయి. రోజుకు పది లక్షలకు పైగా పరీక్షలు జరపాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ విధమైన మౌలిక సదుపాయాల పెంపుదల జరిగింది. గత 24 గంటలలో 10,99,545 శాంపిల్స్ పరీక్షించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు జరిపిన మొత్తం కోవిడ్ నిర్థారణ పరీక్షల సంఖ్య 13 కోట్లు దాటి 13,36,82,275 కు చేరింది.
సగటున రోజుకు 10 లక్షలకు పైగా కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరుపుతూ ఉండటం వలన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య దిగువ స్థాయిలో ఉండిపొతున్నది.
ఇప్పటివరకు జరిపిన పరీక్షలలో పాజిటివ్ గా నిర్థారణ జరిగిన కేసుల శాతం నేటికి 6.87% కు చేరి 7శాతానికి దిగువన నిలిచింది. రోజువారీ పాజిటివ్ నిర్థారణ శాతం ఇప్పుడు 3.45% మాత్రమే ఉంది. దీన్ని బట్టి కోవిడ్ నిర్థారణ పరీక్షలు ఎక్కువవుతున్నకొద్దీ పాజిటివ్ శాతం తగ్గుతూ వస్తునట్టు స్పష్టమవుతోంది.
ప్రతి పదిలక్షల జనాభాల్లో కోవిడ్ పరీక్షల సంఖ్య పెరిగి 96,871 కు చేరింది.
గత కొద్దివారాలుగా, చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటలలో 42,314 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఇంకా చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య 4,38,667 కి తగ్గింది. మొత్తం పాజిటివ్ కేసులుగా నమోదైన వారిలో ఇంకా చికిత్స పొందుతున్నవారు కేవలం 4.78% కాగా, ఇది తగ్గుతున్న ధోరణికి అద్దం పడుతోంది.
కోలుకున్నవారి శాతం కూడా పెరుగుతూ 93.76% అయింది. ఈరోజు వరకు కోలుకున్నవారు 86,04,955 మంది. గత 24 గంటలలో తాజాగా కోలుకున్న వారిలో 75.71% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. అత్యధికంగా ఢిల్లీలో 7,216 మంది కోలుకోగా, కేరళలో 5,425 మంది, మహారాష్ట్రలో 3,729 మంది కోలుకున్నారు. .
కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసులలో 77.04% కేవలం 10 రాష్ట్రాలకు చెందినవి కాగా అందులో ఢిల్లీలో అత్యధికంగా 4,454 కేసులు, ఆ తరువాత మహారాష్ట్రలో 4,153 కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటలో 480 మరణాలు నమోదయ్యాయి.అందులో 10 రాష్ట్రాల్లోనే 73.54% మంది చనిపోయారు. ఢిల్లీలో అత్యధికంగా 121 మంది చనిపోగా, పశ్చిమబెంగాల్ లో 47 మంది, మహారాష్ట్రలో 30 మంది మరణించారు.
****
(Release ID: 1675254)
Visitor Counter : 206
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam